Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
కొత్తగా తల్లులైనవారు చేసే 7 అతిపెద్ద తప్పులు
ఒక తల్లిగా ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం అంత సులభమైన విషయం కాదు, ప్రతి కొత్త తల్లి జాగ్రత్తగా ఉండడానికి, అలాంటివి చేయకుండా ఉండడానికి సాధారణంగా అనేక తప్పులను చేస్తారు. నిజానికి, తప్పులనేవి అంత చెడ్డవి కావు, అవి మంచిని తెలుసుకోవడానికి సహాయపడతాయి, కానీ కొన్నిసార్లు వాటిని నివారించడం మంచిది. మీరు కొత్తగా తల్లి అయిఉంటే, కొత్తగా తల్లులైనవారు చేసే అతిపెద్ద తప్పుల జాబితాను పరిశీలించండి.

త్వరగా కోలుకోవాలని ప్రయత్నించడం
కొత్తగా తల్లులైనవారు బిడ్డ జన్మించిన మొదటి నుండి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది అతిపెద్ద తప్పుల్లో ఒకటి. మా సోదరి ఇదే తప్పు చేసింది, నా ప్రాణ స్నేహితురాలు ఇదేపని చేసింది, అనుకోకుండా, నేనుకూడా ఈ సాధారణమైన తప్పు చేశాను. ఇక్కడ విషయం ఏమిటంటే, కొత్తగా తల్లైనవారు తమ కాళ్ళపై తాము ఇదివరకులాగా నిలబడాలని, వారి పనులు వారే చేసుకోవాలని ఎక్కువ తాపత్రయ పడతారు. మీరు కొత్తగా తల్లయితే, మీ శరీరం కోలుకోవడానికి తగినంత సమయం ఇవ్వడం చాలా అవసరం.

పిల్లలు మేలుకొని ఉన్నపుడు వారి గోర్లను కత్తిరించడం
నేను మొదటి బిడ్డను కన్నపుడు, అది తప్పు అని నిజంగా నేను తెలుసుకోనపుడు చేసిన మరో తప్పు. బేబీ నిద్రపోయేటపుడు గోళ్ళను కత్తిరించడం చాలా తెలికనే విషయం నాకు తెలీదు. మీరు కనక తల్లి అయిఉంటే, పిల్లల గోళ్ళు కత్తిరించడం ఎంత కష్టమైనా పనో మీకు తెలిసే ఉంటుంది, మీరు తరచుగా అనేకసార్లు ఆ చిన్ని చేతులు అటూఇటూ కదలడంతో తీయడం మానేసే ఉంటారు.

తమనుతాము తక్కువగా అంచనా వేసుకోవడం
కొత్తగా తల్లులైనవారు తరచుగా తమనుతాము తక్కువగా అంచనా వేసుకుంటారు, ఇది చాలా విచారకరం. పిల్లలపై ఎలా శ్రద్ధ పెట్టాలో నేర్చుకోవడం కష్టమైనపుడు, తల్లికంటె ఎక్కువ శ్రద్ధ ఎవరూ చూపించలేరనే విషయాన్నీ మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా తప్పుచేసినపుడు మిమ్మల్ని మీరు ఒక చెడ్డ తల్లిగా భావించొద్దు. మీరు మీ పిల్లలపై శ్రద్ధ చూపించే, ప్రేమగా చూసుకునే గొప్ప తల్లి. మీ పిల్లకు మీ నమ్మకం అలాగే మీ భర్త చాలా అవసరం.

తండ్రిని వదిలేయడం
నేను మొదటగా తల్లినైనపుడు ఇదే తప్పు చేశాను, కానీ నన్ను ఈ విషయంలో వదిలేసావు అని నా భర్త అన్నపుడు, నిజానికి అతనుకు కూడా తండ్రేకదా అని అర్ధం చేసుకున్నాను. నేను కొత్తగా తల్లినయ్యాననే విధానంలో ఉన్నాను, పిల్లల జాగ్రత్త, బాధ్యతా విషయంలో అతనిని కూడా కలుపుకోవాలని మర్చిపోయాను. ప్రతి ఒక్క తల్లి అనుకోకుండా చేసే తప్పుల్లో ఇదికూడా ఒకటి. అదృష్టవశాత్తూ, దీనిని పరిష్కరించడం తేలిక. ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ బేబీ తో మీ భర్తను కూడా కలుపుకొని ఉండేట్లు చేయడం ప్రారంభించండి.
మీ పిల్లలకు మీరు ఒక రోల్ మోడల్ గా ఉండడానికి 9 సాధారణ మార్గాలను - కూడా చదవండి

పిల్లలు ఒక ఉపశమనానికి అలవాటు పడడం
కొత్తగా తల్లైనవారు పిల్లలకు ఒక అలవాటును ఉపయోగిస్తారు. దాన్ని ప్రతి వారం మార్చడానికి ప్రయత్నం చేయాలి, అలాచేస్తే మీ పిల్లలు ఒకరకమైన ఉపశమనానికి అలవాటుపడరు. మీ శిశువు ఒకరకమైన ఉపశమనానికి అలవాటు పడితే, దానిని భార్తీచేయడం కష్టమౌతుంది, మీ పిల్లడు మరేఇతర వస్తువును అంగీకరించాడు. ఇది నేను అనుభవంతో నేర్చుకున్న పాఠం, ఎట్టి పరిస్థితులలో ఇలాంటి తప్పు చేయొద్దని మీకు సిఫార్సు చేస్తున్నాను.

వారు ప్రశ్నలు అడగరు
కొత్తగా తల్లైనవారు తరచుగా ప్రశ్నలు అడగరు, ఎందుకంటే వారి దగ్గర చాలా ఉంటాయి. వారి ప్రశ్నలు అర్ధంలేనివని భావిస్తారు, కానీ నిజానికి అర్ధంలేని ప్రశ్నలంటూ ఏవీ ఉండవు. మీ పిల్లల విషయంలో ఇలాంటివి తెలుసుకోవడానికే పిల్లల వైద్యులు, డాక్టర్లు ఉన్నది. ప్రశ్నలు అడగండి, కొత్తగా జన్మించిన శిశువులతో, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తప్పకుండా వారు సహాయం చేస్తారు.

వారు సహాయం అడగడానికి భయపడతారు
మీరు పిల్లలకు తల్లిపాలను ఇవ్వాలనుకుంటే, మీరు ఇదొక సమయంలో కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా చేసే చాలామంది తల్లులు సిగ్గుపడతారు కూడా. తల్లిపాలు అనేవి సహజంగా వస్తాయి అనేది మీరు గ్రహించాలి, ఏదైనా తప్పు జరిగినపుడు మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. తల్లులందరికీ ప్రారంభం నుండి తల్లిపాలు ఇవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు, ఈ విషయంలో మీకు సహాయం అవసరం, సహాయం కోరడానికి భయపడవద్దు.

మీరు ఒక ఖచ్చితమైన తల్లిగా ఉండలేకపోతే
మీరు ఒక ఖచ్చితమైన తల్లిగా ఉండలేకపోతే, ఒక మంచి తల్లిగా ఉండడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. నిజం, సాధారణంగా కొత్త తల్లులు చేసే కొన్ని సాధారణ తప్పులు, ఇక్కడ చేయకూడని అనేక ఇతర తప్పులు కూడా ఉన్నాయి. మీరు కొట్టగా తల్లైనపుడు మీరు ఎలాంటి తప్పులు చేస్తారు? మీ ఆలోచనలను మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications
