బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత రొమ్ములు తిరిగి ఫిట్ గా మారడానికి చిట్కాలు

By Super

ప్రెగ్నన్సీ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఏదో ఒక విధమైన ప్రభావం శరీరంపై ఉంటుంది. మీ వక్షోజాలలో కూడా గర్భధారణ ఎన్నో మార్పులను కలిగిస్తుంది. కొన్ని మార్పులు నొప్పి కలిగించేవి కాగా మరికొన్ని ఎటువంటి ఇబ్బందులు లేని చిన్న చిన్న మార్పులు. వక్షోజాలలో ఏర్పడే మార్పులన్నీ శిశువుకు పాలివ్వడానికి గర్భం దాల్చిన సమయంనుండే మొదలవుతాయి.

వక్షోజాలు సాగిపోతున్నాయని , వేలాడుతున్నాయని పిల్లలకు పాలిచ్చే తల్లులు తరచూ చేసే కంప్లైంట్. కొంత మంది తల్లులకు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఇష్టమైనప్పటికీ తద్వారా శరీరంలో కలిగే మార్పుల వల్ల ఇబ్బందులకు గురవుతారనే భయం కూడా ఉంటుంది. వక్షోజాలను మళ్ళీ పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ఎంతో కష్టపడాలి.

అయిదు సహజసిద్ధమైన పద్దతుల ద్వారా వక్షోజాలను మళ్ళీ షేప్ లోకి ఎలా తీసుకురావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పౌష్టికాహారాన్ని తీసుకోండి

1. పౌష్టికాహారాన్ని తీసుకోండి

ప్రసవం తరువాత చాలా మంది మహిళలు చేసే కామన్ మిస్టేక్ సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం. లావైపోతారేమోనన్న భయంతో శరీరానికి అవసరమయ్యే సాచురేటెడ్ ఫ్యాట్స్ ను తీసుకునే మోతాదును బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో తగ్గించేస్తారు. దీని వల్ల స్కిన్ డ్యామేజ్ కలుగుతుంది. వక్షోజాల చుట్టూ ఉన్న చర్మం షేప్ పాడయిపోతుంది. ఎలాస్టిసిటీ తగ్గిపోయి సాగిపోతుంది. బ్రెస్ట్స్ యొక్క సెల్ మెంబ్రేన్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ద్వారానే తయారవుతాయి.

ప్రసవమైనప్పటి నుంచి బిడ్డకు పాలివ్వడం వల్ల కలిగే స్ట్రెచ్ మార్క్స్ ని నిర్మూలించే శక్తి కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ కి ఉంది. కాబట్టి నర్సింగ్ టైంలో సరైన పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది. మీ ఆహారంలో తప్పని సరిగా ఎగ్స్, మీట్ డైరీ ప్రోడక్ట్స్ తగినంత ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. స్కిన్ ఎలాస్టిసిటీని పరిరక్షించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి.

2. బ్రెస్ట్ ఫీడింగ్ ను సరైన ఏజ్ లో మాన్పించడం

2. బ్రెస్ట్ ఫీడింగ్ ను సరైన ఏజ్ లో మాన్పించడం

మీ బ్రెస్ట్స్ ను సాగిపోవడం నుంచి రక్షించుకోవడానికి మీ బేబీని ఆకస్మికంగా బ్రెస్ట్ ఫీడింగ్ ను దూరం చేయకండి. మీ బేబీని గమనిస్తూ మెల్ల మెల్లగా బ్రెస్ట్ ఫీడింగ్ అలవాటు నుంచి తప్పించండి. ఏడెనిమిది నెలలకి పిల్లలు సెమీ సాలిడ్ ఫుడ్స్ కి అలవాటు పడతారు. అప్పుడు తల్లిపాలు తాగే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అలా మెల్ల మెల్లగా చిన్నారికి తల్లిపాల అలవాటును మాన్పించవచ్చు.

అయినప్పటికీ WHO గైడ్ లైన్స్ ప్రకారం పాపాయికి రెండేళ్ళ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ మీ బ్రెస్ట్స్ షేప్ ని కాపాడుకోవాలి అనుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గించాలి. ఒక్కసారి మీ చంటిబిడ్డ సరైన ఆహార పద్దతులకు అలవాటు పడగానే బ్రెస్ట్ ఫీడింగ్ ను రోజుకు ఒక్కసారికే పరిమితం చేయవచ్చు. అలా మెల్ల మెల్లగా బ్రెస్ట్ ఫీడింగ్ ను తగ్గించవచ్చు. మీ పాపాయి రెండేళ్ళ వయసుకు వచ్చే సరికి బ్రెస్ట్ ఫీడింగ్ ను మానిపించేయవచ్చు.

3. ఫీడింగ్ సమయంలో వక్షోజాలను సపోర్ట్ గా పట్టుకోండి

3. ఫీడింగ్ సమయంలో వక్షోజాలను సపోర్ట్ గా పట్టుకోండి

ఫీడింగ్ సమయంలో సౌకర్యంగా కూర్చుని ప్రోపర్ బ్యాక్ సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. ఎడమ వైపు నుంచి బేబీకి ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే బేబీ ఎడమ చేతిని వంపుగా ఉంచి బేబీకి హెడ్ రెస్ట్ వచ్చేలా జాగ్రత్త తీసుకోండి. మీ పాపాయి శరీరానికి సపోర్ట్ ఇవ్వడానికి మీ ఆర్మ్స్ ని ఉపయోగించండి. ఆ తరువాత ఎడమ చేతి వక్షోజాన్ని మీ కుడిచేత్తో కొద్దిగా ఎత్తి పాపాయికి పాలు పడితే బ్రెస్ట్ టిష్యూలు ఎక్కువగా అలసిపోవు. పాపాయి కూడా హాయిగా పాలు తాగుతుంది.

బ్రెస్ట్ షేప్ ను పునరుద్ధరించేందుకు సర్జికల్ విధానాలు

బ్రెస్ట్ షేప్ ను పునరుద్ధరించేందుకు సర్జికల్ విధానాలు

మాస్టోపెక్సీ లేదా బ్రెస్ట్ లిఫ్ట్ : సాగిపోయిన, వదులుగా మారిన వక్షోజాలతో సతమతమయ్యే మహిళలు ఈ పద్దతి ద్వారా లాభం పొందుతారు. వక్షోజాలలో పేరుకుపోయిన అదనపు ఫ్యాట్ టిష్యూలను సర్జికల్ విధానాల ద్వారా తొలగిస్తారు. ఈ విధానం వల్ల బ్రెస్ట్ టైట్ గా మారి ఇదివరకటి అందాన్ని సంతరించుకుంటాయని నిపుణులంటున్నారు. అంతే కాకుండా ఈ ప్రొసీజర్ ద్వారా ల్యాక్టేషన్ వల్ల పెరిగిన నిపుల్స్ సైజ్ ను తగ్గించుకోవచ్చు. ఎరోలా సైజ్ ను కూడా తగ్గించుకోవచ్చు.

5. బ్రెస్ట్ ఇంప్లాంట్ :

5. బ్రెస్ట్ ఇంప్లాంట్ :

కొన్ని సందర్భాలలో, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మహిళలలో స్తనాల సైజ్ తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని ప్సియోడోప్టోసిస్ అనంటారు. దీని వల్ల వక్షోజాల అందం తగ్గిపోతుంది. ఈ సమస్యతో సతమతమయ్యే మహిళలు బ్రెస్ట్ లిఫ్ట్ ద్వారా బెనిఫిట్ ను పొందవచ్చు. ఇంప్లాంటేషన్ కూడా అవసరం.

సాధారణంగా ఇంప్లాంట్స్ ని వక్షోజాల కండరాల వెనుకగా చేస్తారు. దీని వల్ల బ్రెస్ట్ టిష్యూస్ సురక్షితంగా ఉంటాయి. తదుపరి డెలివరీ తరువాత మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్ చేసుకునేందుకు వీలుగా ఇలా ఏర్పాటు చేస్తారు. జెల్ లాంటి పదార్ధం లేదా ఫ్లూయిడ్ తో నిండిన ఫ్లెక్సిబుల్ తిత్తిని ఇంప్లాంటేషన్ కు వాడతారు. దీనిని వక్షోజాల కండరాల వెనుకగా చేరుస్తారు. కొన్ని కాస్మెటిక్ రీజన్స్ వల్ల కూడా ఈ సర్జరీని చేయించుకుంటారు.

సాగిపోయిన వక్షోజాలతో, కిందకు వంగినట్టుగానున్న నిపుల్స్ తో, షేప్ పోయిన బ్రెస్ట్స్ తో మహిళలు ఇబ్బంది పడుతుంటే బ్రెస్ట్ లిఫ్ట్ తో పాటు ఇంప్లాంట్స్ ని సిఫార్సు చేస్తున్నారు నిపుణులు.

6. లైపో ఫిల్లింగ్ :

6. లైపో ఫిల్లింగ్ :

వక్షోజాలని సరిచేసుకోవడానికి సర్జరీలంటే భయపడేవారు లైపో ఫిల్లింగ్ ను లేదా ఇంజక్షన్ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఈ విధానాల ద్వారా ఫ్యాట్ టిష్యూస్ ని వక్షోజాలను అందంగా తీర్చిదిద్దుకునే అవకాశం కలదు.

సర్జికల్ విధానాల ద్వారా వక్షోజాలను పునరుద్ధరించే క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి

Desktop Bottom Promotion