ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణాలు క్షేమకరమా?

By B N Sharma
<ul id="pagination-digg"><li class="next"><a href="/pregnancy-parenting/pre-natal/2011/which-mode-travel-during-pregnancy-200911-aid0181.html">Next »</a></li></ul>

Is Travel During Pregnancy Safe?
గతంలో గర్భవతులుగా వున్నపుడు ప్రయాణాలు వద్దనేవారు. కాని ఇపుడు పెరిగిన సౌకర్యాల కారణంగా వారు కూడా ప్రయాణాలు చేస్తూనే వున్నారు. దీనికి వైద్యులు కూడా ఒప్పుకుంటూనే వున్నారు. ఉద్యోగ మహిళలకు, ఒకే బిడ్డ వున్న తల్లులకు ప్రయాణాలు తప్పని సరి అవుతున్నాయి. గర్భవతుల ప్రయాణాలు సుక్షితమే కాని, పూర్తిగా సురక్షితమని చెపటానికి వీలు లేదు.

గర్భవతికి ప్రయాణాలు ఎపుడు సురక్షితం?
రెండో త్రైమాసికం అంటే 17 నుండి 28 వారాలవరకు ప్రయాణం సౌకర్యమే. ఈ దశలో ఉదయ వికారం కొంత వెనుకపడుతుంది కనుక ప్రయాణాలు చేసినా పరవాలేదు. మొదటి త్రైమాసికం ప్రయాణానికి అనువైనది కాదు. ఈ సమయంలో ప్రయాణాలు గర్భ విచ్ఛిన్నానికి కూడా దోవతీస్తాయి. ఎక్కువ దూరం కారు ప్రయాణం లేదా సమతలం లేని కొండ ప్రాంతాలు ప్రయాణించటం మంచిది కాదు.

మూడో త్రైమాసికం మొదటి త్రైమాసికమంత హాని కాదు. కాని రెండో త్రైమాసికం కంటే తక్కువ సురక్షితమే. విమాన ప్రయాణాలు 32వ వారం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఇక కారు లేదా రైలు ప్రయాణాలలో కొన్ని ముందస్తు జాగ్రత్తలతో ప్రయాణం అవసరమనుకుంటే చేయాలి.

<ul id="pagination-digg"><li class="next"><a href="/pregnancy-parenting/pre-natal/2011/which-mode-travel-during-pregnancy-200911-aid0181.html">Next »</a></li></ul>

Story first published: Tuesday, September 20, 2011, 10:23 [IST]
Desktop Bottom Promotion