Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎంత ప్రయత్నించినా బిడ్డ పుట్టటం లేదా?

అండోత్సర్గం - ఉద్యోగం చేసే మహిళలు సాధారణంగా ఒత్తిడికల జీవన విధానాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగంలోను, వ్యక్తిగత జీవనంలోను వీరికి ఒత్తిడి ఉంటుంది. అటువంటపుడు వీరిలో అండాల విడుదల సరిగా ఉండదు. ఉన్నప్పటికి కొద్ది స్ధాయిలో ఉంటుంది. కనుక వీరికి గర్భం ధరించటం కష్టం అవుతుంది. వీరికి గర్భాశయంలో చేరే శ్లేష్మం ఎప్పటికపుడు సూచనలిస్తుంది. అండోత్సర్గం నాటికి గర్భంలో తడికి బదులుగా మీరు పొడి పొడి భాగాలను గమనిస్తారు. వీరు చేయవలసినదల్లా ఒత్తిడి తగ్గటానికి వైద్య విధానాలు లేదా ధ్యాన విధానాలు ఆచరించడమే.ఈ రకమైన చికిత్సలు వీరి ఒత్తిడిని తగ్గించి గర్భం ధరించే అవకాశాలు పెంచుతాయి.
ఒత్తిడి ఎలా ఉంటోంది. నిరంతరం ఉంటోందా లేక, సడన్ గా భావిస్తున్నారా అనేది విశ్లేషించాలి. నిరంతరం ఒత్తిడి భావించే వారికి వంధ్యత్వం తప్పక ఏర్పడుతుంది. అయితే, పెళ్ళి కారణంగా, లేదా ప్రయాణాలు కారణంగా మొదలైన కారణాలవలన అప్పటికపుడు ఒత్తిడి కలిగి తగ్గిపోయే ఒత్తిడికి ఈ ప్రభావం ఉండకపోవచ్చు.
రుతుక్రమం - నేటి రోజుల బిజీ జీవన విధానం కూడా మహిళల రుతు చక్రాన్ని అపసవ్యం చేస్తోంది. ఆరోగ్యకరంగా ప్రతి నెలా వచ్చే రుతుక్రమం మహిళ కు మంచి గర్భవతి అవకాశాలనిస్తుంది. కొంతమందిలో తక్కువ రోజులు, లేదా ఎక్కువ రోజులకు రుతుక్రమం రావటం లేదా అసలు రాకుండా కూడా జరగటం అవుతుంది. అటువంటపుడు మహిళ వంధ్యత్వం పొందుతుంది. కనుక రుతుక్రమం హెచ్చు తగ్గులు వచ్చే వారు తప్పక వైద్య సంప్రదింపులు పొందాలి. సరైన సమయంలో వచ్చేలా చూసుకోవాలి. అయితే, మహిళలు, వాతావరణ మార్పులు, జబ్బు పడటాలు కారణంగా కొన్ని సార్లు రుతుక్రమం పొందరు. అటువంటి కారణాలకు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
మైండ్ ...శరీర సంబంధాలు - గర్భవతి అవ్వాలనుకునే వారు తమ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. అధిక ఒత్తిడి బ్రెయిన్ పై ప్రభావం చూపుతుందని రీసెర్చి చెపుతోంది. అది కార్టిసోల్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోను అధికం అయితే వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తుంది. మీలో సంతాన సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. మరో చిన్న ప్రొటీన్ హార్మోన్ అయిన పెప్టైడ్ కూడా సంతాన సామర్ధ్యంపై పురుషులకు, స్త్రీలకు అడ్డంకిగా ఉంటుంది. ఒత్తిడి కలిగే వారిలోనే ఈ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మానసిక ఆందోళన కలిగినపుడు బ్రెయిన్ న్యూరో పెప్టైడ్స్ ను తయారు చేస్తుంది. కనుక వంధ్యత్వానికి దూరంగా ఉండాలంటే సంతోషంగా హాయిగా ఉండటం నేర్చుకోండి. పురుషులైనా, స్త్రీలైనా ఒత్తిడి బారిన పడితే వారిలో వంధ్యత్వం వచ్చే అవకాశాలుంటాయి.కనుక మీ అనారోగ్య జీవన విధానాలను వదిలి ఒత్తిడి తగ్గించుకొని విశ్రాంతిగా ఉండండి. సంతాన సామర్ధ్యం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications