Latest Updates
-
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..
గర్భవతి రతి చేస్తే బిడ్డకు ప్రమాదమా?

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ సెక్స్ చేస్తే గర్భంలో వున్న బిడ్డకు ప్రమాదకరమా అనేది గర్భవతులను, వారి భాగస్వాములను వేధిస్తున్న సమస్య. లోపల వున్న బేబీకి ఇబ్బంది కలిగిస్తున్నామా, నిద్రిస్తున్న బేబీని లేపటమవుతుందా? పేరెంట్స్ సెక్స్ చేస్తున్నట్లు లోపలి బేబీకి తెలుస్తుందా? ఇటువంటి అనుమానాలు కూడా వుంటాయి. మహిళ గర్భం లో వున్న పిండం చుట్టూ ఎమినియోటిక్ ద్రవాలు వుండి, గర్భాశయంలో బిడ్డ ఎంతో సుక్షితంగా వుండి బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా వుంటుంది. అయితే, మహిళ తాను గర్భం మోసే 9 నెలలలోను, మొదటి మూడు నెలల కాలంలో అలసట, మార్నింగ్ సిక్ నెస్, నిద్ర అధికమవటం మొదలైన కారణాలుగా సెక్స్ అంటే చివరి ప్రాధాన్యత చూపుతుంది. దీనికితోడు ఆమె స్తనాలు కామోద్రేకం కలిగితే నొప్పిపెడుతూంటాయి. ఒక వేళ పురుషుడు సెక్స్ తలపెట్టినా ఆమె తిరస్కరిస్తుంది.
రెండో త్రైమాసికంలో మహిళ కడుపులో బిడ్డకు కొంత అలవాటుపడి కామ వాంఛ కలిగి వుంటుంది. ఈ రెండో త్రైమాసికంలో జీవిత భాగస్వాములు ఆనందకర రతిని సౌకర్యంగా చేసుకోవచ్చు. దీనినే సెకండ్ హనీమూన్ గా కూడా చెపుతారు. ఈ సమయంలో మహిళకు సెక్స్ కోర్కెలు అధికం అవుతాయి. బేబీకి ఎటువంటి అపాయం కూడా వుండదు. చాలామంది పురుషులు తమ భాగస్వామి శారీరక లావణ్యం చూసి రతికి సిద్ధపడతారు.
మూడవ త్రైమాసికంలో కూడా సెక్స్ సాధ్యమే కానీ కడుపులో బిడ్డ పెద్దదవటంతో అసౌకర్యంగా వుంటుంది. సాధారణంగా రతి చురుకుదనం తగ్గిపోతుంది. ఇక మహిళ దృష్టి అంతా పుట్టబోయే బిడ్డపైనే వుంటుంది. బిడ్డ కదలికలు కూడా లోపల అధికంగా వుండటంతో అలసిపోతుంది.
ఇక ప్రెగ్నన్సీ చివరి దశలో 50 శాతం జంటలు తమ సెక్స్ కార్యాన్ని ఆపేస్తారు.



Click it and Unblock the Notifications
