Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గర్భిణీ బొప్పాయిని తినొచ్చా? తినకూడదా?
గర్భవతులు ఒక్క విషయం గమనించాలి. అదేమిటంటే.. మీరు తినేది కేవలం మీ ఒక్కరి కోసమే కాదు, కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసం కూడా. మీరు తీసుకునే ఆహారం మీదే మీ కడుపులో పెరిగే బిడ్డ ఎదుగుదల, పోషణ ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ఎన్నడూ విస్మరించకూడదు. క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించి చెకప్ చేయించుకుంటూ, మీరు తీసుకునే ఆహారం మీద తగిన శ్రద్ధ వహించడం ద్వారానే ఆరోగ్యవంతమైన బిడ్డకు మీరు జన్మనివ్వగలుగుతారు.
గర్భధారణ గురించిన ఆలోచన మొదలైనప్పటి నుంచే మీ ఆహారంలో తగిన మార్పులు చేసుకోవలసి ఉంటుంది. అధిక శాతం విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. గర్భధారణ జరిగినప్పటి నుంచి ప్రసవించే దశ వరకు గర్భిణి శరీరంలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆయా మార్పులకు తగినట్లుగా పోషకాహార అవసరాలు, జీర్ణశక్తి మారుతూ ఉంటాయి. రోజూ సమతుల్య ఆహారం తీసుకోవడం, అది కూడా క్రమం తప్పకుండా సరైన వేళల్లో తీసుకోవడం చేయాలి.
ముఖ్యంగా తీసుకొనే ఆహారంలో కొన్ని తినకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. అందుకు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాల్సి ఉంటుంది. కడుపులో శిశువు పెరుగుదల గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భాధారణ సమయంలో ఇంట్లో వారితో పాటు డాక్టర్లు కూడా బొప్పాయిని తినడకూడదని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే అది కొన్ని సందర్భాల్లో మిస్ కరేజ్ అవ్వడం లేదా అబార్షన్ అవ్వడం వంటివి జరగుతాయని పపాయ తినకూడదని చెబుతుంటారు. బొప్పాయి తింటే కలిగే నష్టాలేంటో చూద్దాం...

బాగా పండిన బొప్పాయి: బాగా పండిన బొప్పాయిను ప్రెగ్నెన్సీ టైమ్ లో తినవచ్చని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే బాగా పండిన బొప్పాయిలో విటమిన్ ఎ మరియు బి, బీటాకెరోటిన్, పొటాషియం ఉంటాయి కనుక ఇవన్నీ గర్భాధారణ సమయంలో అవసరం అవుతాయి కాబట్టి డాక్టర్లు సలహా ఇస్తుంటారు. గర్భాధారణ సమయంలో బాగా పండిన బొప్పాయిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బ్రిటీష్ జనరల్ ఆఫ్ న్యూట్రీషియన్స్ అధ్యయనం ప్రకారం పచ్చి బొప్పాయిని గర్భాధారణ సమయంలో తినకూడదని తేల్చింది. పండని బొప్పాయిని తినడం వల్ల గర్భాశయంలో సంకోచాలు ప్రేరేపించబడి మిస్ కరేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
పచ్చిబొప్పాయి తో వచ్చే సమస్యలు: పండిని బొప్పాయిని గర్భాధారణ సమయంలో తినడం మంచిది కాదు. ఇందులో ఉన్నపపైన్ పిండం యొక్క పెరుగుదలను మరియు అభివృద్ధిని తగ్గించేస్తుంది. కొన్ని అసందర్భాల్లో పప్పైన్ పిండం యొక్క పెరుగుదల మరియు పిండం యొక్క మనుగడను ఆపివేస్తుంది. పిండం యొక్క మనుగడకు ప్రభావితం చేసే కీలకమైన పొర క్షీణిస్తుంది. అయితే పండిన బొప్పాయిలో పెప్పైన్ చాలా తక్కువగా ఉండటం చేత జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. కాబట్టి బొప్పాయిని తినే ముందు డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భశ్రావం: పండని బొప్పాయిలోని ఉన్నటువంటి లాటెక్స్ గర్భాశయ సంకోచాలు కారణమై గర్భస్రావానికి దారితీస్తుంది. గర్భాధారణ అవసరం లేని మహిళలు, పచ్చి బొప్పాయిని తినొచ్చు. పచ్చిబొప్పాయిలో ఉన్న లాటెక్స్ రక్తస్రావానికి దారితీస్తుంది. గర్భంధరించిన మొదటి రోజుల్లో పండని బొప్పాయిని తినడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.
అలర్జీ: చాలా మంది మహిళలకు బొప్పాయి తినడం వల్ల అలర్జీ కలుగుతుంది లాటెక్స్ అనేది అలెర్జీకి మరో పేరు. మహిళలు లాటెక్స్ అలెర్జీ కలిగి ఉన్నట్లైతే బొప్పాయిని అరిగించుకోవడం చాలా కష్టం అవుతుంది. లాటెక్స్ అలెర్జీ వున్న వారు అరటిపండు, గోధుమలు, చెస్ట్ నట్స్, ఆపిల్ వంటివి కూడా కొందరి పడవు.
కాబట్టి పండిన మరియు పండని బొప్పాయి గురించి పూర్తిగా తెలుసుకొని తర్వాత డాక్టర్ సలహా మీద తినాల్సి ఉంటుంది. అప్పుడే గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరం.



Click it and Unblock the Notifications