Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
గర్భాధారణలో ఆరోగ్యంపట్లే కాదు చర్మం పట్ల తగు జాగ్రత్త అవసరం..

స్త్రీలు గర్భావస్థలోనున్నప్పుడు చర్మాన్ని మృదువుగా, పట్టులా ఉండేలా చూసేందుకు మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. కొందరి చర్మం ఆయిలీగా వుంటుంది కాబట్టి ఇలాంటి వారు ప్రతి రోజు ఆయిల్ బేస్డ్ లేనటువంటి మాయిశ్చరైజర్‌నుపయోగించాలి. నీళ్ళలావున్న మాయిశ్చరైజర్ తేలికగా, చర్మంలో కలిసిపోయేదిగా ఉంటుంది. ఇలాంటి మాయిశ్చరైజర్ ఉపయోగించడం వలన శరీర చర్మం మృదువుగాను పట్టులా తయారువుతుందంటున్నారు వైద్యులు.
అదేగనుక మీ చర్మం పొడిబారినట్లుంటే చర్మంపై నవ్వ(జిల) పుడుతుంది. కాబట్టి గర్భావస్థలోనున్నప్పుడు చర్మంలో తేమశాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చాలా మంది మహిళలకు గర్భావస్థలోనున్నప్పుడు శరీరం, కాళ్ళలో నొప్పులు ఎక్కువగా ఉంటుందని వైద్యులకు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికంతటికి కారణం వారికి నిద్ర సరిగా పట్టక పోవడమే. ఇలాంటి స్థితిలోనున్న మహిళలు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తల, కాళ్ళకు మాలిష్ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇలా మాలిష్ చేయించుకోవడం వలన శరీరంలోని కండరాలకు మంచి వ్యాయామం కలిగి రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. దీంతోపాటు నిద్ర కూడా బాగా పడుతుంది. నీరు అధికంగా సేవిస్తుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. నీటిని సేవించడం వలన శరీరంలోని వ్యర్థపదార్థాలను విసర్జించేలా చేస్తుంది. కాబట్టి చర్మం శుభ్రంగా, మృదువుగా, పట్టులా మెరిసేందుకు ప్రతి రోజు 8 నుంచి 10 గ్లాసుల నీటిని సేవిస్తుండండి. ఇది ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతో లాభదాయకంగా ఉంటుందంటున్నారు వైద్యులు.



Click it and Unblock the Notifications
