Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
గర్భిణీలలో హైబీపీ లక్షణాలు.. తీసుకోవలసిన జాగ్రత్తలు...
సాధారణంగా రక్తపోటు110/70 లేదా 120/80mm ఉంటుంది . కొంత మందిలో ఒంటితీరును బట్టి ఇంకా తక్కువ ఉండవచ్చు. గర్భిణీ స్త్రీకి బీపీ 140/90లేదా అంతకంటే మించినట్లయితే దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ట్ హైపర్ టెన్షన్ అంటారు. బీపీ ఎప్పుడు పెరిగింది, బీపీ తో పాటు ఇతర సమస్యలేం ఉన్నాయి అనేదాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించడం జరుగుతుంది .
జెష్టేషనల్ హైపర్ టెన్షన్: ఇందులో కేవలం బీపీ మాత్రమే పెరుగుతుంది . ఫ్రి ఎక్ లాంప్సియా బీపీతో పాటు మూత్రంలో ఆల్బుమిన్ పోవడం, ఒంట్లో నీరు చేయడం వంటివి ఉంటాయి.
ఎక్ లాంప్సియా(గుర్రపువాతం): ప్రీ ఎక్ లాంప్సియా లక్షణాలతో పాటు ఫిట్స్ రావడాన్ని ఎక్ లాంప్సియా అంటారు. ఇది యాభై శఆతం మందిలో గర్భంతో ఉన్నప్పుడు, ముఫ్పైశాతం ప్రసవ సమయంలో వస్తుంది. ఇరవై శాతం మందిలో ప్రసవం అయిన తర్వాత నుంచి వారం రోజుల్లోపల ఎప్పుడైనా రావచ్చు.
క్రానిక్ హైపర్ టెన్షన్: గర్భం రాకముందు నుంచే బీపీ అధికంగా ఉండటం. మొత్తం గర్భిణీల్లో 5-15శాతం మందికి ఈ సమస్య రావచ్చు. ఇది హార్మోన్ల లో మార్పులు, జన్యుపరమైన కారణాలు, ఇంకా కొన్ని ఇవి అన్ని చెప్పలేని కారణాలు, రక్తనాళాలు సంకోచించడం, బీపీ పెరగడం వల్ల అవయవాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల ప్రధాన అవయవాలు క్రమంగా దెబ్బతిని, గర్భవతికి ప్రాణాపాయస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఎవరికి ఎక్కువ రావచ్చు: చిన్న వయస్సులో గర్భం దాల్చిన వారికి, ముప్పయ్యేళ్లు దాటిన తర్వాత మొదటిసారి గర్భం దాల్చిన వాళ్లకి. కొందరికి వంశపారంపర్యంగా రావచ్చు. గర్భంలో కవలలు ఉన్నా ముత్యాలగర్భం వచ్చిన వారికి పోషకాహార లోపం ఉన్నవారికి. గర్భం రాకముందే హైబీపీ, ముధుమేహం, కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి.
లక్షణాలు ఎలా ఉంటాయి: ముందుగా రక్తపోటు పెరుగుతుంది. శరీరానికి నీరు చేరుతుంది . పాదాలు వాపు, విశ్రాంతి తీసుకున్నా వాపు తగ్గకపోవడం. బరువు వారానికి అరకిలో లేక పదిహేను రోజులకు ఒక కిలో కంటే ఎక్కువ పెరగడం వంటివి జరుగుతాయి. తర్వాత మూత్రంలో అల్బుమిన్ పోతుంది. దీన్నిఫ్రీ ఎక్లాంటిక్ టాక్సీమియా (ఫ్రీ ఎక్ లాంప్సియా) అంటారు . సమయానికి గుర్తించి సరైన జాగ్రత్తలు, చికిత్స తీసుకోకపోతే ఫిట్స్ రావడం, కిడ్నీ ఫెయిలవడం, పసిరికలు, రక్తస్రావం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, హార్ట్ ఫెయిలవడం, కోమాలోకి వెళ్లడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

సమస్యలు: కడుపులోని బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం. బిడ్డకు రక్తప్రసరణ సరిగ్గా అందకపోవడం, మాయ ముందుగానే విడిపోయి రక్తస్రావం అవడం వల్ల బిడ్డ కడుపులోనే చనిపోవడం. నెలలు నిండకముందే కాన్పు రావడం లేదా తల్లిని ప్రాణాపాయస్థితి నుంచి తప్పించడం కోసం కాన్పు ముందుగానే చేయాల్సి రావడం . అయితే ఇవ్వనీ బీపి ఎప్పుడు పెరిగింది, వ్యాధి తీవ్రత ఎంత అనేవాటి మీద ఆధారపడి ఉంటాయి.
తీసుకోవల్సిన జాగ్రత్తలు:
1. క్రమం తప్పకుండా డాక్టర్ తో బీపీ, ఇతర చెకప్ లు చేయించుకోవాలి.
2. బీపీ కొద్దిగా పెరగగానే త్వరత్వరగా చెకప్ చేయించుకుని, క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. అవసరం అయితే హాస్పటల్లో అడ్మిట్ కావాలి.
3. బీపీ కొద్దిగా పెరిగినప్పుడు ఏ లక్షణాలు ఉండవు. ఎక్కువగా పెరిగే కొద్ది.. తలనొప్పి, వికారం, వాంతులు, ఛాతీ కింద నొప్పి, మూత్రం రావడం తగ్గిపోవడం, బరువు ఎక్కువగా పెరగడం, ఒంటిలో అధికంగా నీరు చేరడం, చూపు మందగించడం వంటివి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . దీనికి చికిత్స బీపి ముదిరి, సమస్యలు పెరగక ముందే ప్రసవం చేయడం (నెలలతో సంబంధం లేకుండా). అది కూడా వీలయితే నార్మల్ గా లేదంటే ఆపరేషన్ ద్వారాచేయాల్సి ఉంటుంది.
ప్రసవం తర్వాత: ప్రసవం తర్వాత బీపీ తగ్గడానికి వారం నుంచి రెండు వారాలు పట్టవచ్చు. యాభైశాతం మందిలో ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు పట్టవచ్చు. 25శాతం మందిలో తరువాతి కాన్పుకు కూడా బీపీ పెరగవచ్చు. సమస్యను బట్టి చికిత్స ఇవ్వడానికి చేరిన ఆస్పత్రిలో కనుక సదుపాయం లేకపోతే, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న హాస్పటల్ కి మార్చాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications











