Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
గర్భధారణ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలు
మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించనప్పటి నుండి గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తి అయితే ఎటువంటి సమస్యలుండవు. మహిళలు గర్బం ధరించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని మీరు చదవాల్సిందే. బరువు పెరగడం, బ్లడ్ ప్రెజర్, తిమ్మిరులు, వైజినల్ డిస్చార్జ్, లీకింగ్ నిప్పల్స్ మరియు ఒళ్ళు నొప్పులు మొదలగునవి మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భణి స్త్రీలో వచ్చేటటువంటి సాధర ఆరోగ్యసమస్యలు.
గర్భిణీ స్త్రీ పొట్టలో పిండం పెరిగే కొద్ద పొట్ట మరియు బ్రెస్ట్ పెరగడంతో పాటు, శరంల కూడా అనేక మార్పలకు లోనవుతుంది. ఉదాహరణకు: గర్భం ధరించగానే, గర్భిణీలో చర్మం స్ట్రెచ్ (సాగడం మొదలవుతుంది మరియు ఇది తరచూ స్ట్రెచ్ మార్క్స్ (చర్మంలో ఛారలు)ఏర్పడటానికి కారణం అవుతుంది. గర్భం ధరించిన మహిళ చూడటానికి మరింత అందంగా కనిపించడం కానీ లేదా మరింత నీరసంగా, డల్ గా కనిపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం, మనస్సులో గందరగోళం, తరచూ మనస్సు మార్చుకోవడం, మరియు వికారం వంటి సాధారణ సమస్యలు అసౌకర్యానికి గురిచేస్తాయి.
అదేవిధంగా, వికారం, మార్నింగ్ సిక్ నెస్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగు, ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ మార్పుల వల్ల అసౌకర్యంగాను మరియు చిరాకుగాను అనిపిస్తుంది. అయితే, కొన్ని సందర్భాలలో వారు చాలా ఆందోళకరమైనవారుగా అనిపించవచ్చు.
గర్బిణీ స్త్రీలు ఎదుర్కొనే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు మీరు తెలుసుకోవడం కోసం కొన్ని ఇక్కడ అంధిస్తున్నాం.

నుడుము నొప్పి:
గర్భం ధరించిన మహిళల శరీరంలో రోజురోజుకు పిండం పెరిగేకొద్ది, శరీరంలో ఇతర ఎలిమెంట్స్ తో పాటు, చర్మం కూడా చాలా సాప్ట్ గా మరియు స్ట్రెచ్చీగా మార్పు చెందుతాయి. మరియు ఇది మిమ్మల్ని ప్రసవానికి సిద్దం చేయడానికి నిధానంగా ఇలా మార్పు చెందుంతుంటాయి . పిండం పెరుగుదల, గర్భంలో స్థల ఏర్పడటానికి కండరాలు సడలించడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ మరియు పెల్విస్ జాయింట్స్ లో నొప్పి ఏర్పడటానికి కారణం అవుతంది.

వికారం:
గర్భం ధరించిన మహిళల్లో ఉదయం పూట వికారం, వాంతి వచ్చేటట్లు ఉండటం, తరచూ మనస్సు మారడం, మనస్సులో గందరగోళం వంటివి మొదటి త్రైమాసికంలో తప్పనిసరిగా ఎదుర్యే సమస్యలు. కొంత మంది గర్భిణీ స్త్రీలలో ఈ లక్షణాలు రెండవ త్రైమాసంలో కూడా ఉంటాయి.

పాలు కారడం:
రొమ్మల్లో పాలు పడటం, చనుమొనల ద్వారా లీకవ్వడం జరగుతుంటుంది. అది గర్భిణీ స్రీలకు తెలుస్తుంది. శరీరంలో ల్యాక్టేషన్ ఏర్పడేందుకు అనేక మార్పలు జరగుతాయి. అటువంటి సమయంలో ఇది కూడా ఒకటి. మూడవ త్రైమాసికం కు శిశువుకోసం పాలను ఉత్పత్తించి పెంచుతుంటుంది.

బ్లీడింగ్:
దంతాల్లో రక్తస్రావం అవ్వడం సాధారణ సమస్య. గర్భిణీ స్త్రీలలో ఓరల్ హెల్త్ ప్రాబ్లెమ్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. అయితే వైజినల్ బ్లీడింగ్ మాత్రం గర్భధారణ మొదటి నెలలో కొద్దిగా కనబడుతుంది . అయితే, ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రధించాల్సి ఉంటుంది.

వైజినల్ డిస్చార్జ్:
మీరు గర్భం ధరించినప్పుడు, మీ వైజినల్ డిస్చార్జ్ పెరుగుతుంది. మరియు వైజినల్ వాల్స్ గర్భం చివరి దశకు చేరుకొనే లోపు సాఫ్ట్ గా తయారవుతుంది. మరియ వైట్ డిశ్చార్జ్ డబుల్ అవుతుంది.

క్రాంప్స్:
గర్భిణీ స్త్రీలో ఒది ఒక సాధరణ ఆరోగ్య సమస్య. గర్భధారణ సమయంలో అకస్మాత్తుగా కడుపులో నొప్పి, తిమ్మర్లుగా మండరాలు తిమ్మిరులుగా భావన కలుగుతుంది, కడుపులో లేదా పాదాల్లో కూడా ఇటువంటి మార్పులు జరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రులు ఏర్పడేటటువంటి ఒక సాధారణ గర్భధారణ సమస్య.

తరచూ మూత్రవిసర్జన:
బేబీ బంప్ పెరిగే కొద్దీ బ్లాడర్ మీద ఒత్తిడి పెరిగి, మూత్తపిండాలు నిండి, ఒత్తిడి కలిగి వెంటనే మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది. కాబట్టి, వెంటనే మీరు మూత్రవిసర్జన చేయాల్సి ఉంటుంది. అలాగే స్టోర్ చేసుకోకూడదు.

నిద్రలేమి:
గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే అనేక హార్మోనుల ప్రభావం వల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు నిద్రాభంగం కలిగిస్తుంది.

చర్మ మరియు జుట్టు సమస్యలు:
చర్మం మీద చారలు, మరియు డ్రై స్కిన్, జుట్టు రాలడం మొదలగు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, కొంత మంది గర్భిణీ స్త్రీలు ఈ సమస్యలను కూడా ఎదుర్కొంటుంటారు

మలబద్దకం:
గర్భిణీ స్త్రీలలో అతి సాధారణ సమస్య మలబద్దకం. కాబట్టి అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలు తీసుకుంటూ, అధికంగా నీరు త్రాగాల్సి ఉంటుంది.

తలనొప్పి:
కొంత మంది గర్భణీ స్త్రీలు తలనొప్పికి కూడా గురిఅవుతుంటారు . ప్రెగ్నెన్సీ మొదటి వారంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరియు హార్మోనులు అసమతుల్యలత, వాంతి వంటివి తలనొప్పికి కారణం అవుతాయి .

అజీర్ణం:
హార్మోనుల మార్పలు మరియు వాపు అనేక ఆరోగ్యసమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి, గర్భధారణ సమయంలో అజీర్ణం కూడా ఛాతీలో మంటకు కారణం అవుతంది.



Click it and Unblock the Notifications
