Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
గర్భిణీ పాదాలపగుళ్లను నివారించే హోం రెమెడీస్
గర్భధారణ సమయంలో మన కాళ్ళు ఎందుకు పగులుతాయి?దురద మరియు డ్రై ఫీట్ అవంటివి గర్భధారణ సమయంలో చాలా సాధరణ సమస్యలు. గర్భధారణ సమయంలో మీరు మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ గా ఉంచుకొనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా మంది గర్భణీ స్త్రీలు, గర్భధారణ సమయంలో కాళ్లపగుళ్ళు, కాళ్ళ మిడిమలు చీలడానికి గురిఅవుతుంటామని ఫిర్యాదులు చేస్తుంటారు. సాధారణంగా గర్భిణీగా ఉన్నప్పుడు, మీ పాదాలకు సరైన మాయిశ్చరైజ్ లను చేయడానికి మీకు కొంత కష్టంగా ఉండవచ్చు. లేదా మీ పాదా మీద సరైన శ్రద్ద చూపించకపోవచ్చు. ముఖ్యంగా గర్భిణీగా ఉన్నప్పుడు, చర్మంలో అనేక హార్మోనుల ప్రభావం వల్ల చర్మం నూనెను విడుదలచేయకపోవడం వల్ల పాదాల పగుళ్లకు దారితీస్తుంటుంది.
గర్బధారణ సమంలో కడుపులో పెరిగే శిశువుకు ఎక్కువ ద్రవాలు అవసరం అవ్వడం వల్ల తల్లి శరీరంలోని తేమను గ్రహించడం వల్ల తల్లి శరీరం, పాదాలు, చర్మం తరచూ పగుళ్ళకు గురిఅవుతుంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మీ పాదాలకు హైడ్రేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, గర్భిణీ అశ్రద్దవల్లే ఇలా కాళ్ళ పగుళ్లకు దారితీస్తుందని డాక్టర్లు అంటుంటారు . గర్భధారణ సమయంలో పాదాలరక్షణకోసం వారానికి ఒకసారి పెడిక్యూర్ , సాలోన్ లేదా స్పా వంటివి ఎంపిక చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దాంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించివచ్చు. అవేంటో ఒకసారి గమనించండి...

మాయిశ్చరైజర్ : అలెర్జీగా ఉన్న మీ పాదాలను సాఫ్ట్ గా మార్చుకోవాలంటే, ఓట్ మీల్ తో తయారుచేసిన ఉత్పత్తులను అప్లై చేయండి . ఎప్పుడు మీ పాదాలకు మాయిశ్చరైజ్ రాయడం మరియు కాటన్ సాక్సులను ధరించడం వల్ల మీ పాదాలను మాయిశ్చరైజ్ గా ఉంచుకోవచ్చు . వీటిలో ఏదీ పనిచేయనప్పుడు పొడిబారిన పాదాల నివారణకు కొన్ని క్రీములు లోషన్ల వాడకం కోసం మీ డాక్టర్ ను సంప్రదించండి .
మంచి యాంటీబ్యాక్టీరియల్ సోప్స్: చర్మ డాక్టర్ ను సంప్రధించి ఒక మంచి యాంటీబ్యాక్టీరియల్ సోప్ ను రాసివ్వమని వాటిని ఉపయోగించి, పాదా పగుళ్లను నయం చేసుకోండి . ఇటువంటి సోపులు కొన్ని ఇన్ఫెక్షన్స్ ను మరియు పాదాల పగుళ్ళను నివారిస్తాయి.
నిమ్మరసం: నిమ్మరసం కలిపిన నీటిలో మీ పాదాలను 10-15నిముషాల నానబెట్టి, తర్వాత స్ర్కబ్ చేసి వాష్ చేయడం వల్ల పాదాల పగుళ్ళను మరియు పొడిబారిన పాదాలను అరికట్టవచ్చు. ఈ రెమెడీ గర్భధారణ సమయంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని వారానికొకసారి ప్రయత్నించవచ్చు.
బాత్ ఆయిల్: గర్భిణీలు స్నానం చాలా త్వరగా ముగించాలి. స్నానానికి 15నిముషాల సమయం చాలా . స్నానానికి ముందు, కొన్ని చుక్కల బాత్ ఆయిల్స్ మీరు స్నానం చేసే నీటిలో మిక్స్ చేసి తర్వాత స్నాం చేసుకోవాలి. బాత్ ఆయిల్, ఆలివ్, గ్రేప్, మరియు జోజోబా ఆయిల్స్ వంటివి ఉపయోగించడం వల్ల మీ చర్మ ప్రకాశవంతంగా నునుపుగా మరియు సాఫ్ట్ గా ఉంటుంది. డెడ్ స్కిన్ తొలగిస్తుంది. పాదాల పగుళ్ళు అరికడుతుంది.
పెట్రోలియం జెల్లీ: మీ పాధాలను శుభ్రం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి రుద్దాలి . తర్వాత తేమ శుభ్రం తుడిచి పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి . ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్ళను నయం చేయవచ్చు.
సన్ స్క్రీన్ లోషన్: గర్భధారణ సమయంలో డ్రైఫీట్ నివారణకు సన్ స్క్రీన్ లోషన్ కూడా బాగా పనిచేస్తుంది. అందులో ఎస్ ఫిఎప్ 15కలిగి సన్ స్క్రీన్ లోషన్ ఎంపిక చేసుకోవడం వల్ల ఇది డ్రైనెస్ నుండి మీ పాదాలకు రక్షణ కల్పిస్తుంది .



Click it and Unblock the Notifications
