Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
గర్భధారణలో 10 సాధారణ అపోహలు మరియు వాస్తవాలు
గర్భధారణ సమయంలో మీరు ఎల్లప్పుడూ పాత గర్భధారణ కథలను వింటూ ఉంటారు. ఆ కథలు సాదారణంగా లింగ అంచనాలు మరియు ఇతర ఆసక్తికరమైన విషయాల గురించి ఉంటాయి. ఇవి సాధారణ గర్భధారణ అపోహలు అని చెప్పవచ్చు.
అయితే ఇవి కొన్ని సార్లు జరగవచ్చు. కానీ శాస్త్రీయంగా నిరూపణ జరగలేదు. మీరు నిజంగా ఆ అపోహలతో జీవించడం మొదలు పెడితే మీకు వ్యాకులతగా అనిపించవచ్చు.
READ MORE:గర్భిణీస్త్రీలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే జామకాయ..
మీ గర్భధారణ జీవితాన్ని అపోహల ఆధారంగా గడపటంను ఆపటానికి, మీకు గర్భం గురించి నిజాలు తెలిసి ఉండాలి. నేడు, Boldsky మీకు చాలా సాధారణ గర్భధారణ అపోహలను భాగస్వామ్యం చేస్తుంది.

ఇద్దరి కోసం తినటం
మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ కోసం మరియు మీ గర్భంలో పెరిగే బిడ్డ కోసం రెట్టింపు భోజనం తినాలనే అపోహ ఉంది. మీ నుండి మీ శిశువుకు ఆహారం అందుతుంది. నిజంగా మీరు బాగా సమతుల్య ఆహారం తినటం మరియు ఆరోగ్యకరమైన పండ్లు మరియు వేజ్జిస్ తినడం ద్వారా 600 కేలరీలు ఎక్కువగా పెంచవచ్చు. గర్భధారణ సమయంలో 600 నుంచి 700 కేలరీలు సరిపోతాయి.

గర్భాదరణ సమయంలో వ్యాయామం చేయకూడదు
గర్భధారణ సమయంలో తీవ్రమైన వ్యాయామాలు చేయలేము. అయితే గర్భధారణ సమయంలో తేలికపాటి వ్యాయామం చేయటం ముఖ్యం. ఇది మీ శిశువు యొక్క గుండె ఆరోగ్యం మరియు మేధస్సును మెరుగు చేస్తుంది. ఎటువంటి వ్యాయామాలు చేయాలో మీ వైద్యుడుని అడగండి.

మీరు డెలివరీ సమయంలో బరువు తగ్గుతారు
ఇది ఒక సాధారణ గర్భ అపోహగా ఉంది. మహిళలు డెలివరి అయిన తర్వాత శిశువు యొక్క బరువును మరియు కొంత నీటి బరువును కోల్పోతారు. అయితే గర్భ సమయంలో పొందిన మిగిలిన బరువు అలాగే ఉండిపోతుంది. గర్భం తర్వాత బరువు తగ్గటం అనేది వ్యాయామాలు మరియు మీ ఆహారం మార్చడం ద్వారా సాధ్యమవుతుంది.

గర్భిణీ స్త్రీలు చాక్లెట్ తినకూడదు
ఒక అధ్యయనం ప్రకారం గర్భధారణ చివరి సమయంలో చాక్లెట్లు తినటం వలన పిల్లల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపణ జరిగింది. గర్భధారణ సమయంలో చాక్లెట్ తిన్న గర్భిణీ స్త్రీలకు తక్కువ భయం మరియు ఎక్కువ స్మైల్ గల పిల్లలు జన్మిస్తారు. అంతేకాక రక్తపోటు ప్రమాదం (అధిక రక్తపోటు)ను తగ్గిస్తుంది.

గర్భిణీ స్త్రీలు పూర్తిగా కెఫిన్ మానివేయాలి
దీనిలో కొంత నిజం ఉంది. రోజు సమయంలో కొద్దిగా కెఫిన్ తీసుకుంటే మీ శిశువుకు హాని ఉండదు. మీరు ప్రతి రోజు టీ లేదా కాఫీని ఒక కప్పు తేలికపాటిగా తీసుకోవాలి. మితిమీరిన వినియోగంను మానివేయాలి.

గర్భిణీ స్త్రీలు చేపలను తినకూడదు
మీరు చేపలను బాగా వండుతారని నిర్ధారించుకోండి. విషపూరిత రసాయనం అయిన పాదరసం లేకుండా చూసుకోండి. అప్పుడు మీరు చేపను తినవచ్చు. అయితే ఎక్కువగా తినకూడదు. చేపలలో మీ శిశువుకు మంచి చేసే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉంటాయి.

పిండం నుంచి ఏ అనుభూతి ఉండదు
మీ శిశువు నుంచి ప్రతిదీ ఆస్వాదించవచ్చు. మీ బిడ్డ మీ భావోద్వేగాలు మరియు అలాగే మీరు తినే ఆహార రుచిని అనుభూతి పొందుతుంది. అలాగే టాక్సిన్స్ ను కూడా బయటకు వస్తాయి. అంతేకాక మీ బిడ్డ చుట్టూ వినిపించే స్వరాలు మరియు సంగీతంను వింటుంది.

మీరు గతంలో C- సెక్షన్ కలిగి ఉంటే డెలివరి తొందరగా వస్తుంది
ఇది ఒక అతి సాధారణ గర్భం కధల జాబితాలో ఉంది. అయితే ఇది C విభాగం లేదా తర్వాత సాధారణ డెలివరీ కోసం వెళ్ళే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. సి సెక్షన్ తర్వాత సాధారణ డెలివరీ కొంచెం ప్రమాదకరం. కానీ అసాధ్యం కాదు. మీరు దీనికి సంబంధించి మీ డాక్టర్ తో మాట్లాడండి.

గర్భం సమయంలో ఆనందం
గర్భిణీ స్త్రీలు భావోద్వేగాలు మరియు మానసిక కల్లోలాలు ఎల్లప్పుడూ సాధ్యం కాదు. గర్భధారణ సమయంలో నిరంతరం ఆనందంగా ఉండటం కష్టం. గర్భం సమయంలో నిస్పృహ మరియు యాంగ్జైటీ కారణమయ్యే హార్మోన్ల మార్పులు ఉంటాయి. అంతేకాక కొన్ని ఆందోళనలు కూడా ఉంటాయి.

మహిళలందరు రొమ్ము ఫీడ్ చేయవచ్చు
ఇది నిజం. కానీ 90 శాతం కేసులలో మాత్రమే జరుగుతుంది. ఆ సమయంలో వాడే మందుల వలన రొమ్ము ఫీడింగ్ శిశువుకు హానికరం కావచ్చు. అటువంటి మహిళలు రొమ్ము ఫీడింగ్ ను మానివేయాలి.



Click it and Unblock the Notifications
