Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
గర్భధారణ సమయంలో మొటిమలు బాధిస్తుంటే..సింపుల్ టిప్స్
మహిళల్లో గర్భధారణ సమయం ఒక ఆనంద సమయం. అయితే అదే సమయం గర్భిణీల్లో మానసిక కల్లోలంకు గురిచేసే హార్మోను ప్రభావం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. గర్భం పొందిన తర్వాత శరీరంలోపలో హార్మోనుల హెచ్చుతగ్గులు చాలా వేగంగా, చురుకుగా ఉండటం వల్ల అనేక మార్పులో చోటుచేసుకుంటాయి. హార్మోనుల ప్రభావం ప్రధానంగా మొటిమలకు కూడా కారణం అవుతుంది.
గర్భధారణ సమయంలో మొటిమలను నివారించడం ఎలా? తెలుసుకోవాలంటే ఈ రోజు ఈ ఆర్టికల్ తప్పకుండా చదవాల్సిందే...
హార్మోనుల ప్రభావం చేత మొటిమలు ఏర్పడితే ఆ ప్రదేశంలో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు, జిడ్డుగా మారడం, ఆయిల్ గ్లాండ్స్ ఈ సమస్యలతో చర్మం చాలా అసహ్యంగా మారుతుంది.
అంతే కాదు, సాధారణంగా మొటిమలు కౌమారదశలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి మొటిమలే తిరిగి గర్భధారణ సమయంలో రాబడం కొంత భయానికి గురి చేస్తుంది . చాలా మంది మహిళల్లో సడెన్ గా వచ్చే హార్మోనుల కార్యాచరణ వల్ల మొటిమలకు దారితీస్తుంది.
కాబట్టి, గర్భధారణ సమయంలో ఎలాంటి మెడికేషన్స్ ఉపయోగించకుండా, నేచురల్ గా మొటిమలను నివారించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి...

గర్భధారణలో మొటిమలు ఏర్పడటానికి కారణం:
ప్రెగ్నెన్సీలో మొటిమలకు ప్రధాన కారణం హార్మోనులు. గర్భధారణ సమయంలో హార్మోనులు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల , మన శరీరంలో గ్రంథులు కూడా పెరుగుతాయి.
అందువల్ల సెబమ్ ఉత్పత్తి వల్ల, డెడ్ స్కిన్ సెల్స్ చర్మ రంద్రాలను బ్లాక్ చేయడం వల్ల కూడా మొటిమలు ఏర్పడుతాయి.
కొంత మంది మహిళ్లో ఇది మొదటి త్రైమాసికలో ఎక్కువగా ఉంటే, మరికొందరి మహిళల్లో ప్రెగ్నెన్సీ కాలం మొత్తం మొటిమలు బాధిస్తుంటాయి.

ప్రెగ్నెన్సీలో వచ్చే మొటిమలను నివారించే మార్గాలు:
ప్రెగ్నెన్సీ లో వచ్చే మొటిమలను నివారించడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి .
కొబ్బరి నూనె: ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మొటిమలను నివారించడానికి కొబ్బరి నూనెను చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . కొబ్బరి నూనెలో నయం చేసే గుణగణాలు పుష్కలంగా ఉన్నాయి. మొటిమలున్న ప్రదేశంలో కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేయాలి. మీది కనుక ఆయిల్ స్కిన్ అయితే కొబ్బరి నూనె అప్లై చేయడం నివారించాలి.

ప్యాక్స్:
కీరదోసకాయ వంటి హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల,చర్మానికి అవసరం అయ్యే పోషకాలను అందించడంతో పాటు మొటిమలతో పోరాడే గుణంను అందిస్తుంది.
ప్రెగ్నెన్సీ మొటిమలను నివారించడం ఎలా
మొటిమలను గిల్లడం లేదా రబ్ చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది . దాంతో చర్మం మరింత డ్యామేజ్ అవుతుంది. గర్భధారణ సమయంలో చర్మం యొక్క వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్ అవుతుంది.
మొటిమలను నివారణకు కెమికల్స్ తో తయారుచేసిన క్రీములను ఉపయోగించడం కంటే నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల, కడుపులో పెరిగే పిండం మీద ప్రభావం పడకుండా ఉంటుంది.

గర్భిణీ స్త్రీలో ఏర్పడి మొటిమల నివారణకు కొన్ని సహజ మార్గాలు: కొబ్బరి నూనె, జింక్, విటమిన్ సి, లేదా ప్రోబయోటిక్స్
కఠిన స్వభావం కలిగిన సోపులు సున్నితమైన చర్మాన్ని హానికలిగిస్తాయి. కాబట్టి బేబీ సోపులు లేదా నేచురల్ స్ర్కబ్స్ ను ఉపయోగించి మొటిమలకు కారణం అయ్యే ఎక్సెస్ ఆయిల్ మరియు మురికిని తొలగించుకోవచ్చు.
చర్మానికి దురద కలిగించే ఏ ఇతర ప్రొడక్ట్స్ ను ఉపయోగించకూడదు. ఇవి చర్మానికి హానిక కలిగిస్తాయి.
అలాగే మేకప్ లేదా కాస్మోటిక్స్ ను వినియోగాన్ని నివారించాలి. ఇవి చర్మం రంద్రాలు బ్లాక్ చేసి, మొటిమలకు దారితీస్తాయి.
కఠినమైన ఉత్పత్తులతో చర్మం మీద మర్ధన లేదా స్ర్కబ్ చేయకూడదు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది.
మరో ముఖ్యమైన విషయం మీరు తీసుకొనే డైట్ మరియు న్యూట్రీషియన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండలో తిరగడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది . కాబట్టి, బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగు వెంట తీసుకెళ్ళాలి.



Click it and Unblock the Notifications
