Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గర్భిణీలు ఈ విషయాల్లో తప్పనిసరి జాగ్రత్తలు అవసరం..
గర్భం పొందిన ప్రతి మహిళలో స్ట్రెస్, హ్యాపినెస్ మిక్స్డ్ ఫీలింగ్ైస్ ఉంటాయి. స్ట్రెస్ పొట్టలో పెరిగే బేబికి సంబంధించినది. గర్భధారణ సమయంలో గర్భిణీ ఆమెకోసం మాత్రమే కాకుండా కడుపులో పెరిగే బిడ్డకోసం కూడా ఎక్స్ ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. తినే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మహిళ గర్భం పొందిన తర్వాత ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని ముఖ్యమైన గర్భధారణ చిట్కాలున్నాయి. గర్భిణీ తీసుకునే ఆహారాలు మరియు చేసే పనులు అన్నీ కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మొదటిసారి గర్భం పొందిన వారిలో ఏలాంటి పనులు చేయాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనే వాటి మీద సరైన అవగాహన ఉండదు.
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు చాలా విషయాలను తెలుసుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొసారి గర్భం పొందినప్పుడు ఒక్కొ విధమైన లక్షణాలు కనబడుతాయి. అలాగే ఒక్క గర్భిణీస్త్రీకి మరో గర్భిణీ స్త్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లక్షణాల్లో కూడా చాలా తేడా ఉంటుంది.
కాబట్టి గర్భం పొందిన మహిళలు గర్భధారణ సమయంలో హెల్తీగా మరియు హ్యాపిగా ముగియాలంటే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ను అనుసరించాలి. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం...

ఫోలిక్ యాసిడ్ :
గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ అత్యవసరమైనది. గర్భిణీకి మాత్రమే కాదు, బేబీ పుట్టకలోపాలను నివారిస్తుంది. అందుకు ఫోలిక్ యాసిడ్ గ్రేట్ గా సమాయపడుతుంది. రోజుకు 1000మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తీసుకోవాలి,. లేదా నేచురల్ గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అరటిపండ్లు, ఆరెంజెస్ తీసుకోవాలి.

ఉడికించిన మాంసాహారం, చికెన్, గుడ్డు :
సరిగా ఉడకని మాంసాహారం మంచిది కాదు, బాగా ఉడికని చికెన్ గుడ్డు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. అది బేబీకి కూడా హానికలిగిస్తుంది. వీటిని తీసుకునే ముందు బాగా ఉడికించి , సరిగా ఫ్రై చేసి తీసుకోవాలి.

థైరాయిడ్ పనితీరు చెక్ చేయాలి:
గర్భం నిర్ధారణ అయిన తర్వాత , థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అండర్ యాక్టీవ్ థైరాయిడ్ (హైపో థైరాయిడిజం) ఉన్నట్లైతే తప్పనిసరిగా థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయించుకోవడం అవసరం. థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రోటీన్స్:
గర్భధారణ సమయంలో ప్రోటీన్ ఫుడ్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. బేబీ గ్రోత్ కు ఇవి చాలా అసవరం. మిల్క్, డైరీ ప్రొడక్ట్స్, బీన్స్, లెగ్యుమ్స్, ఫిష్, చికెన్, మరియు మీట్ వంటి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.

వ్యాక్సినేషన్:
పుట్టబోయే బిడ్డకు ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండేదకు తల్లి కొన్ని వాక్సినేషన్ ను తీసుకోవాలి. ఇవి బేబీ ఇమ్యూనిటి పెంచే తగినంత బలాన్ని చేకూర్చుతాయి . . గర్భిణీ వేసుకోవల్సిన వాక్సినేషన్ గురించి డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి,.

బ్యాడ్ ఫ్యాట్స్ నివారించాలి:
గర్భినీలు ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను అవాయిడ్ చేయాలి. ఇవి కొలెస్ట్రాల్ వెల్స్ ను ఎక్కు చేస్తాయి. ఇవి బేబీ హెల్త్ కు చాలా ప్రమాధకరం. కాబట్టి, ఆయిల్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్, ను అవాయిడ్ చేయాలి.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ :
ఇది మీ పుట్టబోయే బిడ్డకు మరియు మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది.. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచుతుంది. నట్స్, సాల్మన్, ఫిష్ మరియు ఫ్లాక్స్ సీడ్ ఆియల్ ను ఎక్కువగా తీసుకోవాలి.

ఫ్రూట్స్ బాగా శుభ్రం చేసి తీసుకోవాలి:
ఫ్రెష్ గా ఉండే పళ్ళను శుభ్రంగా కడిగి తర్వాత తీసుకోవాలి. . వాటి మీద క్రిమిసంహారక మందులను ఎక్కువగా చల్లి ఉంచడం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదకరమే.

బ్యాలెన్స్డ్ డైట్ :
రోజూ తీసుకొనే ఆహారంలో సరిపడా న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. డిఫరెంట్ గా ఉండే లెగ్యూమ్స్, మిల్క్, పల్స్, ఎగ్స్, గ్రీన్ లీఫ్స్ , వెజిటేబుల్స్, మరియు ఫ్రూట్స్ వంటి వెరైటి ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

బొప్పాయి మరియు పైనాపిల్ ను నివారించాలి:
ప్రెగ్నెన్సీ మహిళలకు ఇవి సురక్షితమైన ఆహారాలు కాదు. ఇవి గర్భస్రావానికి కారణమవుతాయి,. కాబట్టి, డాక్టర్ సలహా మేరకు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

ప్రీనేటల్ విటమిన్స్:
గర్భం పొందిన తర్వాత డాక్టర్స్ కొన్ని మందులను సూచిస్తుంటారు, బేబీ నార్మల్ గా పెరగడానికి ఇవి బాగా సహాయపడుతాయి. డాక్టర్స్ సూచించే మందులను ఎక్కువగా తీసుకుని గర్భధారణలో ఇతర సమస్యలు తలెత్తకుండా నివారించుకోవాలి.

హైడ్రేషన్:
గర్భిణీ రోజుకు సరిపడా నీరు తాగుతుండాలి. ఫ్రూట్ జ్యూస్ లతో పాటు నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు విసర్జింపబడుతాయి. ఆరోగ్యంగా...హెల్తీగా ఉంటారు.



Click it and Unblock the Notifications