Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
తల్లికి, కడుపులో బిడ్డకు ఎండుద్రాక్ష వల్ల కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!
డ్రై ఫ్రూట్స్ లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల తల్లి, బిడ్డకు చాలా మంచిది. కాబట్టి గర్భిణీలు కంపల్సరీ డ్రైఫ్రూట్స్, నట్స్ తినాలి. అయితే ఎండు ద్రాక్ష తినడం వల్ల.. గర్భిణీలకు ఎలా ప్రయోజనకరం ?
ప్రెగ్నన్సీ మహిళలను మార్చేస్తుంది. తన జీవితంలో మొదటిసారి తన శరీరంలో మిరాకిల్ జరుగుతుందని గుర్తిస్తుంది. ఒక జీవితాన్ని అందించడం అనేది మిరాకిలే కదా. ఈ అందమైన ప్రెగ్నన్సీ టైంలో ప్రతీది చాలా ముఖ్యమైనది. చేయాల్సినవి, చేయకూడనివి, తినాల్సినవి, తినకూడని చాలా ఉంటాయి.

వ్యక్తితమైన ఇష్టాలను గర్భిణీలు వదులుకోవాల్సి ఉంటుంది. ఇష్టంలేని వాటిని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులు కడుపులో పెరుగుతున్న బేబీ కోసమే. ముఖ్యంగా గర్భిణీలు డ్రైఫ్రూట్స్, నట్స్ కంపల్సరీ తినాలి.
గర్భిణీలు బాదాం, ఆప్రికాట్స్, జీడిపప్పుని పరిమితంగా, చెర్రీస్, క్రాన్ బెర్రీస్, ఎండు ద్రాక్ష తినడం చాలా ముఖ్యం. ఈ డ్రై ఫ్రూట్స్ లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల తల్లి, బిడ్డకు చాలా మంచిది. కాబట్టి గర్భిణీలు కంపల్సరీ డ్రైఫ్రూట్స్, నట్స్ తినాలి. అయితే ఎండు ద్రాక్ష తినడం వల్ల.. గర్భిణీలకు ఎలా ప్రయోజనకరం, అలాగే బేబీ హెల్త్ కి ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం..

పళ్లు
చాలా ఆహారాలు, డ్రింక్స్ తీసుకోవడం వల్ల తర్వాత నోట్లో దుర్వాసన ఉంటుంది. చాలామంది గర్భిణీలు.. చిగుళ్ల నుంచి రక్తంకారే సమస్యను కూడా ఎదుర్కొంటారు. కాబట్టి.. నోటి ఆరోగ్యంపై జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. దీనివల్ల వికారం సమస్య దూరంగా ఉంటుంది. అలాగే ఎండుద్రాక్షలో ఒలీనోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పంటి ఆరోగ్యానికి మంచిది.

కాన్ట్సిపేషన్
ఎండుద్రాక్షలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. గర్భిణీలు సాధారణంగా ఎదుర్కొనే కాన్ట్సిపేషన్ సమస్యను తేలికగా నివారిస్తుంది. ఈ డ్రై ఫ్రూట్ నీటిని గ్రహించి, లాక్సేటివ్ టెండెన్సీని క్రియేట్ చేసి.. బోవెల్ మూమెంట్స్ ని తేలికగా మారుస్తుంది.

బ్లడ్ సెల్స్
గర్భధారణ సమయంలో.. కడుపులో బిడ్డ పెరుగుదలకు కావాల్సిన పోషణకు సహాయపడే పోషకాలు అవసరం. ఎండుద్రాక్షలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, ఇతర మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచుతాయి. అలాగే ఇది అనీమియాను దూరం చేస్తుంది. బలహీనతను దూరం చేస్తుంది.

క్యాన్సర్
ప్రెగ్నన్సీ టైంలో మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కొన్నిసార్లు క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎండుద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడి.. శరీరంలో క్యాన్సర్ కి కారణయ్యే ట్యూమర్స్ ని అరికడతాయి.

జీర్ణక్రియ
ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే వేస్ట్ ని, టాక్సిన్స్ ని బయటకు తొలగిస్తుంది. అలాగే బిడ్డ ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.

ఎనర్జీ
ఎండుద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖ్యమైన విటమిన్స్ ని ఆహారం నుంచి గ్రహిస్తాయి. అలా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ప్రెగ్నన్సీ టైంలో మహిళల శరీరంలో చాలా మార్పులు రావడం వల్ల వాటన్నింటినీ తట్టుకోవడానికి చాలా ఎనర్జీ అవసరం అవుతుంది.

కంటిచూపు
కడుపులో బిడ్డ ఆరోగ్యం అంతా.. తల్లి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రెగ్నన్సీ టైంలో ఎండుద్రాక్ష తినడం వల్ల.. కడుపులో బిడ్డ కంటిచూపుకి సహాయపడుతుంది. కాబట్టి బర్త్ డిఫెక్ట్స్ ని అడ్డుకోవాలంటే.. గర్భిణీలు కంపల్సరీ.. ఎండుద్రాక్ష తినాలి.

బలమైన ఎముకలు
ఎండుద్రాక్షలో క్యాల్షియం, ఐరన్ ఉంటాయి. గర్భిణీలు వీటిని తినడం వల్ల బిడ్డ ఎముకలు బలంగా మారుతాయి. అలాగే గర్భిణీలకు డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎండుద్రాక్షలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. డయాబెటిస్ లక్షణాలు ఉండే గర్భిణీలు.. తక్కువగా ఎండుద్రాక్ష తీసుకోవాలి.



Click it and Unblock the Notifications











