Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
డేంజర్: ప్రెగ్నెన్సీ టైంలో పారాసెట్మాల్ తో కలిగే సైడ్ ఎఫెక్ట్స్
పారాసిటమల్ కామన్ పెయిన్‌కిల్లర్ అనే విషయం అందరికీ తెలుసు. ఏచిన్న నొప్పి వచ్చినా...తలనొప్పిగా ఉన్నా...అలసటగా ఉన్నా...టక్కున గుర్తొచ్చేది పారాసిటమల్, వెంటనే ఒకటి మింగేసి తక్షణ ఉపశమనం పొందేస్తుంటారు. కానీ గర్భంతో ఉన్న ఆడవాళ్లు పారాసిటమల్ ఉపయోగించడం వల్ల కడుపులో ఉన్న శిశువు ఆస్తమా బారిన పడతుందని. ఇటీవల నిర్వహించిన ఒక స్టడీలో ఈ విషయం వెల్లడైంది. చాలా వరకూ గర్భంతో ఉన్నప్పుడు అన్ని రాకాల మందులను అవాయిడ్ చేయాలని డాక్టర్లు గర్భిణి స్త్రీలకు సూచిస్తుంటారు. గర్భాధారణ సమయంలో వారు ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలన్నా లేదా ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.
గర్భిణీలు తీసుకొనే ఏరకమైన మందులైనా సరే...అవి గర్భంలో ఉండే శిశువు మీద హానికరమైన ప్రభావం చూపుతుంది . ఇలాంటి మెడికేషన్స్ తల్లి ద్వారా, శిశువు రక్తంలో చేరుతుంది. తర్వాత పెరిగే శిశువు మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గర్భణీలు తలనొప్పి, బ్యాక్ పెయిన్, అలసట, బాడీపెయిన్స్ మరియు వికారం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వీటన్నింటికి పారాసిటమల్ పరిస్కారం కాగా....అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది గర్బిణీలకు సురక్షితమైనదిని భావించవచ్చు . కానీ...పారాసిటమోల్ కూడా బేబీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని రీసెంట్ గా జరిపిన స్టడీ ద్వారా వెల్లడించారు . గర్భణిగా ఉన్నప్పుడు పారాసిటమల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శిశువు మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ క్రింది విధంగా తెలియజేశారు..
నార్వీజియన్ మదర్ అండ్ ఛైల్డ్ స్టడీ ఆధారంగా అధ్యయనకారులు ఈ అధ్యయనాన్ని చేశారు. మూడేళ్లు, ఏడేళ్ల వయసులో పిల్లల్లో ఆస్తమా తీవ్రత ఎలా ఉంటోందో అధ్యయనకారులు పరిశీలించారు. ప్రెగ్నెన్సీ సమయంలో నొప్పి, జ్వరం, ఇన్‌ఫ్లుయెంజా నివారణకు పారాసిటమల్ ఉపయోగించడం వల్ల పుట్టే పిల్లలకు ఆస్తమా వచ్చే అవకాశం ఉంది.

పారాసిటమల్ పెయిన్‌కిల్లర్‌ను సర్వసాధారణంగా గర్భిణిలకు, పసిపిల్లలకు వైద్యులు రాస్తుంటారు. స్టడీ ఫలితాల్లో గర్భిణిలు పారాసిటమల్ వాడడం వల్ల మూడేళ్ల వయసులో ఉన్న 5.7 శాతం పిల్లలకు ఆస్తమా సమస్య తలెత్తుతోందట. అలాగే ఏడేళ్ల వయసులో ఉన్న 5.1 శాతం పిల్లల్లో కూడా ఇది కనిపిస్తోందట.
గర్భిణీగా ఉన్నప్పుడు పారాసిటమల్ వాడడానికి, మూడు, ఏడేళ్ల వయసులో పిల్లలకు ఆస్తమా రావడానికి మధ్య దగ్గర సంబంధం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. రిపీనేటల్ సమయంలో పారాసిటమల్ ఎక్స్‌పోజర్ వల్ల పిల్లల్లో ఆస్తమా అభివృద్ధి చెందుతుంది. నొప్పులు, ఇన్‌ఫ్లుయెంజా, జ్వరంలకు పారాసిటమల్ వాడడం వల్ల కూడా ఆస్తమా సమస్య పసిపిల్లల్లో తలెత్తుతుంది.

ఇంకా లర్నింగ్ అండ్ బిహేవియర్ సమస్యలు: ఇంకా ఈ స్టడీ ద్వారా బర్త్ బేబీస్ లో చాలా సమస్యలున్నట్లు కనుగొన్నారు, నేర్పరితనం, మెంటల్ కాన్సన్ట్రేషన్ మరియు బిహేవియర్ సమస్యలను గుర్తించారు. ఇంకా అటెన్షన్ డిఫిసిట్ హైపరాక్టివ్ డిజార్డ్స్ ను కలిగి ఉంటారిని కనుగొన్నారు . పారాసిటమల్ వల్ల ఇది కూడా ఒక అత్యంత డిజార్డర్ గా ఉంటుందని గుర్తించారు.
ఈ పారాసిటమల్ వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ ఇంటరాక్షన్ వల్ల నార్మల్ డెవలప్ మెంట్ బేబీ బ్రెయిన్ లో మదర్ హార్మోన్స్ వల్ల డిస్ట్రబ్ అవుతుంది . ఇంకా బేబీలో న్యూరోటాక్సిసిటీకి దారితీస్తుంది. దాంతో బేబీ ఏడిహెచ్ డికి కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications