Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
అలర్ట్ : గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా తినకూడాని కొన్ని ఆహారాలు ..!
మహిళ గర్భం పొందడం ఒక వరం. గర్భ పొందిన తర్వాత ఆహారం మీద ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు. ముఖ్యంగా గర్భం పొందిన మొదటి త్రైమాసికంలో అంటే మొదటి మూడునెలుల ఆహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు.
గర్భం పొందిన తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం . ఎందుకంటే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వారు అందుకోసం మహిళ శరీరం సహకరించాలి. ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ కు మహిళ శరీరం ఆరోగ్యంగా ఉండాలి.
అదనంగా, ప్రెగ్నెన్సీ మహిళ జీవితంలో చాలా సున్నితమైన అంశం,. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పొట్టలో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం పొందడంతో కోసం అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అలవాట్లను మానుకోవల్సి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో హెల్తీ లైఫ్ స్టల్ మరియు హెల్త్ డైట్ ఫ్లాన్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. తల్లి శరీరానికి పూర్తిగా విటిమన్స్, ప్రోటీన్స్, అందుతుంటే, తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు .
మదర్స్ న్యూట్రీషియన్ పొట్టలో పెరిగే బిడ్డ పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది. తల్లిలో పోషకాహార లోపం ఉన్నట్లైతే తల్లితో పాటు, బిడ్డ కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది.కాబట్టి మహిళ గర్భం పొందిన తర్వాత ఖచ్చితంగా పూర్తింగా నివారించాల్సిన డైట్ మిస్టేక్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ప్రొసెస్డ్ మీట్ ను తినకూడదు
మహిళ గర్భం పొందిన తర్వాత ప్రొసెస్డ్ మీట్ కు పూర్తిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రొసెస్డ్ మీట్ లో వ్యాధులకు గురిచేసే బ్యాక్టీరియా ఉండవచ్చు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు దీనికి దూరంగా ఉండటం మంచిది.

సలాడ్ తినకూడదు
వ్యాధులకు కారణమయ్యే .. మన కళ్ళకు కనబడని సూక్ష్మ క్రిములు సలాడ్స్ లోదాగుంటాయి. సలాడ్స్ కు ఉపయోగించే వెజిటేబుల్స్ ఉడికించకపోవడం లేదా హీట్ చేయకపోవడం వల్ల ఈ సూక్ష్మ క్రిములు గర్భిణి శరీరం మీద దాడి చేసి, వ్యాధులకు గురిచేస్తుంది.

కోల్డ్ జ్యూస్ లకు దూరంగా ఉండాలి
ప్రెగ్నెన్సీ డైట్ లో ఖచ్చితంగా నివారించాల్సిన మరొకటి, కోల్డ్ జ్యూసులు, గర్భిణీలు చల్లటి పానియాలు తాగడం వల్ల వారిలో కామన్ కోల్డ్ మరియు ఫ్లూకు దారితీస్తుంది. ఇది తల్లి, బిడ్డకు క్షేమం కాదు .

పచ్చిగా, సరిగా ఉడకని చేపలు సురక్షితం కాదు
పచ్చిగా ఉండే చేపలను లేదా బేక్ చేసినవి, లేదా సరిగా ఉడకని ఫిష్ ను గర్భిణీ స్త్రీ రెగ్యులర్ డైట్ నుండి ఖచ్చితంగా నివారించాలి. సీఫుడ్స్ లో గర్భిణీ శరీరానికి హానికలిగించే బ్యాక్టీరియా పెరిగి ఉంటుంది.

సరిగా ఉడకని గుడ్డును ఖచ్చితంగా నివారించాలి
గర్భధారణ సమయంలో మైక్రోబయల్(సూక్ష్మ క్రిముల)ఇన్ఫెక్షన్ నివారించుకోవాలంటే, సరిగా ఉడికించని గుడ్డును తినకూడదు.

కాఫీని తగ్గించాలి
గర్భధారణ సమయంలో ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భస్రావానికి కారణమవుతుంది. కాబట్టి గర్భినీలు ఖచ్ఛితంగా గర్భిణీలు కాఫీలకు దూరంగా ఉండటం మంచిది.

అనిమల్ లివర్ ను తినకూడదు
గర్భిణీ స్త్రీలు చేసే మరో డైట్ మిస్టేక్ గర్భధారణ సమయంలో అనిమల్ లివర్ ను తింటుంటారు, అయితే అనిమల్ లివర్ లో ఉండే విటమిన్ ఎ బేబీ పుట్టుకలో లోపాలుంటాయి.

ఎక్కువ ఆహారం తీసుకోవడం తగ్గించాలి
చాలా మంది గర్భం పొందిన తర్వాత ఎక్కువ ఆహారాలను తీసుకుంటుంటారు, తల్లితో పాటు, బిడ్డ కూడా ఆహారం కావాలని, ఇద్దరికి సరిపడా భోంచేస్తుంటారు, ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల గర్భధారణ సమయంలో అజీర్తికి మరియు ఓబేసిటికి కారణమవుతుంది.

ఆల్కహాల్ ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు
గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తీసుకోకపోవడం తల్లి బిడ్డకు క్షేమం, ఆల్కహాల్ వల్ల గర్భస్రావం జరగవచ్చు, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కు గురి అవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఆల్కహాల్ నివారించడం ఉత్తమం.

బొప్పాయి:
గర్భధారణ సమయంలో నివారించాల్సిన డైట్ టిప్స్ లో బొప్పాయి ఒకటి, ఇది గర్బస్రావనికి కారణమవుతుంది, దీన్ని గర్భిణీలు తినకపోవడమే మంచిది.

షుగర్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి
గర్భిణీలు స్వీట్స్, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల జస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకావం ఎక్కువ. కాబట్టి, గర్భం పొందిన తర్వాత స్వీట్స్, పంచదార పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది.

స్పైసీ ఫుడ్స్ ఖచ్చితంగా నివారించాల్సి ఉంటుంది
గర్భధారణ సమయంలో ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అజీర్థి చేస్తుంది. గర్భస్రావానికి గురిచేస్తుంది. కాబట్టి, గర్భిణీ స్త్రీలు సురక్షిమైన గర్భం పొందాలంటే, పైన సూచించిన ఫుడ్స్ అన్నింటికి దూరంగా ఉండాలి



Click it and Unblock the Notifications
