For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా గర్భం పొందాలంటే ఈ నేచురల్ ఫుడ్స్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి...

|

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో జీవనశైలిలో చాలా మార్పులు వల్ల వ్యక్తుల ఆరోగ్యం మీద తీవ్రప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా స్త్రీ ప్రత్యుత్పత్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నది. గర్భం పొందాలంటే వివిధ రకాల కారణాలు ఉన్నాయి. వంధ్యత్వంతో బాధపడుతున్న స్త్రీలలో ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ప్రభావం చూపుతున్నది . ముఖ్యంగా అదిశరీరకంగా సమస్యలున్నా లేదా భర్తలో లోపాలున్నా త్వరగా గర్బం పొందడం అనేది అసాధ్యం. అలా గర్భం పొందాలనుకొనే వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్లాన్ చేసుకోవాలి . ఈ రోజుల్లో చాలా మంది జంటలు, కెరీర్, ఆర్థిక స్థితిగతుల, ఉద్యోగాలంటూ పెళ్ళి తర్వాత చాల రోజులు ప్రెగ్నెన్సీని పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. కారణం ఏదైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి, త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారి కోసం కొన్ని ఎఫెక్టివ్ మార్గాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము...

మీరు గర్భం పొందాలనే ప్రయత్నంలో ఉన్నా, అది వెంటనే ప్రతిఫలించకపోవచ్చు. అయితే అందుకు మీ ప్రయత్నంలో ఉన్నా, కన్సీవ్ (గర్భనిర్ధారణ) అవ్వడానికి కనీసం 3 నుండి 12 నెలల కాలం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన మార్గాలను ఎంపిక చేసుకోవడం ద్వారా గర్భం త్వరగా పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .

మీరు గర్భం పొందాలనే ప్రయత్నంలో ఉన్నా, అది వెంటనే ప్రతిఫలించకపోవచ్చు. అయితే అందుకు మీ ప్రయత్నంలో ఉన్నా, కన్సీవ్ (గర్భనిర్ధారణ) అవ్వడానికి కనీసం 3 నుండి 12 నెలల కాలం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సరైన మార్గాలను ఎంపిక చేసుకోవడం ద్వారా గర్భం త్వరగా పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .

ముఖ్యంగా త్వరగా గర్భం పొండానికి స్త్రీ మరియు పురుషుల యొక్క ఇద్దరి ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఓవొలేషన్ డేట్స్, మరియు ముఖ్యంగా మీ జీవనశైలి మీద ఎక్కు ప్రభావం చూపుతుంది. త్వరగా గర్భం పొందడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు సహాయపడుతాయి. మరియు ఇంకా కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను కూడా అనుసరించినట్లైతే అది మీ గర్భాశయ మరియు ఫెర్టిలిటి మీద ఎక్కువ ప్రభావం చూపి, త్వరగా ప్రయోజనం చేకూర్చుతుంది. మరి ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

సిట్రస్ ఫ్రూట్స్:

సిట్రస్ ఫ్రూట్స్:

త్వరగా గర్భం పొందాలని కోరుకొనే వారు వారి రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ ఆహారాలను చేర్చుకోవాలి . మహిళల్లో ప్రత్యుత్పత్తిని వేగవంతంగా చేయడానికి ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్:

ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్:

త్వరగా గర్భం పొందాలంటే ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ క్రమం తప్పకుండా తీసుకోవాలి . ఇది పిండాభివ్రుద్దికి మరియు శిశువు పుట్టుకలో లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

సంతానోత్పత్తిని పెంచడానికి డైరీ ప్రొడక్ట్స్ చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా ఇవి సంతానోత్పత్తికి ముఖ్యంగా అవసరం అయ్యే ఎఫ్ హెచ్ ఎస్ మరియు ఎల్ హెచ్ హార్మోనులను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మ మహిళల్లో సంతానోత్పత్తిని పెంచతుంది. యూట్రస్ కు రక్తప్రసరణను సప్లై చేస్తుంది. మరియు గర్భాశయ లోపలి పొర పలుచబడినప్పుడు మహిళల్లో సంతానోత్పత్తి బాగా మెరుగుపడుతుంది. ఇంకా పిండం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధి సహాయపడుతుంది. అదేవిధంగా పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత పెంచడానికి సహాయపడుతుంది. అందుకు ప్రతి రోజూ దానిమ్మ సీడ్స్ తినడం లేదా జ్యూస్ త్రాగడం మంచిది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

సంతాన ప్రాప్తి పొందడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి ఆలివ్ ఆయిల్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. త్వరగా గర్భం పొండానికి సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్లో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఎవరైతే మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ను అధికంగా తీసుకుంటారో వారిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైనది. కాబట్టి . ప్రతి రోజూ 1 లేదా 2 చెంచాల ఆలివ్ ఆయిల్ ను ప్రతి రోజూ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా త్వరగా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

ఖర్జూరం:

ఖర్జూరం:

ఆయుర్వేదం ప్రకారం, డేట్స్ గర్భం పొందే అవకాశాలను పెంచుతుంది. వీటిలో వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫెర్టిలిటికి చాలా మేలు చేస్తాయి. ఖర్జూరంలోని విత్తనాలు తొలగించి, వాటిని మిక్సీలో వాటితో పాటు కొత్తిమీర కాడలను కట్ చేసి వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక కప్పు పాలలో వేసి మిక్స్ చేసి పీరియడ్స్ ముగిసిన రోజు నుండి ప్రతి రోజూ 7 రోజుల పాటు త్రాగాలి. ఇలా చేస్తుంటే త్వరగా కన్సీవ్ అవుతారు.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

వంధ్యత్వం నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుందని చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. దీని ఉండే ఔషధ గుణాలు శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేసి, హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ అసిడిక్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల , శరీరానికి ఆల్కలైన్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది శరీరంలో ఆల్కలైన్ పిహెచ్ లెవల్స్ ను పెచుతుంది. ఇది సులభంగా కన్సీవ్ అవ్వడానికి సహాయపడుతుంది.

 విటమిన్ డి లోపం:

విటమిన్ డి లోపం:

మహిళల్లో విటమిన్ డి లోపం వల్ల వంధ్యత్వానికి మరియు గర్భస్రావానికి కారణం అవుతుంది . కాబట్టి, గర్భం పొందడానికి ముందు శరీరంలో విటమిన్ డి లెవల్స్ ను చెక్ చేసుకోవాలి. గర్భం పొందడానికి మరియు ప్రసవానికి విటమిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయని మోలాక్యురల్ న్యూట్రీషియన్ మరియు ఫుడ్ రీసెర్చ్ జనరల్ 2010పరిశోధనలో వెల్లడించారు. అలాగే 2011లో జనరల్ మెటబాలిజంలో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం విటమిన్ డి లోపం వల్ల పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఇర్రెగ్యులర్ ఓవలేషన్ కు కారణం అవుతుందని నిర్ధారించారు. కాబట్టి మహిళలు సాధ్యమైనంత వరకూ ఉదయం సూర్యరశ్మిలో 10 నిముషాలు పాటు ఎక్స్ఫోజ్ అవ్వడం మంచిది. అలాగే విటమిన్ డి అధికంగా ఉండే సాల్మన్, చీజ్, గుడ్డు, మష్రుమ్ వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

హైలిబిడో ఫుడ్స్

హైలిబిడో ఫుడ్స్

కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి. ఇది కామేచ్చను పెంచుతాయి. మరియు ఎనర్జీని అందిస్తాయి. అలాంటి ఆహారాల్లో బ్లాక్ రాస్బెర్రీస్, బ్రొకోలీ, ఫిగ్స్, వాటర్ మెలోన్, గుడ్లు, కుంకుమపువ్వు, లెట్యూస్, అల్లం, అవొకాడో, బీన్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి గ్రేట్ గా సహాయపడుతాయి

English summary

Natural Foods to Help You Conceive Faster

Natural Foods to Help You Conceive Faster, Getting pregnant is one of the most enriching and soul-satisfying experiences in a woman’s life. If you and your partner have made the decision to try for a baby, you want it to happen as soon as possible!
Story first published: Monday, May 16, 2016, 11:54 [IST]
Desktop Bottom Promotion