Latest Updates
-
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!
గర్భిణీలు ఎలాంటి పరిస్థితిలో వ్యాయామాలకు దూరంగా ఉండాలి ?
గర్భధారణ, వ్యాయామం రెండూ ముఖ్యమైనవే. గర్భధారణ సమయంలో కూడా చురుకుగా ఉండాలంటే, ఫిట్ గా ఉండాలన్నా మంచి ఆహారాలను, పోషకాహారాలను తీసుకోవాలి. అలాగే దినచర్యలో యోగా, గర్భం ధరించడానికి ముందు జిమ్ కు వెళ్లడం వంటివి చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మహిళలు వ్యాయామం లేదా యోగ వంటివి ఒక పరిమితిలో చేసుకుంటే మంచిది.
గర్భం ధరించిన తర్వాత, శరీరం మరింత బరువుగా తయారవుతుంది. పాదాల వాపులు, కాళ్ల వాపులు, లోయర్ బ్యాక్ పెయిన్, తరచూ విశ్రాంతి లేకపోవడం, అలసటగా ఉండటం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, వెంటనే మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం.
పాదాలను గోరువెచ్చని నీటిలో డిప్ చేసి, రెస్ట్ తీసుకోవడం వల్ల పాదాల్లో వాపు తగ్గుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ నివారిస్తుంది. ప్రీనేటల్ మసాజ్ కూడా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ మసాజ్ వల్ల నొప్పులు, ఒళ్లు నొప్పలు కూడా తగ్గించుకోవచ్చు.
అలాగే కొంత మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో కొన్ని సులభమైన వ్యాయామాలు, నిపుణుల సమక్షంలో చేయడం వల్ల కొన్ని సమస్యలను నివారించుకోవడంతో పాటు, ప్రసవం సులభంగా అవుతుందని సూచిస్తున్నారు.
అయితే , గర్భిణీ స్త్రీలు కొన్ని సందర్భాలో వ్యాయామాలకు దూరంగా ఉండటం మంచిది. మరి గర్భిణీ ఎటువంటి సందర్బాల్లో వ్యాయామాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం...

కళ్లు తిరిగుతున్నప్పుడు:
తల తిరుగుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు, వ్యాయామానికి దూరంగా ఉండాలి. వెంటనే విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలాంటి సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. కొద్దిగా నీళ్లు తాగి, గట్టిగా శ్వాస తీసుకొని వదలాలి. ఇలా రెండు మూడు సార్లు చేయడం వల్ల నాడీవ్యవస్థ బావుంటుంతుంది.

తలనొప్పి:
అలసటతో పాటు, తలనొప్పి, తలబారంగా అనిపించినప్పుడు వ్యాయామానికి దూరంగా ఉండాలి. ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది, డీహైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

ఛాతీలో నొప్పి:
చాలా మంది గర్భిణీల్లో సెకండ్ ట్రైమ్ స్టర్ లో ఛాతీలో నొప్పి ఉంటుంది. ఇది గర్భంలో పిండం పెరుగుదల వల్ల జరుగుతుంది. ఇది వెన్ను మీద ప్రభావం చూపడం వల్ల చాతీలో నొప్పిగా అనిపిస్తుంది.

శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది:
వ్యాయామం నిలపడానికి మరో కారణం శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు వెంటనే వ్యాయామం మానేయాలి. ఈ సమస్యను క్రమంగా ఫేస్ చేస్తుంటే, మీ శరీరానికి విశ్రాంతి అవసరం.

వాజినల్ బ్లీడింగ్:
గర్భధారణలో బ్లీడింగ్ అయితే కంగారుపడాల్సిన విషయమే. వ్యాయామ సమయంలో బ్లీడింగ్ అవుతున్నట్లు గమనిస్తే వెంటే వ్యాయామం ఆపేయాలి. వెంటనే వైద్యులను కలవడం మంచిది. ఇది గర్భస్రావానికి కారణం కావచ్చు.

కాంట్రాక్షన్స్:
కాంట్రాక్షన్స్ బాధాకరం. ప్రసవానికి ఒక సంకేతం. కాంట్రాక్షన్ నొప్పిని గుర్తించినట్లైతే వెంటనే మెటర్నిటి హాస్పిటకు వెళ్లడం ఉత్తమం.

హార్ట్ బీట్ వేగంగా ఉంటే:
హార్ట్ బీట్ వేగంగా ఉన్నప్పుడు కూడా వ్యాయామానికి దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
