పిల్లలు పుట్టాలంటే 3 నెలల ముందు నుండి ఈ 9 ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ తినాలి

By Lekhaka

సహజంగా ఫోలిక్ యాసిడ్ ను రోజుకు 400గ్రాములు తీసుకోవాలి. 400 గ్రాములా అమ్మో అంతనా అని అంటారు. . అయితే ఫోలిక్ యాసిడ్ అన్ని గ్రాములు పొందడానికి వివిధ మార్గాలు, టేస్టీ న్యూట్రీషియన్ ఫుడ్స్ ఉన్నాయి.

ఫోలిక్ యాసిడ్ ఎందుకు అంత అవసరం? మహిళ గర్భం పొందిన మొదటి మూడు నెలలల్లో బేబీ బ్రెయిన్ మరియు నాడీ వ్యవస్థ డెవలప్ కావడానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి9 బేబీ పుట్టక లోపాలను తొలగిస్తుంది. పొట్టలో బేబీ ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అందుకే ఫోలిక్ యాసిడ్ ను మొదటి త్రైమాసికంలో తీసుకోవడం చాలా అత్యవసరం అని డాక్టర్లు సూచిస్తుంటారు

రోజుకు 400 మైక్రోగ్రాములు ఫోలిక్ యాసిడ్ ను తీసుకోవడం వల్ల గర్భం పొందడానికి , గర్భం పొందిన మొదటి మూడు నెలలో బిడ్డ ఆరోగ్యానికి సహాయపడుతాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ లో గర్భం పొందడానికి మూడు నెలల ముందు నుండి తీసుకోవాలి. ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను వాడితే నెలలు నిండకుండా పుట్టే పిల్లల శాతం 60%శాతానికి పైగా రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ గర్భధారణ ఆకస్మికంగా ఉంటే మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే ఫోలిక్ ఆమ్లం మాత్రలను ప్రారంభించండి.

పిల్లలు పుట్టాలంటే 3 నెలల ముందు నుండి ఈ 9 ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ తినాలి

గర్భధారణ యొక్క మొదటి 12 వారాల ఫోలిక్ ఆమ్లం మాత్రలు తీసుకోవాలి.ఫోలిక్ ఆమ్లం B విటమిన్ యొక్క ఒక రూపం.ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల గర్భస్రావం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మరియు పిల్లలు నాడీ ట్యూబ్ డిజార్డర్ ప్రతి 1000 మందిలో ఒకరికి వచ్చేఅవకాశం ఉంది.

ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకుంటున్నప్పుడే ఫోలిక్‌యాసిడ్‌ తీసుకోవడం మొదలుపెడితే మరీ మంచిదంటారు వైద్యులు. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలంటే తగినంత ఫోలిక్‌యాసిడ్‌ అవసరం. ఆ మాటకొస్తే గర్భిణిలకే కాదు అందరికీ అవసరమే. అయితే మాత్రల రూపంలో కాకుండా న్యాచురల్‌ ఫుడ్‌ను తీసుకోవడం ద్వారా తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభించేలా చూసుకోవడం ఉత్తమం.


గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రయోజకారిని..ఫోలిక్ యాసిడ్

19 ఏళ్లు పైబడిన పురుషులు : 400 మైక్రోగ్రామ్స్‌

13 ఏళ్లు పైబడిన స్త్రీలు : 400-600 మైక్రోగ్రామ్స్‌

గర్భిణిలు : 600 మైక్రోగ్రామ్స్‌


ఫోలిక్ యాసిడ్ కేవలం పిల్స్ ద్వారానే కాకుండా ఆహారాల్లో కూడా పుష్కలంగా ఉన్నాయి. సప్లిమెంట్స్ కంటే న్యాచురల్ గా అందుబాటులో ఉండే ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ ను తీసుకోవడం ఇటు తల్లి, అటు బిడ్డ ఆరోగ్యానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. మరి అలాంటి ఫోలిక్ యాసిడ్ ఫుడ్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

 1. మార్మైట్

1. మార్మైట్

ఇష్టమున్నా, లేకున్నా మార్మైట్ లేదా ఈస్ట్ ఎక్స్ ట్రాక్ట్ లో ఫోలిక్ యాసిడ్ పుష్కలం. రోజూ జస్ట్ రెండు మూడు టీస్పూన్లు తీసుకుంటే చాలు మీకు కావల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది.

2. సన్ ఫ్లవర్ సీడ్స్

2. సన్ ఫ్లవర్ సీడ్స్

ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, ఫోలిక్ యాసిడ్ కు అద్భుతమైన మూలం ప్రొద్దుతిరుగుడు విత్తనాలు. ఇందులో విటమిన్ ఇ, ఐరన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఎనర్జీ లెవల్స్ ను పెంచుతాయి. వీటిని స్నాక్స్, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.

3. ఆస్పరాగస్

3. ఆస్పరాగస్

ఆస్పరాగస్ లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ను ఆవిరి మీద ఉడికించి తీసుకోవాలి. ఎక్కువగా ఉడికిస్తే ఫొల్లెట్ తొలగిపోతుంది. తినడానికి అంత రుచిగా ఉండదు.

4. పీనట్స్

4. పీనట్స్

పీనట్స్ లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువా ఉంటుంది. గుప్పెడు వేరుశెనగల్లో 30 గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి, రోజూ కొన్ని వేరుశెనగలు తినడం , పీనట్ బట్టర్ ను డైట్ లో చేర్చుకోవడం మంచిది. అయితే ఉప్పచేర్చని ఫీనట్ బట్టర్ ను ఎంపిక చేసుకోవాలి. రోజుకు 400మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. గర్భధారణకు ముందు కనీసం 6 నెలల నుండి తీసుకోవడం మంచిది.

5. బీన్స్‌, బఠాణీలు, కాయధాన్యాలు

5. బీన్స్‌, బఠాణీలు, కాయధాన్యాలు

బీన్స్‌, బఠాణీలో ఫోలిక్‌ యాసిడ్‌ అధిక శాతం ఉంటుంది. అంతేకాకుండా చిన్న కప్పు కాయధాన్యాలను తీసుకున్న తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది.

శెనగలను మమూస్ కు ఉపయోగిస్తారు . ఫొల్లెట్ అధికంగా ఉండే కిడ్నీ బీన్స్, పింటో, బ్లాక్ అండ్ గ్రీన్ బీన్స్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. అలాగే స్ల్పిట్ పీస్ లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ. .

6. ఆకుకూరలు

6. ఆకుకూరలు

ఫోలిక్‌యాసిడ్‌ లెవెల్స్‌ త్వరగా పెరగాలంటే పాలకూర, సోయాను డైట్‌లో చేర్చండి. వీటిని ఒక కప్పు తీసుకున్నట్లయితే ఆ రోజు తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ మీకు చేరుతుంది.కేల, కొలరాడ్స్, టర్నిప్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. .

7. పండ్లు

7. పండ్లు

బొప్పాయి , ఆరెంజ్, ద్రాక్ష వంటి పండ్లలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. వీటిలో 30 నుండి 40 మైక్రోగ్రాములు ఉంటాయి. 15 నుండి 25 మైక్రోగ్రాములు వరకూ ఒక కప్పు తీసుకోవాలి. వీటితో స్మూతీ తయారుచేసి తీసుకోవాలి.

8. బ్రొకోలీ

8. బ్రొకోలీ

ఈ మ్యాజికల్ బ్రొకోలీలో ఫోలిక్ యాసిడ్, పొల్లెట్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉన్నాయి.

9. అవొకడో

9. అవొకడో

ఒక కప్పు అవొకడో తీసుకుంటే 90 మైక్రోగ్రాముల విటమిన్‌ బి9 లభిస్తుంది. ఇది రోజూ తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌లో 22 శాతం ఉంటుంది. అంతేకాకుండా విటమిన్‌ ఎ, కె, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి.

Desktop Bottom Promotion