Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హలో కపుల్స్! పిల్లలతో పాటు పడుకుంటున్నారా? ఆ.. విషయంలో సమస్యలు తప్పవట
చాలా మంది భార్యాభర్తలు తమ పిల్లలను తమ వెంటే బెడ్‌పైనే పడుకోబెట్టుకుంటారు. గోడవైపు లేదా దంపతుల ఇద్దరి మధ్యలో పిల్లలను పడుకోబెట్టుకోవడం మన దేశంలో చాలా కామన్. వారికి 10-12 ఏళ్లు వచ్చేంత వరకు ఇదే ధోరణి ఉంటుంది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గడంతో పాటు పిల్లల ఎదుగుదలపై, వారిలో స్వతంత్ర భావాలు రేకెత్తడంపై ప్రభావం పడుతుందని అంటున్నారు నిపుణులు.

పిల్లలతో కలిసి పడుకుంటే దంపతుల మధ్య సమస్యలు:
పిల్లలతో కలిసి పడుకునే దంపతుల్లో సాన్నిహిత్యం రోజురోజుకూ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో కలిసి పడుకోవడం వల్ల దంపతులకు ఏకాంత సమయం దొరకదు. ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా పిల్లలు పక్కనే ఉంటారు. శృంగార కోరికలు వచ్చినా నియంత్రించుకోవాల్సి వస్తుంది. దీని వల్ల క్రమంగా లైంగిక చర్యలకు సమయం కేటాయించడం తగ్గుతుంది. దాంపత్యబంధంలో శృంగారం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే లేకపోతే దంపతుల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోతుంది. సంసార జీవితంలో క్రమంగా కలతలు వస్తాయి. అదే పిల్లలను విడిగా పడుకోబెట్టడం వల్ల బెడ్రూములు దంపతులు ఏకాంతంగా ఉంటారు. మంచీ చెడు మాట్లాడుకోవడానికైనా, ఊసులాడుకోవడానికైనా, శృంగార కార్యకలాపాలకైనా చాలా సమయం దొరుకుతుంది.
పిల్లలకు ఏ వయస్సులో గది కేటాయించాలంటే:
చిన్నారికి 3 నెలల వయస్సు వచ్చినప్పటి నుంచే వారిని బెడ్ కూ దూరంగా ఉయ్యాల క్రిబ్ వేసి అందులో పడుకోబెట్టాలి. ఏడాది వయసు వచ్చే వరకు ఇలాగే పడుకోబెట్టాలి. ఏడాది వయస్సు దాటిన తర్వాత క్రమంగా వారికి ప్రత్యేక గది అలవాటు చేయాలి. రాత్రంతా ప్రత్యేక గదిలో పడుకోబెట్టడం కాకుండా.. కొన్ని గంటల చొప్పున పెంచుతూ పోవాలి. అలాగే ప్రత్యేక గదిలో పడుకోబెట్టినప్పటికీ వారిని మధ్యమధ్యలో గమనిస్తూ ఉండాలి. వారి అవసరాలు తీర్చుతూ ఉండాలి. కెమెరాలు, బేబీ మానిటర్ లాంటివి అమర్చుకోవాలి. సాంకేతిక వాడుతూ పిల్లలను సంరక్షించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారికి ప్రత్యేక గదికి అలవాటు చేయడంతో పాటు వాళ్లెలా పడుకుంటారోనన్న భయమూ ఉండదు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:
వాల్ పెయింటింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, థీమ్ బెడ్, బొమ్మలు, ఇతర అలంకరణ వస్తువులతో వారి గదిని అలంకరించాలి. కొంత వయస్సు వచ్చిన తర్వాత వారి గదిలో వస్తువులను వారే సర్దుకునేలా అలవాటు చేయాలి. అలాగే పిల్లలు భయపెట్టే కథలు వినిపించడం, హార్రర్ సినిమాలు చూడటంలాంటివి చేస్తే వాళ్లు ఒంటరిగా పడుకోవడానికి భయపడతారు. కాబట్టి అలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలి. ఎప్పుడైనా పిల్లలు ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడకపోయినా, భయపడినా ఆ సమయంలో వారితో కలిసి కాసేపు పడుకోవాలి.
చుట్టాలు, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలను మీతో పడుకోబెట్టుకుని వారికి పిల్లల గదిని కేటాయించాలి. అంతే తప్ప కొత్తవారితో పిల్లలను పడుకోమని బలవంత పెట్టవద్దు. అలాగే పిల్లలు అభద్రతా భావానికి లోనుకాకుండా వారితో స్నేహంగా మెలగాలి. ఏదైనా సమస్య ఉంటే నిర్మొహమాటంగా చెప్పే పరిస్థితి వారికి కల్పించాలి. అలాగే వారి గదిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications