Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
పోషకాలు నిండిన అలసంద చాట్:బ్రేక్ ఫాస్ట్, స్నాక్ లేదా సైడ్ డిష్ గా అధ్బుతం..ఎలా చేసకోవాలవటే
అలసందలు మన భారతీయ వంటకాల్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలసందలతో కూరలు, వడలు, పాయసం వంటి అనేక వంటకాలు చేస్తారు. కానీ అలసందలతో చేసే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల్లో ఒకటి అలసంద చాట్. ఇది మనం టిఫిన్ లోకి, స్నాక్ గా లేదా అన్నంలోకి సైడ్ డిష్ గా కూడా చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. రోజూ ఒకే రకం బ్రేక్ ఫాస్ట్ తిని తిని బోర్ కొట్టేసినవాళ్లు కొత్తగా ఇది ట్రై చేయండి. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
అలసంద చాట్ ఒక ఆరోగ్యకరమైన స్నాక్ మాత్రమే కాదు, మీ ఆరోగ్య లక్ష్యాలకు మద్దతు ఇచ్చే ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే పీచు పదార్థం, ప్రొటీన్, విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. అలసంద చాట్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

అలసంద చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-అలసందలు
-ధనియాలు
-ఆవాలు,జీలకర్ర
-ఉప్పు
-కారం
-పచ్చిమిరపకాయ
-ఉల్లిపాయ
-ఆయిల్
-కరివేపాకు
-కొత్తిమీర
అలసంద చాట్ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో బాగా కడిగిన 1 కప్పు అలసందలు వేసి నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టాలి. లేదంటే రాత్రంతా కూడా నానబెట్టవచ్చు.
-తర్వాత అలసందను మళ్లీ కడిగి కుక్కర్ లో వేయండి. ఇందులోనే ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూతపెట్టి 3 విజిల్స్ వేచ్చేదాకా ఉడికించండి. అలసందలు మెత్తబడే దాకా ఉడకాలి.
-ఉడికించిన అలసందల్లోని నీటిని వడకట్టి తీసుకోండి.
-ఇప్పుడు పొట్లు తీసిన 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ ధనియాలను కచ్చాపచ్చగా దంచి తీసుకోండి. ఇంట్లో రోలు లేకుంటే మిక్సీలో అయినా కచ్చాపచ్చాగా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ, 3 పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి.
-ఉల్లిపాయలు లైట్ గా వేగిన తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియా, వెల్లుల్లి ముద్ద వేసి మర్ 2 నిమిషాలు ఫ్రై చేయండి.
-కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించాక అందులో కద్దిగా పసుపు బాగా ఉడికించి నీళ్లన్నీ ఒంపేసిన అలసందలు వేయండి. ఇందులో అర టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు , కొత్తిమీర తరుగు, అర చెక్క నిమ్మ రసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అలసంద చాట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications