Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బోర్ కొట్టే చట్నీలకు గుడ్ బై..కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీతో ఇడ్లీ, దోశలకు కొత్త రుచి
సాధారణంగా పొద్దున్నే మన ఇళ్లల్లో బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ,దోశ ఎక్కువగా చేస్తుంటారు. వీటిల్లోకి సైడ్ డిష్ గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లేదా టమాట చట్రీ వంటివి చేస్తుంటారు. అయితే రోజూ ఇవే చట్నీలు తిని తిని విసుగొచ్చినట్లయితే ఓ సారి కర్ణాటక స్పెషల్ ఉచేలు చట్నీ ట్రై చేయండి.
సాధారణంగా నువ్వులను మనం లడ్డూలు, అరిసెలు, మురుకులు వంటి పిండివంటలలో ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చిన్న గింజలతో కమ్మనైన, ఘుమఘుమలాడే పచ్చడి చేయవచ్చని మీకు తెలుసా? అదే కర్ణాటకలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఉచేలు చట్నీ (నువ్వుల పచ్చడి). ఈ చట్నీ రుచి ఒక్కసారి చూశారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఉచేలు చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
నువ్వులు: 3 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము: పావు కప్పు
ఎండు మిరపకాయలు: 3
వెల్లుల్లి రెబ్బలు: 3
కొత్తిమీర:పావు కప్పు
చక్కెర:చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 టీస్పూన్
ఆవాలు: అర టీస్పూన్
కరివేపాకు: ఒక రెమ్మ
తాలింపుకి ఎండు మిరపకాయలు: 2
తయారీ విధానం
-ముందుగా ఒక పాన్ ను పొయ్యి మీద పెట్టి అందులో నువ్వులను వేసి మీడియం మంట సువాసన వచ్చే వరకు సుమారు ఒక నిమిషం పాటు దోరగా వేయించాలి.
-నువ్వులు రంగు మారగానే వెంటనే దించేయాలి.నువ్వులు కొంచెం మాడినా పచ్చడి మొత్తం చేదుగా మారిపోతాయి. వేయించిన నువ్వులను ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, కొత్తిమీర, చిటికెడు చక్కెర, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ముందుగా నీళ్లు పోయకుండా ఒకసారి గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ సమానంగా నలుగుతాయి.
-ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి చల్లార్చిన నువ్వులను కూడా వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఈ పచ్చడి కాస్త చిక్కగా ఉంటేనే రుచి అద్భుతంగా ఉంటుంది, కాబట్టి నీళ్లు చూసుకుంటూ కొద్దికొద్దిగా కలుపుకోండి. గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి మార్చుకోండి.
-ఇప్పుడు తాలింపు కోసం చిన్న పాన్ లో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, తుంచిన ఎండు మిరపకాయలు వేసి ఒక క్షణం వేయించి, వెంటనే ఈ తాలింపును పచ్చడి గిన్నెలో కలపండి.
-అంతే ఘుమఘుమలాడే, కమ్మనైన కర్ణాటక స్పెషల్ నువ్వుల పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడి ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగులతోనే కాకుండా జొన్న రొట్టెలతో కూడా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications