Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
మన భారతీయ భోజనంలో చట్నీకి ఉండే స్థానమే వేరు. వేడి వేడి అన్నంలోకైనా, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ లోకైనా, సాయంత్రం తినే స్నాక్స్ లోకైనా చట్నీ తోడైతే ఆ భోజనం రుచి అమాంతం పెరిగిపోతుంది. సాధారణంగా మన ఇళ్లలో కొత్తిమీర, పుదీనా, టమాటా లేదా కొత్తిమీర చట్నీలను తరచుగా చేసుకుంటాం.
మీరు ఎప్పుడైనా ఆవాల చట్నీని రుచి చూశారా? వినడానికి కాస్త కొత్తగా అనిపించినా, దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ చట్నీని అమితంగా ఇష్టపడతారు.

ఆవాలకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచే సహజ గుణం ఉంటుంది. అందుకే చలికాలంలో దీనిని ఎక్కువగా తీసుకుంటారు. బీహార్ లో అయితే వేడి వేడి సమోసాలు, లిట్టీ చోఖాతో పాటు ఈ ఆవాల చట్నీని కచ్చితంగా వడ్డిస్తారు. రుచికరమైన ఆవాల చట్నీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఆవాల చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
పసుపు రంగు లేదా నల్ల ఆవాలు - 4 టేబుల్ స్పూన్లు
పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 8 నుంచి 10
పచ్చిమిర్చి - 3 లేదా 4
అల్లం - 1 అంగుళం ముక్క
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్) - 2 టేబుల్ స్పూన్లు
పసుపు పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా!
ఆవాల చట్నీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఆవాలను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిలో గోరువెచ్చని నీళ్లు పోసి సుమారు ఒకటి నుంచి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆవాలు బాగా మెత్తబడటమే కాకుండా, వాటిలోని ఘాటు లేదా వగరు తగ్గిపోయి చట్నీకి కచ్చితమైన రుచి వస్తుంది.
-ఆవాలు బాగా నానిన తర్వాత, వాటిలోని నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు నానబెట్టిన ఆవాలను ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పసుపు, రుచికి సరిపడా తెల్ల ఉప్పు, నల్ల ఉప్పు వేయాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి, ఎక్కడా బరక లేకుండా మెత్తటి పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి.
-మిక్సీ పట్టుకున్న ఈ చట్నీలో అసలైన రుచిని తెచ్చేది ఆవ నూనె, నిమ్మరసమే. ఇప్పుడు చట్నీలో 2 టేబుల్ స్పూన్ల పచ్చి ఆవ నూనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేయాలి. నూనె, నిమ్మరసం చట్నీలో పూర్తిగా కలిసేలా మిక్సీని మరో రెండు, మూడు సెకన్ల పాటు తిప్పాలి.
-అంతే ఆవాల చట్నీ రెడీ. దీనిని ఒక గాజు సీసాలో భద్రపరచుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
