Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు!
మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సు నుంచే అనేక వ్యాధుల బారిన పడుతున్నారు చాలామంది. ఒకప్పుడు పెద్ద వయస్సులో వచ్చే షుగర్, బీపీ లాంటి వ్యాధులు ఇప్పుడు 20 ఏళ్లకే వచ్చేస్తున్నాయి. ఇక గ్యాస్ ప్రాబ్లమ్, ఇతర కడుపు సంబంధిత వ్యాధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్యాస్ ట్యాబ్లెట్ లేకుండా రోజుని గడపలేని వ్యక్తులు ఎందరో ఉన్నారు. అయితే మన ఆరోగ్యపు రహస్యం అంతా దాదాపు మన తినే ఫుడ్ లో ఉంటది.
సాధారణంగా ఉయదం లేదా రాత్రి టైంలో మనం చపాతీలు లేదా పరాఠాలు లేదా పూరీ వంటివి చేసుకుంటుంటాం. గోధుమపిండితోనే వీటిని మనం చేసుకుంటాం. వాస్తవానికి గోధుమలు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ కేవలం గోధుమ పిండి మాత్రమే మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించదు. ఈ పిండిలో కొన్ని ప్రత్యేకమైన, పోషకమైన పదార్థాలను జోడించం స్టార్ట్ చేస్తే అదొక సూపర్ ఫుడ్ గా అయిపోతది. అయితే గోధుమ పిండిలో ఏ పదార్థాలను కలిపితే మనం జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కాల్సిన పని ఉండదో ఇక్కడ చూడండి.

శనగ పిండి
శనగపిండిలో ప్రొటీన్, ఫూబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. షుగర్ పేషెంట్లకు ఇది బెస్ట్. ఇది మిమ్మల్ని ఎక్కువ టైం కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది. 4 కేజీల గోధుమపిండిలో 1 కేజీ శనగపిండిని కలుపుకోండి.
రాగి పిండి
ఇందులో కావాల్సినంత క్యాల్షియం ఉంటది. ఎదిగే పిల్లలకు, మహిళలకు ఇది చాలా అవసరం. రాగిలో క్యాల్షియంతో పాటు థయామిన్ కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి ఉక్కు మాదిరి ఎముకలను బలపరుస్తుంది.ఒకవేళ మీరు లేదా మీ కుటుంబసభ్యులు తరచుగా మోకాళ్లు లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే మాత్రం రాగి పిండి ఈ సమస్యలను తొలగిస్తుంది. రక్తహీనతతో బాధపడేవాళ్లకి కూడా ఇది బెస్ట్.
ఓట్స్ పొడి
ఆరోగ్యకరమైన గుండెను కాపాడుకోవడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఓట్స్ కి మించింది లేదు. ఓట్ స్లో బీటా-గ్లూకాన్ అనే కరిగే పీచుపదార్థం ఉంటుంది, ఇది ధమనుల నుండి కొలెస్ట్రాల్ నిక్షేపాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్..
సోయాబీన్ పిండి
అలసటగా, నీరసంగా అనిపిస్తే, మీ శరీరానికి ప్రోటీన్ అవసరం. సోయాబీన్స్ ను పిండితో కలపడం ఒక బెస్ట్ ఆప్షన్. సోయాబీన్స్ లో అధిక నాణ్యత గల ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి కండరాలను బలపరిచి, మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచి, కాలానుగుణ అనారోగ్యాలను దూరంగా ఉంచుతాయి.
అవిసె గింజల పొడి
చిన్న అవిసె గింజలు పోషకాల నిధి. వాటిని తేలికగా వేయించి, రుబ్బి, పిండిలో కలపండి. అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి,శరీరంలోని అంతర్గత వాపును తగ్గిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
