Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
ప్రొటీన్ పవర్.. అదిరిపోయే ఫ్లేవర్..అఫ్ఘానీ సోయా కర్రీ తయారీ విధానం ఇదే..
మీల్ మేకర్ లో(సోయా) ఉండే ప్రొటీన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఎప్పుడూ ఒకేలాంటి మీల్ మేకర్ కర్రీ వండుకుని తిని విసుగొచ్చేసిందా? అయితే అఫ్ఘానీ సోయా కర్రీ ట్రై చేయండి. క్రీమీగా, రిచ్ గా ఉండే ఈ కర్రీని ఒక్కసారి రుచి చూస్తే, ఇది కచ్చితంగా మీ కొత్త ఫేవరెట్ వంటకంగా మారడం ఖాయం. నాన్, చపాతీ లేదా బిర్యానీలోకి ఇది అద్భుతమైన కాంబినేషన్.

అప్ఘానీ మీల్ మేకర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
సోయా చంక్స్ - 1 కప్పు
పెరుగు (బాగా గిలకొట్టినది) - 1 కప్పు
ఉప్పు - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
యాలకులు - 2-3
లవంగాలు - 2
దాల్చిన చెక్క - చిన్న ముక్క
అల్లం - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 1
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
జీడిపప్పు - పావు కప్పు
కొత్తిమీర- గుప్పెడు
పుదీనా ఆకులు - కొద్దిగా
బిర్యానీ ఆకు - 1
అనాస పువ్వు- 1
గరం మసాలా - అర టీస్పూన్
ఐస్ క్యూబ్స్ - కొన్ని
అప్ఘానీ మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని, అందులో ఒక కప్పు సోయా చంక్స్ వేసి 10-15 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి బాగా మెత్తబడి, నీరు చల్లారిన తర్వాత సోయాలోని నీళ్లన్నీ గట్టిగా పిండేసి వాటిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు అదే బౌల్ లో మెత్తగా గిలకొట్టిన ఒక కప్పు పెరుగు వేయాలి. అందులో 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ మిరియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. సోయా చంక్స్ కు ఈ పెరుగు మిశ్రమం బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ మీద పాన్ పెట్టి 1 టీస్పూన్ నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అందులో గుప్పెడు కొత్తిమీర (కాడలతో సహా), కొద్దిగా పుదీనా ఆకులు, గ్రేవీ రంగు మారకుండా ఉండేందుకు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి, 1 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆకుపచ్చని గ్రేవీ పేస్ట్ ను అందులో వేసి 3-4 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా ఉడికించాలి.
-గ్రేవీ ఉడికిన తర్వాత, అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసి కలపాలి. మంటను తక్కువగా ఉంచి మరో 4-5 నిమిషాలు ఉడికించాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ గరం మసాలా వేసి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
క-ర్రీ మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి, చివర్లో కాశ్మీరీ ఎండుమిర్చితో చిన్న తాలింపు వేసి, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకోవచ్చు.
-అంతే ఎంతో గుమగుమలాడే, క్రీమీ అఫ్ఘానీ సోయా కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
