Latest Updates
-
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం!
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
చపాతీలు, రోటీలలోకి ఎప్పుడూ ఒకే రకమైన కూరలు తిని మీ కుటుంబ సభ్యులకు బోర్ కొట్టిందా? వారు రెస్టారెంట్ స్టైల్‌లో ఏదైనా కొత్తగా, వెరైటీగా ఉండే సైడ్ డిష్ కావాలని అడుగుతున్నారా? ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్లకు సోయా (మీల్ మేకర్) అంటే చాలా ఇష్టమా? సోయాతో ఎప్పుడూ ఒకేలా కాకుండా, ఈసారి కాస్త విభిన్నంగా ఆఫ్ఘానీ స్టైల్ సోయా కర్రీని ట్రై చేయండి.
ఈ కర్రీ చాలా క్రీమీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, అద్భుతమైన రుచితో ఉంటుంది. దీన్ని ఒక్కసారి రుచి చూశారంటే చాలు, మీ ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారు. పదే పదే మీ డైనింగ్ టేబుల్ మీద ఈ డిష్ ఉండటం ఖాయం. ఆఫ్ఘానీ సోయా కర్రీని సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
నానబెట్టడానికి
సోయా చంక్స్ (మీల్ మేకర్) - 3 కప్పులు (సుమారు 175 గ్రాములు)
వేడి నీళ్లు - తగినంత
మసాలా పేస్ట్ కోసం
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 4
జీడిపప్పు - 12
మిరియాల పొడి - 2 టీస్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
పెరుగు - 400 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
కూర తయారీకి
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
నీళ్లు - 1 కప్పు
గరం మసాలా - 1 టీస్పూన్
కసూరి మేతి - 1 టీస్పూన్
ఫ్రెష్ క్రీమ్ - కొద్దిగా
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో సోయా చంక్స్ (మీల్ మేకర్) వేయండి. అవి మునిగేలా వేడి నీళ్లు పోసి సుమారు 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. బాగా నానిన తర్వాత, సోయాలోని నీళ్లన్నీ గట్టిగా పిండేసి వాటిని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించండి.
-ఆ తర్వాత అందులోనే జీడిపప్పు, మిరియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర వేసి మరో 3 నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించి స్టవ్ కట్టేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు అందులోనే 400 గ్రాముల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్లీ క్రీమీ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
-స్టవ్ మీద మరో మందపాటి పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించండి.
-తర్వాత ముందుగా నీళ్లు పిండి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ ను అందులో వేసి ఓ 4 నిమిషాల పాటు నెయ్యిలో బాగా వేయించండి.
-ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్ ను పాన్ లో వేసి సోయాకు పట్టేలా బాగా కలపండి. అందులోనే 1 కప్పు నీళ్లు పోసి, అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు పాన్ పై మూత పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాల పాటు ఉడికించండి.
-15 నిమిషాల తర్వాత మూత తీసి, అందులో గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలపండి. కూర చిక్కబడి క్రీమీగా మారుతున్న సమయంలో.. చివరగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి దించేయండి.
-అంతే ఘుమఘుమలాడే, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ ఆఫ్ఘానీ సోయా కర్రీ రెడీ. వేడివేడి చపాతీ, నాన్ లేదా బటర్ కుల్చాతో ఈ కర్రీని వడ్డించి చూడండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
