For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ పరాఠా రెసిపి । పంజాబీ ఆలూ కా పరాఠా రెసిపి। ఆలూ కూరిన పరాఠా రెసిపి

Posted By: DEEPTHI T A S
|

ఆలూపరాఠా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పంజాబీ వంటకం. రకరకాల పరాఠాలు ఉంటాయి కానీ ఆలూది అందరికీ ఎంతో ఇష్టమైనది. ఆలూ పరాఠాను ఆలూ మసాలాను పిండిముద్దలో కూరి వేయించి చేస్తారు.

ఆలూ పరాఠా ఘాటుగా, కొంచెం ఉప్పగా, నేతితో జారుతూ రుచిగా ఉంటుంది. ఢిల్లీ మరియు పంజాబ్ లో సంప్రదాయంగా సరిగ్గా చేసినప్పుడు పరాఠా నుంచి వెన్న బయటకి కారుతూ ఉంటుంది.ఆధునిక డైట్ లు దీన్ని ఒప్పుకోవు కానీ దాని నిజమైన రుచి సంప్రదాయ పద్దతిలో చేస్తేనే వస్తుంది.

ఆలూ పరాఠా ఇంట్లో చేసుకునే సులభమైన వంటకం. ఆలూ పరాఠాను పొద్దున బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి ఎప్పుడైనా తినవచ్చు. దీన్ని సాధారణంగా పెరుగు లేదా రుచికర పచ్చడితో తింటారు.ఈ మూడింటి సమాహారం మ్యాజిక్ గా ఈ వంటకాన్ని ప్రసిద్ధి చేసింది.

ఆలూపరాఠాను అనేకరకాలుగా చేయవచ్చు. మేము ఇక్కడ సింపుల్ రెసిపిని వీడియో మరియు చిత్రాలతో ఇచ్చాం చదవండి.

ఆలూ పరాఠా రెసిపి । ఆలూ కా పరాఠా । పంజాబీ ఆలూ కా పరాఠా రెసిపి। ఆలూ కూరిన పరాఠా రెసిప। ఇంట్లో తయారుచేసిన పంజాబీ ఆలూ పరాఠా తయారీ
ఆలూ పరాఠా రెసిపి । ఆలూ కా పరాఠా । పంజాబీ ఆలూ కా పరాఠా రెసిపి। ఆలూ కూరిన పరాఠా రెసిప। ఇంట్లో తయారుచేసిన పంజాబీ ఆలూ పరాఠా తయారీ
Prep Time
20 Mins
Cook Time
35M
Total Time
55 Mins

Recipe By: మీనా బంఢారి

Recipe Type: భోజన వంటకం

Serves: 6 పరాఠాలు

Ingredients
  • గోధుమపిండి -2 ½ కప్పులు

    ఉప్పు - ½ చెంచా + 2 చెంచా

    నూనె - 1చెంచా + రాయడానికి

    వాము - ¼ చెంచా

    నీరు - 2కప్పులు

    ఆలూ - 1

    ఉల్లిపాయ ( తరిగినది) - 1కప్పు

    పచ్చిమిర్చి (తరిగినది) - 2చెంచాలు

    ఎర్రకారం - 1 చెంచా

    ఆమ్ చూర్ పొడి -1 చెంచా

    కొత్తిమీర (తరిగినది) - ¼ చెంచా

    జీలకర్ర పొడి - 1చెంచా

How to Prepare
  • 1. కుక్కర్లో నీళ్ళు పోయండి.

    2. బంగాళదుంప అందులో వేసి రెండు విజిల్ కూతల వరకు ఉడికించండి.

    3. కాసేపు చల్లారనివ్వండి.

    4. మూత తీసి ఉడికిన ఆలూ పై చెక్కు తీసేయండి.

    5. దుంపను పెద్ద గిన్నెలోకి తీసుకోండి.

    6. బాగా చిదమండి.

    7. తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేయండి.

    8. ఎర్రకారం , రెండు చెంచాల ఉప్పు వేయండి.

    9. ఇంకా ఆమ్ చూర్ పొడి, తరిగిన కొత్తిమీర వేయండి.

    10. జీలకర్ర పొడి వేయండి.

    11. చేత్తో బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

    12. ఒకటిన్నర కప్పుల గోధుమపిండిని కలిపే గిన్నెలోకి తీసుకోండి.

    13. అరచెంచా ఉప్పు వేయండి.

    14. ఒక చెంచా నూనె వేయండి.

    15. వాము కూడా వేసి బాగా కలపండి.

    16. కొంచెం కొంచెం నీరు పోస్తూ కొంచెం మెత్తగా కలపండి.

    17. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మీ చేతులతో కొంచెం వత్తండి.

    18. కొంచెం వత్తిన పిండిముద్దను గోధుమపిండిలో కాస్త ముంచి అప్పడాలు వత్తేదానిపై ఉంచండి.

    19. దాన్ని అప్పడాల కర్రతో రోటీలా వత్తండి.

    20. ఒక చెంచా ఆలూ ముద్దను రోటీ మధ్య పెట్టండి.

    21.వత్తిన పిండి చివర్లను తీసుకుని ఆలూను మూసివేసేలా మడవండి.

    22. దాన్ని కొంచెం వత్తి గోధుమపిండిని చల్లండి.

    23. జాగ్రత్తగా అప్పడాల కర్రతో వత్తండి.

    24. పెనాన్ని వేడిచేయండి.

    25. జాగ్రత్తగా వత్తిన పిండిని తీసుకొని పెనంలో వేయండి.

    26. ఒక నిమిషం వేగాక, వెనక్కి తిప్పి వేయించండి.

    27. పైన కొంచెం నూనెవేసి మళ్ళీ తిప్పండి.

    28. ఇప్పుడు మరోవైపు కూడా నూనె వేసి రెండు వైపులా బాగా కాలేదాకా వేయించండి.

    29. పెనంపై నుండి తీసి వేడిగా వడ్డించండి.

Instructions
  • 1.ఉల్లిపాయలు నచ్చితేనే వేసుకోవచ్చు. తప్పనిసరి కాదు.
  • 2. రోటీల సైజు ఇక్కడ 5 అంగుళాలు ఉన్నది.
  • 3. ఆలూ లోపల పెట్టాక సరిగ్గా మూసారో లేదో చూసుకోండి.లేకపోతే మసాలా బయటకి వచ్చేస్తుంది.
  • 4. మీకు నచ్చినట్టు సాధారణ తవా కానీ నాన్ స్టిక్ పెనంకానీ వాడుకోవచ్చు.
  • 5.పరాఠాలు నూనెతో కాక వెన్నతో కూడా వేయించుకోవచ్చు.
Nutritional Information
  • సరిపోయేది - 1 పరాఠా
  • క్యాలరీలు - 329 క్యాలరీలు
  • కొవ్వు - 6.16 గ్రాములు
  • ప్రొటీన్ - 9.1 గ్రాములు
  • కార్బొహైడ్రేట్ - 62.28 గ్రాములు
  • చక్కెర - 3.9గ్రా
  • పీచు పదార్థం - 10.1 గ్రాములు

ఎలా తయారుచేయాలి

1. కుక్కర్లో నీళ్ళు పోయండి.

2. బంగాళదుంప అందులో వేసి రెండు విజిల్ కూతల వరకు ఉడికించండి.

3. కాసేపు చల్లారనివ్వండి.

4. మూత తీసి ఉడికిన ఆలూ పై చెక్కు తీసేయండి.

5. దుంపను పెద్ద గిన్నెలోకి తీసుకోండి.

6. బాగా చిదమండి.

7. తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేయండి.

8. ఎర్రకారం , రెండు చెంచాల ఉప్పు వేయండి.

9. ఇంకా ఆమ్ చూర్ పొడి, తరిగిన కొత్తిమీర వేయండి.

10. జీలకర్ర పొడి వేయండి.

11. చేత్తో బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

12. ఒకటిన్నర కప్పుల గోధుమపిండిని కలిపే గిన్నెలోకి తీసుకోండి.

13. అరచెంచా ఉప్పు వేయండి.

14. ఒక చెంచా నూనె వేయండి.

15. వాము కూడా వేసి బాగా కలపండి.

16. కొంచెం కొంచెం నీరు పోస్తూ కొంచెం మెత్తగా కలపండి.

17. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మీ చేతులతో కొంచెం వత్తండి.

18. కొంచెం వత్తిన పిండిముద్దను గోధుమపిండిలో కాస్త ముంచి అప్పడాలు వత్తేదానిపై ఉంచండి.

19. దాన్ని అప్పడాల కర్రతో రోటీలా వత్తండి.

20. ఒక చెంచా ఆలూ ముద్దను రోటీ మధ్య పెట్టండి.

21.వత్తిన పిండి చివర్లను తీసుకుని ఆలూను మూసివేసేలా మడవండి.

22. దాన్ని కొంచెం వత్తి గోధుమపిండిని చల్లండి.

23. జాగ్రత్తగా అప్పడాల కర్రతో వత్తండి.

24. పెనాన్ని వేడిచేయండి.

25. జాగ్రత్తగా వత్తిన పిండిని తీసుకొని పెనంలో వేయండి.

26. ఒక నిమిషం వేగాక, వెనక్కి తిప్పి వేయించండి.

27. పైన కొంచెం నూనెవేసి మళ్ళీ తిప్పండి.

28. ఇప్పుడు మరోవైపు కూడా నూనె వేసి రెండు వైపులా బాగా కాలేదాకా వేయించండి.

29. పెనంపై నుండి తీసి వేడిగా వడ్డించండి.

[ of 5 - Users]
English summary

Aloo Paratha Recipe | Aloo Ka Paratha | Stuffed Aloo Paratha | Homemade Punjabi Aloo Paratha Recipe | Paratha Recipe

Aloo paratha is a traditional North Indian dish. Watch the video on how to make the Punjabi aloo paratha. Here is a step-by-step procedure having images.
Desktop Bottom Promotion