Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్‌లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.!
తెలుగు ప్రజల ఫేవరెట్ ఆకుకూర గోంగూర. గోంగూరతో మన స్టైల్‌లో ఏం చేసినా అద్భుతమే. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు ఇలా వెజ్ ఐటమ్స్‌తో శాకాహార ప్రియుల మనసును దోచుకోవడమే కాదు.. గోంగూర చికెన్, గోంగూర మటన్‌తో నాన్ వెజ్ ప్రియుల జిహ్వను సైతం విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక ఈ రెండు రకాల మనుషుల మనసు దోచేలా.. సంతృప్తిగా కడుపు నిండేలా చేసే ఆంధ్రా స్టైల్ గోంగూర పులావ్ ఎంతో ఫేమస్. ఈ స్పెషల్ డిష్‌ను కుక్కర్‌లో ఇలా ఈజీగా చేసి చూడండి.. దీని ముందు బిర్యానీ కూడా తేలిపోతుంది.

కుక్కర్‌లో గోంగూర పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం- పావు కేజీ(సోనా మసూరి లేదా బాస్మతి రైస్)
గోంగూర- రెండు కట్టలు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ- ఒకటి
మసాలా దినుసులు- టీస్పూన్
జీడిపప్పు పలుకులు- 15
పచ్చిమిర్చి- 5
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
టమాటా- ఒకటి
పసుపు- పావు టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
ధనియాల పొడి- టీస్పూన్
నీళ్లు- ఒకటిన్నర గ్లాసు
పుదీనా- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
కుక్కర్‌లో గోంగూర పులావ్ తయారీ విధానం
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.!
ముందుగా బియ్యాన్ని రెండు సార్లు కడిగి మంచి నీళ్లు పోసి పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి. గోంగూర కాడలు తీసివేసి ఆకులను కడిగి నీరు పోయేలా పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన కుక్కర్ పెట్టుకుని నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయను పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి.
ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా మసాలా దినుసులను వేసుకోవాలి. వేగాక జీడిపప్పు పలుకులు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
తర్వాత కరివేపాకు, టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసి మరోసారి కలపాలి.
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు!
నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ మిశ్రమంలో వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఇప్పుడు ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కొలతతో ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి కలుపుకోవాలి.

కుక్కర్ మూత పెట్టి పెద్ద మంటపైన రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే..
బిర్యానీ టేస్ట్‌ను మరిపించేలా పుల్లగా స్సైసీగా గోంగూర పులావ్ రెడీ.. దీనిని రైతా లేదా గ్రేవీతో తినవచ్చు. లేదా నార్మల్‌గా తిన్నా దాని రుచిని మరింతగా ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
