Latest Updates
-
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..
ఇడ్లీ, దోశ, అన్నం దేనిలోకైనా అదిరిపోయే..అమ్మ చేతి రుచిని గుర్తుచేసే వెల్లుల్లి పప్పుల పొడి
మన తెలుగు వారి వంటింటిలో పచ్చళ్ళు, పొడులకు ఉండే స్థానం ప్రత్యేకం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, కాస్త పొడి వేసుకుని తింటే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. అలాంటి పొడులలో రారాజు వంటిది వెల్లుల్లి పప్పుల పొడి. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక వరం.
ఇడ్లీ, దోశ, ఉప్మా, అన్నం..దేనితోనైనా వెల్లుల్లి పప్పుల పొడి ఇట్టే కలిసిపోతుంది. ఈ పొడిని తయారు చేయడం చాలా సులభం. వెల్లుల్లి పప్పుల పొడిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు
శనగపప్పు - అర కప్పు
మినపప్పు - అర కప్పు
ఎండుమిర్చి - 15-20
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
చింతపండు - చిన్న నిమ్మకాయంత
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి బాండీని స్టవ్ లేదా పొయ్యి మీద పెట్టి వేడి చేశాక అందులో శనగపప్పు వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి. పప్పు చక్కటి బంగారు వర్ణంలోకి మారి, మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అదే విధంగా మినపప్పును కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పప్పులు మాడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
-ఇప్పుడు అదే బాండీలో ధనియాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించి, పప్పులు ఉన్న ప్లేట్ లోనే వేసుకోవాలి.
-తర్వాత బాండీలో ఎండుమిర్చి వేసి అవి కొద్దిగా ఉబ్బి, రంగు మారే వరకు వేయించుకోవాలి. వాటిని కూడా ప్లేట్ లోకి మార్చాలి. చివరగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును వేసి అందులోని తేమ పోయి, కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు బాండీలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలను వేయాలి. పొట్టుతో పాటే వేయిస్తే పొడికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు పైన కొద్దిగా రంగు మారి, మంచి వాసన వచ్చే వరకు 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది.
-వేయించిన పదార్థాలన్నింటినీ ఒక పెద్ద ప్లేట్ లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా ఎండుమిర్చి, పప్పులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని ఒకేసారి కాకుండా ఆపుతూ (పల్స్ మోడ్ లో) గ్రైండ్ చేస్తే పొడి వేడెక్కకుండా ఉంటుంది.
-తయారైన ఘుమఘుమలాడే వెల్లుల్లి పప్పుల పొడిని ఒక పొడి గాజు సీసాలో నింపి గాలి తగలకుండా మూత పెట్టుకుంటే నెల రోజుల వరకు తాజాగా, సువాసనగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
