Latest Updates
-
రేవతీ నక్షత్రంలోకి శని సంచారం..ఈ 5 రాశులకు మహర్దశ.. మీ రాశి ఫలం ఇప్పుడే చెక్ చేసుకోండి.. -
Gas saving tips: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.! -
గుంటూరు స్టైల్ కాకరకాయ కారం ఇలా చేస్తే.. కూర మొత్తం ఒక్కరే తినేస్తారు, గ్యారెంటీ! -
ప్రపంచ దోమల నివారణ దినోత్సవం: దోమకాటు తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు.! -
Honey Rose: హనీరోజ్ పై నెటిజన్ల ప్రశంసలు..ఎందుకో చూడండి.. -
IAS Tukaram Mundhe: తుకారం ముండే..వ్యవస్థను వణికిస్తున్న రియల్ హీరో..నెటిజన్ల ప్రశంసల వర్షం -
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.! -
ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు! -
రక్తహీనతతో బాధపడేవారికి ఈ జ్యూస్ ఒక వరం.. డైలీ ఒక్క గ్లాస్ తాగితే చాలు.!
ఇడ్లీ,దోసెల్లోకి దీన్ని మించిన చట్నీ ఉండదేమో!..అన్నంలోకి కూడా సూపరే..
దక్షిణ భారతదేశంలో అద్భుతమైన వంటకాలకు కేరాఫ్ అడ్రస్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే తమిళనాడులోని చారిత్రక నగరం మధురై. మధురై మీనాక్షి అమ్మవారి గుడి ఎంత ప్రసిద్ధమో, అక్కడి వీధుల్లో దొరికే ఘుమఘుమలాడే వంటకాలు కూడా అంతే ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలతో వడ్డించే రకరకాల సైడ్ డిష్ లు చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది ఈ కమ్మని, కారంగా ఉండే మధురై స్పెషల్ టమాటా చట్నీ. కారం, పులుపు, కొద్దిగా తీపి కలగలిపిన ఈ చట్నీ ఇడ్లీ, దోశలకు పర్ఫెక్ట్ మ్యాచ్.

మధురై స్పెషల్ టమాటా చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
సాంబార్ ఉల్లిపాయలు- 20
ఎండు మిరపకాయలు - 5
టమాటాలు - 2
కరివేపాకు - 2 రెబ్బలు
ఆవాలు - అర టీస్పూన్
మినప పప్పు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నువ్వుల నూనె - 3 టేబుల్ స్పూన్లు
చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
పంచదార - అర టీస్పూన్
నీళ్లు - పావు కప్పు
మధురై స్పెషల్ టమాటా చట్నీ తయారీ విధానం
ముందుగా చిన్న ఉల్లిపాయల పొట్టు తీసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి మీడియం మంటపై వేడి చేయండి. ఈ చట్నీకి నువ్వుల నూనె వాడటం వల్లే అసలైన సాంప్రదాయ రుచి వస్తుంది)
నూనె వేడెక్కాక అందులో ఎండు మిరపకాయలు, సగం (10) చిన్న ఉల్లిపాయలు, ఒక టమాటా ముక్కలు వేసి పచ్చివాసన పోయేంతవరకు సుమారు 5 నిమిషాల పాటు దోరగా వేయించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని, అందులోనే చింతపండు గుజ్జు, పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు తాలింపు కోసం.. అదే బాండీలో మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె పోసి వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు, మినప పప్పు, కరివేపాకు వేసి పప్పు దోరగా, బంగారు రంగులోకి మారేంత వరకు వేయించండి.
ఇప్పుడు అందులో మిగిలిన పది చిన్న ఉల్లిపాయలు వేసి, అవి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేయండి.
ఆ తర్వాత మిగిలి ఉన్న మరో టమాటా ముక్కలు కూడా వేసి, మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గనివ్వండి.
టమాటాలు బాగా గుజ్జుగా ఉడికిన తర్వాత, ముందుగా మిక్సీ పట్టుకున్న మిరపకాయ టమాటా ఉల్లిపాయ పేస్ట్ ను బాండీలో వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి అంతా కలిసేలా బాగా కలపండి.
మంటను సిమ్ లో ఉంచి నూనె పైకి తేలే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆపేయండి.
అంతే ఘుమఘుమలాడే, ఎంతో రుచికరమైన మధురై స్పెషల్ టమాటా చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications