Latest Updates
-
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా!
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు!
నెల్లూరు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నెల్లూరు చేపల పులుసు. కానీ శాఖాహార వంటకాలలో కూడా నెల్లూరు వారి శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన, వంటకం నెల్లూరు పప్పు పులుసు. పప్పు పులుసు అనేది సాంబార్ కి దగ్గరగా ఉన్నట్లు అనిపించినా, దీని తయారీ విధానం, రుచి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ పప్పు పులుసు కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు. నటి మంచులక్ష్మీ కూడా ఒక ఇంటర్వ్యూలో తనకు పప్పులుసు అంటే చాలా ఇష్టమని చెప్పారు. అసలు సిసలైన నెల్లూరు ప్టైల్ పప్పులుసు మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

నెల్లూరు పప్పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
-కందిపప్పు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-టమాటో
-ఆవాలు
-జీలకర్ర
-శనగపప్పు
-మినపప్పు
-ఉప్పు
-పసుపు
-చింతపండు
-వెల్లుల్లి
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా..
నెల్లూరు పప్పులుసు తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో 1 కప్పు కందిపప్పు వేసుకోండి. అందులో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగండి. తర్వాత అందులో 2 కప్పుల నీళ్లు పోసుకోండి. అందులోనే 3 మీడియం టమాటోలను సగం ముక్కలుగా చేసుకుని వేయాలి, 10-12 పచ్చిమిపకాయలను తుంచుకొని వేసుకోండి, అర టీస్పూన్ పసుపు వేసి కుక్కర్ మూతపెట్టేయండి. ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద 4 విజిల్స్ రానివ్వండి.
-పప్పు ఉడికేలోగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో నిమ్మకాయంత సైజులో చింతపండు వేసి అది మునిగేంతవరకు నీళ్లు పోసి నాననివ్వాలి.
-పప్పు 4 విజిల్స్ వచ్చి బాగా ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పుగుత్తితో ఉడికిన పప్పు మిశ్రమాన్ని బాగా మెదుపుకోవాలి.
-తర్వాత మెదుపుకున్న పప్పు మిశ్రమంలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం బాగా పిసికి పోసేయండి. తర్వాత అందులోనే తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోండి. రెడీ అయిన పప్పులసుని పక్కన పెట్టుకోండి.
-తర్వాత తాలింపు కోసం.. స్టవ్ మీద వెడల్పాటి పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు(ఆవాలు,జీలకర్ర, శనగపప్పు, మినపప్పు) వేసుకోండి. ఆవాలు చిటపటలాడేవరకు వేగనివ్వాలి. తర్వాత అందులో 4 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి, తర్వాత 5 తెల్లగడ్డలను దంచుకొని వేసుకోండి.
-తెల్లగడ్డలు లైట్ గా కలర్ మారాక అందులో 1 ఉల్లిపాయ చీలికలు వేసి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత అందులో కరివేపాకు వేసి వేగించాక అందులో రెడీ చేసుకున్న పప్పులుసు వేసి 4 నిమిషాలు బాగా మరిగించి ప్టవ్ ఆపేయండి.
-అంతే నెల్లూరు పప్పులుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
