Latest Updates
-
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.!
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
రోటీ పచ్చళ్లు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. ఫైవ్ స్టార్ హోటల్ ఫుడ్ తిన్నా కూడా ఒక్క ముద్ద రోటి పచ్చడి లేకుంటే ఏదో వెలితిగా ఉన్నట్లే అనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకి రోట్లో చేసిన పచ్చళ్లు తింటుంటే అమృతం తిన్నట్లు ఫీల్ అవుతారు. సినిమా సెలబ్రిటీలు కూడా లంచ్ లోకి రోటి పచ్చడి తప్పనిసరి ఉండాల్సిందేనని చాలా వీడియోలలో చెప్పడం మనం చూస్తున్నాం.
పూర్వకాలంలో మిక్సీలు అందుబాటు లేని రోజుల్లో రోట్లో చేసిన పచ్చళ్లు తినేవాళ్లు మన పూర్వీకులు. రోట్లో చేసిన పచ్చడి, మిక్సీలో చేసిన పచ్చడికి టేస్ట్ మారిపోతుంది. రోట్లో చేసిన పచ్చడినే కమ్మగా ఉంటుంది. ఇవి చాలా ఈజీగా తయారవ్వడమే కాకుండా టేస్ట్ లో ది బెస్ట్ గా ఉంటాయి. అలాంటి రోటి పచ్చళ్లలో ఉల్లికారం టాప్ ప్లేస్ లో ఉంటది. ఒక్కసారి ఉల్లికారం ట్రై చేశారంటే..రోజూ అదే కావాలనడం గ్యారెంటీ. ఉల్లికారం రోటి పచ్చడిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-ఉల్లిపాయ
-ఎండుమిర్చి
-ధనియాలు
-ఉప్పు
-వెల్లుల్లి రెబ్బలు
-కొత్తిమీర
-నూనె
-ఆవాలు
-పసుపు
-కారం
-పెరుగు
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
తయారీ విధానం
-ముందుగా 4 ఎండుమిరపకాయలను కొద్దిసేపు నీటిలో నానబెట్టుకోవాలి.
-తర్వాత రోట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మెత్తగా నూరుకోవాలి. తర్వాత ఇందులోనే నానబెట్టుకున్న 4 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచుకోవాలి.
-ఇప్పుడు అందులోనే 1 పెద్ద ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా చేసి వేయండి. కొత్తిమీర, కొద్దిగా పెరుగు, సరిపడా కారం, కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తాన్ని మెత్తగా చిదిమినట్లుగా నూరుకోండి.
-ఇప్పుడు చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. అందులో తాలింపుకి సరిపడా నూనె వేసి వేడయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత రోట్లో ఉన్న చట్నీ మొత్తాన్ని స్టవ్ మీద ఉన్న బాండీలో వేసి 2 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేయించి స్టవ్ ఆపేయండి.
-అంతే సూపర్ టేస్టీ ఉల్లిపాయ కారం రెడీ. వేడి అన్నంలో దీన్ని కలుపుకుని తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
