Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. మన పూర్వీకుల స్పెషల్ బీరకాయ మజ్జిగ పులుసు..రుచి చూస్తే వదిలిపెట్టరు!
మన పూర్వీకుల వంటలన్నీ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేవి. అలాంటి కోవలోకి వచ్చే ఒక అద్భుతమైన, సంప్రదాయక వంటకమే బీరకాయ మజ్జిగ పులుసు. పూర్వం మన ఇళ్లల్లో ఈ వంటకం తరచూ కనిపించేది. అందరూ ఎంతో ఇష్టంగా, కమ్మగా అన్నంలో కలుపుకుని తినేవాళ్ళు.
మారుతున్న కాలంతో పాటు ఫాస్ట్ ఫుడ్స్ మోజులో పడి ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైన, కమ్మని వంటకాలను మనం మర్చిపోతున్నాం. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే ఈ బీరకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

బీరకాయ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత బీరకాయలు - 2 లేదా 3
పెరుగు- 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - కొద్దిగా
పసుపు - అర టీస్పూన్
అల్లం పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - తగినంత
నూనె - పోపుకి సరిపడా
బీరకాయ మజ్జిగ పులుసు తయారీ విధానం
-ముందుగా లేత బీరకాయలను తీసుకుని, వాటి పైనున్న చెక్కును సన్నగా తీసేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా నీటితో కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక పాత్రలో లేదా పెద్ద గ్లాసులో తాజా పెరుగును తీసుకోవాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి, ఉండలు లేకుండా మజ్జిగలాగా బాగా చిలకాలి. మరీ నీళ్లలా కాకుండా చూసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేయాలి. అవి ఉడకడానికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి, అందులోనే అర టీస్పూన్ పసుపు, ముక్కలకు సరిపడా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి బీరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
-బీరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మజ్జిగను అందులో పోయాలి. మంటను మీడియంలో ఉంచి, మజ్జిగ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇది ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ మీద నుండి దించుకోవాలి.
-వేరొక చిన్న కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించాలి. అవి చిటపటలాడుతుండగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, అల్లం పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ కమ్మని పోపును మజ్జిగ పులుసులో వేసి బాగా కలపాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను ఈ పులుసుపై చల్లుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతే బీరకాయ మజ్జిగ పులుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
