Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
ఇది తినని మనిషి జన్మ ఎందుకు..మన పూర్వీకుల ఎనర్జీకి కారణం ఇదే..ఎలా చేసుకోవాలంటే
మీరెప్పుడైనా రాగిపిండి,సగ్గుబియ్యం కిచిడి తిన్నారా? సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కిచిడి ఒక పోషకమైన,తేలికగా జీర్ణమయ్యే ఆహారం. రాగిలో ఐరన్, కాల్షియం,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి..సగ్గుబియ్యం తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ రెండింటి కలయికతో తయారైన కిచిడి రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగిపిండి సగ్గుబియ్యం కిచిడిని మీ ఇంట్లొనే సింపుల్ గా తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగిపిండి సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావలసిన పదార్థాలు
-పెసరపప్పు
-సగ్గుబియ్యం
-రాగిపిండి
-మిరియాలు
-జీడిపప్పు
-పచ్చిమిర్చి
-నెయ్యి
-అల్లం
-పసుపు
-క్యారెట్
-ఉల్లిపాయ
-టమాటో
-వెల్లుల్లి
-జీలకర్ర
-కరివేపాకు

రాగిపిండి సగ్గుబియ్యం కిచిడి తయారీ విధానం
-ముందుగా ఓ ప్రెజర్ కుక్కర్ లో శుభ్రంగా కడిగిన అరకప్పు పెసరప్పు, అరకప్పు సగ్గు బియ్యం, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 టమాటో పెద్ద ముక్కలు, 1 ఉల్లిపాయ పెద్ద ముక్కలు, 1 క్యారెట్ ముక్కలు,కొన్ని అల్లం ముక్కలు, పొట్టు తీసిన 2 వెల్లుల్లి రెబ్బలు, 10-15 మిరియాలు, చిటికెడు పసుపు వేయాలి. ఇందులో ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసి కలిపి మూతపెట్టి స్టవ్ మీద పెట్టాలి.
-రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఉడికిన పప్పుని గుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి.
-తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి అది ఉడకనివ్వాలి. ఉడికే సమయంలోనే అందులో అరకప్పు రాగిపిండి ఉండల్లేకుండా బాగా కలపుతూ మంటను సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి.
బెల్లంతో కమ్మటి అటుకుల పాయసం..దీన్ని మించిది ఉండదేమో..ఎలా చేసుకోవాలంటే
-10 నిమిషాలు రాగిపిండిని అందులో బాగా ఉడికించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి దగ్గరపడేదాకా ఉడికించుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 2-3 స్పూన్ల నెయ్యి వేడి చేశాక జీడిపప్పు,మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి.
-జీడిపప్పు వేగిన తర్వాత కరివేపాకు,జీలకర్ర వేసి వేయించుకొని తర్వాత ఈ తాళింపు మొత్తాన్ని ముందుగా ఉడికించిన కిచిడిలో వేసి కలుపుకోవాలి. ఇందులో అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. అంతే రాగి పిండి సగ్గుబియ్యం కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
