Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
ఇడ్లీలోకి చట్నీలు కాకుండా..ఈ స్పెషల్ కుర్మాతో తింటే టేస్ట్ కేక..ఎలా చేసుకోవాలంటే
మన దక్షిణ భారతదేశంలో ఇళ్లల్లో పొద్దున్నే ఎక్కువగా లేదా తరచుగా చేసే బ్రేక్ ఫాస్ట్ ఇడ్లీ. ఇడ్లీ తినని తెలుగువారండరు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇడ్లీల్లోకి సాధారణంగా కారం పొడి లేదా చట్నీలు నంజుకొని తింటారు. అయితే రోజూ అవే చట్నీలు,కారం పొడులు తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే కుర్మా ట్రై చేయాల్సిందే. ఇడ్లీలను కుర్మాతో కలిపి తింటే ఆ మజా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. మాటల్లో వర్ణించలేని టేస్ట్ దీని సొంతం. ఇడ్లీ కుర్మాని సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనిని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఇడ్లీ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
-అల్లం
-గసగసాలు
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-సోంపు
-ఉల్లిపాయ
-యాలకలు
-టమాటో
-ఆయిల్
-గరం మసాలా
-పచ్చి కొబ్బరి
-జీడిపప్పు
-పసుపు
-కారం
-కరివేపాకు
-కొత్తిమీర
ఇడ్లీ కుర్మా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చెయ్యాలి.
-వేడెక్కిన ఆయిల్ లో రెండు ఇంచుల అల్లం, 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, అర టీస్పూన్ సోంపు,సన్నగా తరగిన 3 ఉల్లిపాయలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
-ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 8 జీడిపప్పు, 1 టీస్పూన్ గసగసాలు వేసి మరో నిమిషం పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో వేసి ఇందులో పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 3 యాలకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క,3 లవంగాలు కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన పాన్ లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేసి ఇందులో పావు టీస్పూన్ సోంపు, 3 టమాటోల చిన్న చిన్న ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు,పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ గరం మసాలా వేసి టమాటోలు మెత్తగా ఉడికేదాకా కలుపుతూ వేయించాలి.
-ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి 3-4 నిమిషాల పాటు ఆయిల్ మెత్తం సైడ్స్ కి వచ్చేదాకా బాగా కలుపుతూ వేయించుకోవాలి.
-ఆయిల్ సైడ్స్ కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు పోసి కలుపుకోని మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
-చివరిలో 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి కలుపుకొని మరో నిమిషం పాటు మీడియం మంట మీద ఉడకనిచ్చి దించేయాలి. అంతే ఇడ్లీ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






