Latest Updates
-
నోటికి రుచి,పొట్టకు హాయి..మిగిలిపోయిన అన్నంతో 10 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా రైస్! -
వారపు రాశి ఫలాలు [29 మార్చి నుండి 04 ఏప్రిల్]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! -
ఈరోజు రాశి ఫలాలు (29.03.26): ఆదివారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! -
సమ్మర్ స్పెషల్..ఎలాంటి కృత్రిమ రంగులు లేని స్వచ్ఛమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ..టేస్ట్ కేక! -
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే! -
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో..చిన్న అల్లం ముక్క నమిలితే ఏమవుతుందో తెలుసా?
మనలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే వేడి వేడిగా ఒక కప్పు అల్లం టీ గొంతులో పడాల్సిందే. టీకి ఆ ఘాటైన రుచి, సువాసన రావాలంటే అందులో కాస్త అల్లం దంచి వేయాల్సిందే అని అందరూ భావిస్తుంటారు. అయితే అల్లం కేవలం టీ రుచిని పెంచే ఒక మసాలా దినుసు మాత్రమే అని మీరు అనుకుంటే పొరపాటే.
అల్లం ఒక సహజ సిద్ధమైన ఔషధ గని. పోషకాలతో నిండిన అల్లం మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజువారీ ఆహారంలో భాగమైన అల్లాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిన్న ముక్కను నమలడం వల్ల మన శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ చూడండి.
బరువు తగ్గింపు - జీర్ణ వ్యవస్థ మెరుగుదల
బరువు తగ్గాలనుకునే వారికి అల్లం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. అల్లంలో ఉండే అద్భుతమైన మూలకాలు శరీరంలోని మెటబాలిజం (జీవక్రియ) రేటును అమాంతం పెంచుతాయి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు వేగంగా కరిగిపోవడం ప్రారంభమవుతుంది. తద్వారా మీ బరువు తగ్గే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది.
అంతేకాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నమలడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఉదయం ఔషధ గుణాలున్న చిన్న అల్లం ముక్కను తినడం అలవాటు చేసుకుంటే..ఆ సమస్య నుంచి సులభంగా శాశ్వత విముక్తి పొందవచ్చు.
బాడీ డిటాక్స్ - రోగనిరోధక శక్తిని రెట్టింపు
మన శరీరంలో ప్రతిరోజూ పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో అల్లం
అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయాన్నే అల్లం తీసుకోవడం వల్ల రక్తంలోని
మలినాలు తొలగిపోయి శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది.
అలాగే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి. దీంతో అనేక రకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులపై పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది.
గుండె భద్రం - షుగర్ కంట్రోల్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని
మెరుగుపరచడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాల్లో కొవ్వు
పేరుకుపోకుండా కాపాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను
నియంత్రించడంలోనూ అల్లం సానుకూల ప్రభావం చూపుతుంది.
మధుమేహం ఉన్నవారు అల్లాన్ని మితంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇవ్వడంలో కూడా అల్లం బాగా పనిచేస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదైనప్పటికీ, దీనిని మోతాదుకు మించి
తీసుకోకూడదు. అల్లాన్ని అతిగా వాడటం వల్ల సానుకూల ఫలితాలకు బదులు
కడుపులో మంట, ఉబ్బరం, విరేచనాలు వంటి ప్రతికూల సమస్యలు తలెత్తే
ప్రమాదం ఉంది.
ముఖ్యంగా లో బీపీ (తక్కువ రక్తపోటు) తో బాధపడే రోగులు అల్లానికి దూరంగా ఉండటమే మంచిది. అలాగే, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు (లో షుగర్) కూడా అల్లం తీసుకోకూడదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











