Latest Updates
-
అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. శ్రీరామ నవమి స్పెషల్ పానకం, వడపప్పు ఎలా చేసుకోవాలంటే.. -
నేటి తరం దంపతులకు సీతారాములు నేర్పే 5 అద్భుతమైన జీవిత సత్యాలు! -
గుటకలేయించే రుచితో..ఎండాకాలంలో అమృతంలాంటి మామిడికాయ పచ్చిపులుసు -
మాధవీలత దుర్గా స్తుతి..ముస్లింల తీవ్ర ఆగ్రహం..భగవద్గీత శ్లోకంతో ట్రోలర్స్ కి మాధవీలత చెక్! -
Rama Navami 2026: శ్రీరాముడి గురించి చాలామందికి తెలియని రహస్యాలు ఇవే! -
డీప్ ఫ్రై లేదు,రుచిలో తగ్గేదే లేదు..చుక్క నూనె లేకుండానే కరకరలాడే పొటాటో కట్లెట్స్ -
ఈరోజు రాశి ఫలాలు (25.03.26): బుధవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
టేస్ట్ కు టేస్ట్, హెల్త్ కు హెల్త్.. అప్పటికప్పుడు వేసుకునే కరకరలాడే మొక్కజొన్న దోశ -
బంగారం రేట్లు మరింత తగ్గుతాయా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి అంచనా! -
ఈరోజు రాశి ఫలాలు (24.03.26): మంగళవారం నాడు ఈ రాశుల వారికి ధనయోగం!
శ్రీరామనవమి శుభాకాంక్షలు 2026: మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ స్టేటస్!
శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండుగ. చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిథి నాడు అయోధ్యలో దశరథ మహారాజు, కౌసల్యా దేవిలకు శ్రీరాముడు జన్మించాడు. ఆ పుణ్యదినమే శ్రీరామనవమి.
2026 సంవత్సరంలో నవమి తిథి మార్చి 26, ఉదయం 11:48 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 27, ఉదయం 10:06 గంటలకు నవమి తిథి ముగిస్తుంది. శ్రీరామనవమి కొన్ని ప్రాంతాల్లో మార్చి 26న, మరికొన్ని ప్రాంతాల్లో మార్చి 27 (శుక్రవారం) నాడు జరుపుకోనున్నారు.

శ్రీరాముడిని మర్యాదా పురుషోత్తముడు అని పిలుస్తారు. కష్టాలెన్ని వచ్చినా ధర్మాన్ని, సత్యాన్ని, ఇచ్చిన మాటను తప్పని ఆదర్శ మూర్తి రామచంద్రుడు. ఆయన జీవితం మానవాళికి ఒక గొప్ప సందేశం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా భద్రాచలం, ఒంటిమిట్ట లాంటి పుణ్యక్షేత్రాలలో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
శ్రీరామనవమి సందర్భంగా మీ బంధుమిత్రులకు,శ్రేయోభిలాషులకు విషెస్ ఎలా అందంగా చెప్పాలో ఇక్కడ చూడండి.
శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలా చెప్పండి
-పానకం లాంటి తీయని జీవితం, వడపప్పు లాంటి చల్లని ఆరోగ్యం మీకు అందాలని కోరుకుంటూ..శ్రీరామనవమి శుభాకాంక్షలు.
-సీతారాముల దివ్య ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ శ్రీరామనవమి 2026.
-మీ ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆ కోదండరాముడిని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ శ్రీరామనవమి.
-రఘుకుల తిలకుడు, అయోధ్య రాముడు మీ కష్టాలన్నింటినీ తొలగించి సకల శుభాలు ప్రసాదించుగాక.
-కష్టంలో ధైర్యాన్ని, సుఖంలో నిరాడంబరతను ఆ శ్రీరాముడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ..నవమి శుభాకాంక్షలు.
-శ్రీరాముని ధర్మం, సీతమ్మ సహనం మీ జీవితానికి మార్గదర్శకం కావాలి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
-మీకు, మీ కుటుంబ సభ్యులకు పవిత్రమైన శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. జై శ్రీరామ్.
-ఆదర్శ పుత్రుడు, ఆదర్శ పాలకుడు అయిన ఆ రామచంద్రుని కృపాకటాక్షాలు మీపై వానజల్లులా కురవాలి.
-ధర్మానికి మారుపేరు శ్రీరాముడు.. ఆ రామయ్య కరుణతో మీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలి. శ్రీరామనవమి శుభాకాంక్షలు.
-ఏ పని మొదలుపెట్టినా ఆ సీతారాముల ఆశీస్సులు మీకు విజయాలను అందించాలి. శుభ శ్రీరామనవమి.
-మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, ఆ హనుమంతుని స్వామి భక్తి, రాముని శక్తి మీకు రక్షగా నిలవాలి.
-శ్రీరామ నామం మధురం..ఆ నామ స్మరణతో మీ జీవితం ఆనందమయం కావాలి.
-చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా..మీలో ఉన్న నెగిటివిటీ తొలగిపోయి పాజిటివిటీ రావాలని కోరుకుంటున్నాను.
-పచ్చని తోరణాలు, భక్తి గీతాలు, సీతారాముల కళ్యాణ శోభతో మీ ఇల్లు కళకళలాడాలి.
-అందరి హృదయాల్లో కొలువైన అయోధ్య రాముడికి వందనం.. మీకు నా హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామనవమి వాట్సాప్ స్టేటస్
ధర్మో రక్షతి రక్షితః..ఆ శ్రీరాముని దయ అందరిపై ఉండుగాక. జై శ్రీరామ్
రాముడంటే సత్యం, రాముడంటే ధర్మం. శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మా ఇలవేల్పు, మా ఆరాధ్య దైవం ఆ సీతారామచంద్రులకు ప్రణామాలు.
సీతమ్మకు పతి దేవుడు, హనుమకు ఆరాధ్య దేవుడు ఆ రామయ్య తండ్రి కరుణ మనందరిపై ఉండాలి.
కోదండపాణి అడుగుజాడల్లో నడుద్దాం..సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడదాం. జై శ్రీరామ్.
అయోధ్య రామ, భద్రాద్రి రామ... అందరినీ చల్లగా చూడవయ్య స్వామి.
జగదభిరాముడు.. ఆ జానకి రాముని పుట్టినరోజు పండుగ మనకందరికీ పర్వదినం.
శ్రీరామ నామం స్మరిస్తే చాలు..మనసులోని భయాలన్నీ మాయం. హ్యాపీ శ్రీరామనవమి.
బంధాలకు అర్థం, బ్రతుకుకు పరమార్థం నేర్పిన మార్గదర్శి శ్రీరాముడు.
అందరికీ చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు. పానకం త్రాగండి, చల్లగా ఉండండి.
ఏడడుగుల బంధానికి నిదర్శనం సీతారాముల కళ్యాణం. ఈ పర్వదినం అందరికీ శుభకరం.
మర్యాద పురుషోత్తముడికి మనసారా నమస్కరిస్తూ... అందరికీ పండుగ శుభాకాంక్షలు.
రామ నామం పాహిమాం... రామ నామం శరణం. జై జై శ్రీరామ్.
నా రాముడు ధర్మస్వరూపుడు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు సదా దక్కుతాయి.
కష్టాలు కన్నీళ్లు ఎదురైనా చెరగని చిరునవ్వు శ్రీరాముని సొంతం..అదే మనందరికీ ఆదర్శం.

శ్రీరాముని ఆదర్శాలు - కోట్స్
-ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతటి ప్రలోభాలు ఎదురైనా సత్యాన్ని, ధర్మాన్ని వీడని వాడే నిజమైన ఆదర్శమూర్తి... దానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు.
-శ్రీరాముడు రాజ్యాన్ని వదిలాడు కానీ, తండ్రికిచ్చిన మాటను వదలలేదు. అదే బంధాలకు ఆయన ఇచ్చిన విలువ.
-ఓర్పులో భూదేవి అంతటి సీతమ్మ, ధర్మంలో మేరు పర్వతమంత రామయ్య.. ఈ జంట ప్రపంచానికే ఆదర్శం.
-రామబాణం ఎంత గురి తప్పదో, శ్రీరాముని మాట కూడా అంతే తప్పు కాదు. మాట నిలబెట్టుకోవడమే గొప్ప వ్యక్తిత్వం.
-శత్రువు కష్టంలో ఉన్నప్పుడు కూడా దయ చూపించిన కరుణామయుడు మన శ్రీరామచంద్రుడు.
-రాజ్యం లేకపోయినా అడవుల్లో ఆనందంగా బ్రతికి, జీవితంలో సంతోషం వస్తువుల్లో కాదు మనసులో ఉంటుందని నిరూపించిన మహారాజు రాముడు.
-సోదర ప్రేమకు నిలువెత్తు రూపం రామ-లక్ష్మణుల బంధం. ప్రతి ఇంటా ఇలాంటి ప్రేమానురాగాలు వెల్లివిరియాలి.
-కష్టపడి సాధించిన విజయమే చిరకాలం నిలుస్తుందని రామ-రావణ యుద్ధం మనకు తెలియజేస్తుంది.
-శ్రీరామ అని మూడు సార్లు పలికితే, విష్ణు సహస్రనామాలు పఠించినంత పుణ్యం దక్కుతుంది. ఆ నామంలోనే అనంతమైన శక్తి ఉంది.
స్నేహితులు,కుటుంబానికి ప్రత్యేక సందేశాలు
-నా ప్రియమైన మిత్రులందరికీ, వారి కుటుంబ సభ్యులకు పవిత్ర శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ ఇంట సిరులు కురిపించాలి.
-దూరాన ఉన్నా మన బంధం శ్రీరామరక్ష..నా ఆప్తులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు.
-జీవితం రామాయణం అంత స్వచ్ఛంగా, మీ నవ్వు సీతమ్మ మందహాసంలా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ శ్రీరామనవమి.
-మీరు అనుకున్న లక్ష్యాలను రామబాణం లాంటి ఏకాగ్రతతో ఛేదించాలని ఆశిస్తూ... పండుగ శుభాకాంక్షలు.
-మన బంధం సీతారాముల అంత అన్యోన్యంగా, రామ-లక్ష్మణుల అంత ఆప్యాయంగా ఉండాలని మనసారా కోరుకుంటూ..హ్యాపీ శ్రీరామనవమి 2026.



Click it and Unblock the Notifications











