Latest Updates
-
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది!
నేటి తరం దంపతులకు సీతారాములు నేర్పే 5 అద్భుతమైన జీవిత సత్యాలు!
పెళ్ళిళ్లలో పెద్దలు సీతారాముల్లా కలకాలం చల్లగా ఉండండి అని నూతన దంపతులను దీవించడం మనకు పరిపాటి. ఎన్నో యుగాలు గడిచినా వైవాహిక జీవితానికి వారి దాంపత్యం ఇప్పటికీ ఎందుకు ఆదర్శంగా నిలుస్తోంది? ఎందుకంటే, వారి జీవితం పూలపాన్పు కాదు.. ఎన్నో పోరాటాలు, మరెన్నో సవాళ్లతో నిండిన ముళ్లబాట.
కష్టాలు ఎదురైనప్పుడు భార్యాభర్తలు ఎలా మెలగాలో శ్రీరాముడు, సీతామాత తమ ఆచరణ ద్వారా చూపించారు. కేవలం దీవెనల వల్ల ఎవరూ సీతారాములు కాలేరు. వారి జీవితం నుంచి నేటి తరం దంపతులు నేర్చుకోవాల్సిన అద్భుతమైన జీవిత సత్యాలు ఏంటో ఇక్కడ చూడండి.

కష్టసుఖాల్లో తోడునీడగా
పెళ్లి అనగానే సుఖాలనే కాదు, కష్టాలను కూడా సమానంగా పంచుకోవాలి. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, సీతమ్మ ఏమాత్రం సంకోచించకుండా మీ అడుగుల్లోనే నా అడుగులు అంటూ అడవులకు పయనమైంది.
అలాగే అరణ్యంలో తన భార్యను రావణుడు అపహరించినప్పుడు రాముడు ఏ సామ్రాజ్యానికీ రాజు కాదు. ఒక సామాన్య అరణ్యవాసిగా అపారమైన రాక్షస సైన్యంతో పోరాడి మరీ తన భార్యను దక్కించుకున్నాడు. భార్యాభర్తలు ప్రతికూల పరిస్థితుల్లో ఒకరికొకరు ఎలా అండగా నిలవాలో దీనికంటే గొప్ప ఉదాహరణ లేదు.
సిరిసంపదల కంటే బంధానికే ప్రాధాన్యం
నేటి కాలంలో డబ్బు, ఆస్తులకు ఇస్తున్న ప్రాముఖ్యత బంధాలకు ఇవ్వడం లేదు. కానీ మహారాకుమారి అయిన సీతమ్మ రాముడి గుణాన్ని చూసి వరించింది తప్ప ఆయన హోదాను కాదు. రాముడు రాజ్యాన్ని వదిలినప్పుడు, ఆమె కూడా క్షణంలో రాజభవన భోగాలను త్యజించింది.
రాముడు కూడా అంతే... సీతమ్మ తనకు దూరంగా అడవిలో ఉన్నప్పుడు, తాను మహారాజుగా అయోధ్యలో ఉన్నప్పటికీ రాజమహల్ సుఖాలను వదిలి, నేల మీద నిద్రిస్తూ సన్యాసిలా జీవితాన్ని గడిపాడు. బంధంలో వస్తువుల కంటే వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఇది నేర్పుతుంది.
అచంచలమైన నమ్మకం - ఏకపత్నీవ్రతం
సీతారాముల బంధానికి గట్టి పునాది నమ్మకం. అరణ్యవాసంలో శూర్పణఖ తన మాయాజాలంతో రాముడిని ప్రలోభపెట్టాలని చూసినా సీతే నా ప్రాణం అని రాముడు తిరస్కరించాడు. జీవితంలో ఒక్కరినే వివాహం చేసుకుంటానని ఏకపత్నీవ్రతుడిగా నిలిచాడు.
అశ్వమేధ యాగం సమయంలో పక్కన భార్య ఉండాలన్న నియమం వచ్చినప్పుడు, సీతమ్మ బంగారు విగ్రహాన్ని చేసి పక్కన పెట్టుకున్నాడే తప్ప మరో పెళ్లి ఆలోచన చేయలేదు. సీతమ్మ కూడా రావణుడి చెరలో ఉన్నప్పుడు తన పాతివ్రత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది.

బాధ్యత, కర్తవ్య నిర్వహణ
శ్రీరాముడు తండ్రి మాట కోసం అడవికి వెళితే, కుమారుడిగా ఆయన ధర్మానికి సీతమ్మ పూర్తి మద్దతు ఇచ్చింది. అలాగే రాముడు రాజుగా తన బాధ్యతల్లో భాగంగా ప్రజల కోసం కఠిన నిర్ణయం తీసుకున్నప్పుడు, సీతమ్మ ఆయన రాజధర్మానికి అడ్డుపడకుండా త్యాగానికి సిద్ధపడింది.
ఇద్దరూ తమ కర్తవ్యాలను చిత్తశుద్ధితో నిర్వర్తించారు. నేటి దంపతులు కూడా ఒకరి లక్ష్యాలకు, కుటుంబ బాధ్యతలకు మరొకరు మద్దతుగా నిలవాలి.
ప్రేమతో పాటే ఆత్మగౌరవం
ఏ బంధంలోనైనా ప్రేమ, త్యాగం ఎంత ముఖ్యమో ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం. సీతారాముల మధ్య అంతులేని ప్రేమ ఉన్నప్పటికీ, బంధంలో ఎవరి గౌరవాన్ని వారు నిలుపుకున్నారు.
సీతమ్మ చివరికి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసమే భూమాత ఒడిలోకి చేరి, శ్రీరాముడికి దూరమైంది. ప్రేమ పేరుతో ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదని, వ్యక్తిత్వానికి విలువ ఇవ్వాలని ఈ ఘట్టం నేటి తరానికి చాటిచెబుతోంది.



Click it and Unblock the Notifications