Latest Updates
-
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే!
ప్రస్తుత రోజుల్లో డేటింగ్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. అందులో తాజాగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సరికొత్త ట్రెండ్ డెలులు డేటింగ్ (Delulu Dating). డెలులు అంటే డెల్యూషనల్ (భ్రమలో బతకడం).
ప్రేమ పేరుతో వాస్తవాన్ని పూర్తిగా విస్మరించి, భాగస్వామి గురించి ఒక కల్పితమైన, పరిపూర్ణమైన చిత్రాన్ని మనసులో ముద్రించుకునే ధోరణినే డెలులు డేటింగ్ అంటారు. ఇందులో వ్యక్తులు తమ సంబంధం పట్ల ఒక ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు.

వాస్తవం కన్నా ఊహలకే పెద్దపీట
ఈ డేటింగ్ ట్రెండ్‌లో కనిపించే అతిపెద్ద సమస్య ఏమిటంటే.. ఎదుటి వ్యక్తి వాస్తవానికి ఎలా ఉన్నాడు? అనేదాని కంటే, భవిష్యత్తులో ఎలా మారతాడు? లేదా ఏం జరగవచ్చు? అనే ఊహలకే వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ భాగస్వామి ప్రవర్తనలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నా, వారి వల్ల బాధ కలుగుతున్నా వాటిని పట్టించుకోరు. కాలం గడిస్తే అంతా సర్దుకుంటుందిలే అని తమను తాము నమ్మించుకుంటారు.
తాము కోరుకున్నట్లుగా బంధం లేకపోయినా, ఒక అద్భుతమైన కథను తమ మనసులో అల్లుకుంటారు. అందుకే ఎదుటివ్యక్తి ప్రవర్తనలో ఎన్ని ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా వాటిని గుడ్డిగా విస్మరిస్తుంటారు.
ఎందుకిలా జరుగుతుంది?
దీని వెనుక బలమైన మానసిక కారణాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఒంటరితనం భయం: మళ్లీ ఒంటరిగా మిగిలిపోతామేమో అన్న భయం లేదా గత బంధాల్లో ఎదురైన చేదు అనుభవాల వల్ల దొరికిన ఈ కొత్త బంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని వీరు ఆరాటపడతారు.
సినిమాటిక్ ప్రేమ: నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు అని ప్రేమను అతిగా రొమాంటిసైజింగ్ గా ఉండటం కూడా ఒక కారణం.
సోషల్ మీడియా ప్రభావం: సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ కపుల్స్, వారి రొమాంటిక్ రీల్స్ చూసి.. నిజజీవితంలో కూడా తమ బంధం ఎలాంటి లోపాలు లేకుండా అలాగే ఉండాలని వీరు ఆశిస్తారు.
మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
మొదట్లో ఈ భ్రమల ప్రపంచం చాలా ఆనందంగా, సానుకూలంగా అనిపించవచ్చు. కానీ, వాస్తవం పదే పదే చెంప దెబ్బ కొడుతున్నప్పుడు తీవ్రమైన నిరాశ ఆవహిస్తుంది. పదే పదే అంచనాలు తలకిందులైనప్పుడు అది మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పరిస్థితులు చేయి జారినప్పుడు, తమను తామే నిందించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అంతేకాకుండా ఒక తప్పుడు వ్యక్తి కోసం కాలం వృథా చేయడం వల్ల నిజమైన ప్రేమను, ఆరోగ్యకరమైన సంబంధాలను గుర్తించే అవకాశాన్ని కూడా వీరు చేజార్చుకుంటారు.
నిపుణుల సలహా ఏంటి?
ప్రేమలో గుడ్డి నమ్మకం పనికిరాదు, వాస్తవానికి దగ్గరగా ఉండే సమతుల్య దృక్పథం ఉండాలి. బంధం మొదట్లోనే ఏవైనా తేడాలు గమనిస్తే, వాటిని దాటవేయకుండా కూర్చుని మాట్లాడుకోవాలి. ఒక బంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం మంచిదే, కానీ అది మీ ఆత్మగౌరవాన్ని, మీ భావోద్వేగాలను పణంగా పెట్టి మాత్రం కాకూడదు.



Click it and Unblock the Notifications
