Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Bhimavaram special recipe: భీమవరం స్పెషల్ 'చికెన్ మజ్జిగ పులుసు'..ప్లేట్ నాకేస్తారు..ఇలా చేసుకోండి
గోదావరి జిల్లాల్లో చికెన్ మజ్జిగ పులుసు చాలా ఫేమస్ వంటకం. ముఖ్యంగా భీమవరం ఏరియాలో చేసే చికెన్ మజ్జిగ పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. ప్లేట్ లో పెట్టుకుంటే ప్లేట్ మొత్తం నాకేస్తారు. చికెన్ మజ్జిగ పులుసు చాలు ఈ జీవితానికి అనేంత రుచిగా ఉంటుంది. ఈ చికెన్ పులుసుని ఇంట్లో సులభంగా ఎలా తయారుచేసుకోవాలి,తయారీకి కావాల్సిన పదార్థాలు ఏవో ఇక్కడ చూడండి.
చికెన్ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన
పదార్థాలు
-250 గ్రాముల చికెన్
-అరకిలో పెరుగు
-ఎండుమిర్చి
-ఉల్లిపాయ
-కరివేపాకు
-పచ్చిమిర్చి
-ఆయిల్
-పసుపు
-గరం మసాలా
-ఉప్పు
-జీలకర్ర
-ఆవాలు
-మెంతులు

చికెన్ మజ్జిగ పులుసు తయారీ విధానం
-250 గ్రాముల చికెన్ ముక్కలను ఉప్పు నీళ్లలో వేసి అరగంటసేపు నానబెట్టండి.
-స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పావు కప్పు ఆయిల్ పోసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు,4 చీలిన పచ్చిమిర్చి,కట్ చేసిన 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేయండి.
-ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.
-తర్వాత ఆ పాన్ లో ఉప్పు నీళ్లలో నానబెట్టిన 250 గ్రాముల చికెన్ ముక్కలను,అర టీ స్పూన్ పసుపు,రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసి బాగా కలిపి మంటలను మీడియంలో ఉంచి చికెన్ ను ఉడకనివ్వండి.
-అది ఉడుకుతున్న సమయంలోనే 10 పచ్చిమిర్చిలను మిక్సీగిన్నెలో వేసి మెత్తగా పేస్ట్ చేసి దాన్ని చికెన్ లో వేసి బాగా కలుపుకోండి.
-చికెన్ ను బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. దించే 5 నిమిషాల ముందు అందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి.
-చికెన్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పాన్ ని పక్కనపెట్టుకొని చికెన్ ను చల్లారనివ్వండి.
-ఇప్పుడు అరకిలో పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, 100ఎమ్ఎల్ నీళ్లు పోసి బాగా చిక్కగా ఉండేలా చిలుక్కోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి,అర టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోండి.
-ఈ వేగిన తాళింపుని,కొంచెం పసుపుని చిలుక్కున్న పెరుగులో వేసి బాగా కలుపుకోండి.తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి. అంటే చికెన్ మజ్జిగ పులుసు రెడీ. అరగంట సేపటి తర్వాత దీన్ని తింటే రుచి అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications