భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం!

Posted By:

కోడిగుడ్డును మనం ఉడకబెట్టి తింటాం, ఆమ్లెట్ వేసుకుంటాం, ఫ్రై, బుర్జీ ఇలా అనేక రకాల వెరైటీ వంటకాలు ఎగ్ తో తయారుచేసుకుంటాం. అయితే కోడిగుడ్డుతో ఎప్పుడూ తినే వంటకాలు కాకుండా భూటాన్ స్పెషల్ ఏమా దత్షీ ట్రై చేసి చూడండి. భూటాన్ లో కోడిగుడ్డుతో చేసే ఎమా దత్షీ వంటకం చాలా టేస్టీగా ఉంటుంది.

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేకి చాలా ఇష్టమైన వంటకం ఇది. దీని తయారీ కూడా చాలా ఈజీ. భూటానీస్ భాషలో ఏమా అంటే మిరపకాయ అని, దత్షీ అంటే జున్ను(చీజ్) అని అర్థం. భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Bhutan special egg ema datshi recipe in telugu ingredients and step by step guide

ఎగ్ ఏమా దత్షీ తయారీకి కావాల్సినవి

చీజ్ స్లైసెస్- 2
పచ్చిమిర్చి- 2
వెల్లుల్లి రెబ్బలు- 2
కోడిగుడ్లు- 2
మిరియాల పొడి- రుచికి తగినంత
ఉప్పు- సరిపడా
నీళ్లు-తగినంత
వెన్న-1 టీస్పూన్
చిల్లీ ఆయిల్- 1 టీస్పూన్

జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్!

ఎగ్ ఏమా దత్షీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిమీద ఒక పాన్ పెట్టంది. అందులో 1 టీస్పూన్ వెన్న వేసి వేడయ్యాక అందులో 2 వెల్లుల్లి రెబ్బల సన్నని తరుగు వేసి మంచి వాన వచ్చేదాకా వేయించాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి తరుగు వేసి 1 నిమిషం మగ్గనివ్వాలి.

-1 నిమిషం తర్వాత మంటను సిమ్ లో పెట్టి పాన్ లోని మిశ్రమంలో కొంచెం నీళ్లు పోయండి. తర్వాత అందులోనే 2 చీజ్ స్లైసెస్ వేసి అవి కంప్లీట్ గా కరిగి చిక్కటి క్రీమ్ లాంటి సాస్ తయారయ్యేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసి కలుపుకోండి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోండి

-ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకుని అందులో కొంచెం వెన్న వేసి అందులో రెండు కోడిగుడ్లు పగులకొట్టి హాఫ్ బాయిల్ లా వేయండి. దీనిమీద చిటికెడు ఉప్పు చల్లండి. తర్వాత ఈ గుడ్డ మీద ముందుగా రెడీ చేసుకున్న చీజ్ పచ్చిమిర్చి సాస్ మిశ్రమం నెమ్మదిగా పోయండి. తక్కువ మంట మీద గుడ్లు ఉడికేదాకా ఉంచాలి.

-సాస్ బాగా చిక్కబడి వేడక్కిన తర్వాత స్టవ్ ఆపేయండి. చివరగా దానీమీద కొద్దిగా చిల్లీ ఆయిల్ చల్లితే సరిపోతుంది.

-అంతే క్రిమీ భూటాన్ సంప్రదాయ వంటకం ఎగ్ ఏమా దత్షీ రెడీ. అన్నం, చపాతీ, బ్రెడ్ టోస్ట్ తో దీనిని తింటే అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, October 31, 2026, 12:31 [IST]
Desktop Bottom Promotion