Latest Updates
-
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు! -
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.!
బ్యాచ్‌లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.!
స్టడీస్, ఉద్యోగం కోసం సొంతూరుని వదిలి నగరాలకు వచ్చే బ్యాచ్‌లర్స్ తిండి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. హాస్టల్ ఫుడ్ తినలేరు. రూమ్ పెడితే స్వయం పాకం తప్పదు. అలా అనీ అందరికీ వంట రాదు అని కాదు. కానీ కొందరికి మాత్రం చేతులు కాల్చుకోవడమే తెలుసు. ఇక, ఇంట్లో కూరగాయలు లేవంటే మాత్రం అవి చెప్పరాని తిప్పలు. ఇప్పుడు ఆ టెన్షన్ వద్దు. ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా ఈ రెండూ ఉంటే చాలు.. ఇప్పటివరకూ వంటచేయని వారు కూడా దీనిని సులభంగా చేయవచ్చు. ఇక, చికెన్, మటన్ తిన్నంత ఫీలింగ్ కూడా వస్తుంది. అదే బిర్యానీ. బాస్మతి బియ్యం లేకుండానే ఘాటైన సువాసనలతో ఇంట్లో ఉండే బియ్యంతోనే ఈ బిర్యానీని ట్రై చేయండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు.

సోనా మసూరి బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు
సోనా మసూరి బియ్యం- కేజీ
ఏలకులు- 12
దాల్చిన చెక్క- పెద్దది ఒకటి
లవంగాలు- 20
పెరుగు- 100గ్రా
ధనియాల పొడి- టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్- నాలుగు టీస్పూన్లు
కారం- టీస్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
జీడిపప్పు పలుకులు- 20
ఉల్లిపాయలు- మూడు(మీడియం సైజు)
టమాటాలు- నాలుగు(మీడియం సైజు)
పచ్చిమిర్చి- మూడు
కొత్తిమీర- గుప్పెడు
పుదీనా- గుప్పెడు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
సోనా మసూరి బిర్యానీ తయారీ విధానం
కేజీ బియ్యంతో చేసే బిర్యానీని నలుగురు బ్యాచ్‌లర్స్ కడుపు నిండా తినవచ్చు. అలా కాకుండా మీ ఒక్కరి కోసమే అనుకుంటే అందుకు తగిన విధంగా బియ్యం పోసుకోవచ్చు. ఇక్కడ కేజీ బియ్యంతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం..
ఈ బిర్యానీ తయారీ కోసం ముందుగా కేజీ బియ్యాన్ని రెండు సార్లు బాగా కడిగి నీళ్లు పోసి గంటపాటు నానబెట్టుకోవాలి.

ఇప్పుడు ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలను దోరగా వేయించి మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి.
స్టవ్‌పైన కడాయి లేదా వెడల్పాటి బాణలి పెట్టుకుని అందులో నూనె పోసుకోవాలి. బాగా వేడయ్యాక పొడుగ్గా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. వాటితో పాటు కరివేపాకు వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేగనివ్వండి.
ఇప్పుడు పెరుగు వేసి బాగా కలిపి ఉడికించండి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఒక్కొక్కటిగా వేసుకుని కలపండి. చివరిగా టమాటాలు వేసి మెత్తగా అయ్యేవరకు మగ్గించండి.
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
మిశ్రమం అంతా చిక్కగా ఉడికిందని నిర్ధారించుకున్న తర్వాత గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోసి మరిగించుకోండి. ఎసరు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసుకుని కలుపుకోండి.
మూత పెట్టి 70 శాతం వరకు ఉడికించుకోండి. బియ్యం 70 శాతం ఉడికిన తర్వాత పక్కనపెట్టి స్టవ్‌పైన పెనం పెట్టి దానిపై బాణలి పెట్టుకుని చిన్న మంటపైన 15 నిమిషాల పాటు ఉంచండి.
బిర్యానీ ఉడకడం పూర్తయిన తర్వాత పై నుంచి పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు పలుకులు వేసి పైనుంచి కింది వరకు కలుపుకొని 10 నిమిషాల పాటు మూతపెట్టి ఉంచండి. అంతే బ్యాచ్‌లర్స్ ఈజీగా చేసుకునే టేస్టీ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
