Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఆరోగ్యానికి అమృతం లాంటి నల్ల నువ్వుల లడ్డూ..ఇలా చేసి రోజుకొకటి తింటే జుట్టు రాలడం, PCOD పరార్!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పోషక లోపం వల్ల జుట్టు రాలడం, చర్మం కాంతిహీనంగా మారడం, మహిళల్లో PCOD వంటి ఎన్నో సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. వీటన్నింటికీ ఒకే ఒక్క లడ్డూతో చెక్ పెట్టవచ్చని ప్రముఖ చెఫ్ అరుణా విజయ్ చెబుతున్నారు. ఎలాంటి చక్కెర వాడకుండా, ఎన్నో పోషకాల కలయికతో ఆమె ఒక అద్భుతమైన లడ్డూ రెసిపీని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అదే నల్ల నువ్వుల లడ్డు.
ఈ లడ్డూలలో గుడ్ ఫ్యాట్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా క్యాల్షియం గని అయిన నల్ల నువ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ నిండిన అవిసె గింజలు ఇందులో వాడటం వల్ల ఇది ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. రోజుకో లడ్డూ చొప్పున తినడం అలవాటు చేసుకుంటే.. నీరసం దరిచేరదు, హార్మోన్ల సమస్యలు అదుపులో ఉంటాయి. కురులు రాలడం తగ్గి, మీ చర్మం మళ్లీ నిగనిగలాడుతుంది.

నల్ల నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
స్వచ్ఛమైన నెయ్యి - 1 టేబుల్ స్పూన్
నల్ల నువ్వులు - అర కప్పు
అవిసె గింజలు- పావు కప్పు
వాల్ నట్స్ - అర కప్పు
గుమ్మడి గింజలు- 30-40 గ్రాములు
గింజ తీసిన ఖర్జూరాలు - 12
నల్ల నువ్వుల లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి తక్కువ మంట మీద వేడి చేయండి.
-నెయ్యి కరిగాక అందులో నల్ల నువ్వులు, అవిసె గింజలు, వాల్ నట్స్, గుమ్మడి గింజలు వేయాలి. సన్నని మంట మీద 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ గింజలన్నింటినీ దోరగా వేయించండి. ఇవి మాడిపోకుండా, కమ్మటి సువాసన వచ్చే వరకు గరిటెతో నిరంతరం తిప్పుతూనే ఉండాలి.
-గింజలు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో గింజ తీసిన ఖర్జూరాలతో పాటు ముందుగా వేయించి పెట్టుకున్న గింజల మిశ్రమాన్ని వేసి కాస్త బరకగా (కరకరలాడేలా) గ్రైండ్ చేసుకోవాలి.
-ఖర్జూరం వాడటం వల్ల ఈ మిశ్రమం కాస్త జిగురుగా మారి, ముద్ద చేయడానికి వీలుగా తయారవుతుంది. ఇప్పుడు కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని తీసుకుని మీకు నచ్చిన పరిమాణంలో గుండ్రటి లడ్డూల్లా చుట్టుకోండి.
-తయారుచేసిన లడ్డూలను వెంటనే డబ్బాలో పెట్టకుండా, ఒక 10-15 నిమిషాల పాటు గాలికి వదిలేయండి. ఇలా చేయడం వల్ల లడ్డూలు చక్కగా గట్టిపడతాయి.
నల్ల నువ్వుల లడ్డు నిల్వ విధానం
లడ్డూలు పూర్తిగా చల్లారాక ఒక గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోండి. ఇవి బయట గది ఉష్ణోగ్రత వద్ద పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఒకవేళ లడ్డూ చుట్టడానికి మిశ్రమం పొడిపొడిగా అనిపిస్తే, మరొక రెండు మెత్తటి ఖర్జూరాలను మెత్తగా దంచి కలపండి. లేదా కొద్దిగా గోరువెచ్చని నెయ్యిని కలుపుకున్నా లడ్డూలు పర్ఫెక్ట్ గా వస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
