Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్!
సాధారణంగా మనం ఉల్లిపాయ పకోడీ లేదా క్యాబేజీ పకోడీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా తీపి, కారం కలగలిపిన మొక్కజొన్న పకోడీని ట్రై చేశారా? రుచిలో దీనికి సాటి మరొకటి లేదు. పైగా తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇంట్లో ఉండే పదార్థాలతోనే కేవలం పది నిమిషాల్లో ఈ క్రంచీ స్నాక్ రెడీ చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ లొట్టలేసుకుంటూ తినే ఈ మొక్కజొన్న పకోడీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

మొక్కజొన్న పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు - ఒక కప్పు
శెనగపిండి - అర కప్పు
బియ్యపు పిండి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు - నాలుగు ఆకులు
కొత్తిమీర - అర కట్ట
కారం - ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
మొక్కజొన్న పకోడీ తయారీ విధానం
-ముందుగా తాజా మొక్కజొన్న గింజలను తీసుకుని, మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లా చేయకూడదు, గింజలు కాస్త తగులుతూ ఉంటేనే పకోడీకి అసలైన రుచి వస్తుంది. గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు ఆ మొక్కజొన్న ముద్దలో అర కప్పు శెనగపిండి, పకోడీలు కరకరలాడటం కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా చేత్తో గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పకోడీ పిండిలా తయారుచేసుకోవాలి.
-పిండిని నూనెలో వేసే ముందు చివరగా అందులో చిటికెడు వంట సోడా వేసి మరోసారి కలపాలి. ఇలా చేయడం వల్ల పకోడీలు లోపల గుల్లగా, బయట కరకరలాడుతూ వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత, పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న పకోడీలుగా నూనెలో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, పకోడీలను అటూ ఇటూ తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి మొక్కజొన్న పకోడీ రెడీ. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని, టొమాటో సాస్ లేదా కమ్మటి పల్లీల చట్నీతో అద్దుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
