Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
అచ్చం రెస్టారెంట్ రుచితో రిచ్ చికెన్ కోఫ్తా కర్రీ.. ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా అవ్వాల్సిందే!
వీకెండ్ వచ్చిందంటే చాలు అందరికీ ఏదైనా స్పెషల్ గా, కొంచెం కొత్తగా తినాలనిపిస్తుంది. ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే సాధారణ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కాకుండా.. ఈసారి కాస్త రిచ్ గా, క్రీమీగా ఉండే చికెన్ కోఫ్తా కర్రీని ట్రై చేయండి. చపాతీ, బటర్ నాన్, రోటీ, బగారా రైస్ లేదా బిర్యానీ దేనిలోకైనా ఈ కర్రీ అద్భుతమైన కాంబినేషన్. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువైన చికెన్ కోఫ్తాలు, జీడిపప్పు-బాదంతో చేసిన క్రీమీ గ్రేవీ.. ఈ రెసిపీ మీ ఇంట్లో వాళ్లందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

చికెన్ కోఫ్తా తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ - 250 గ్రాములు
కారం - అర టీస్పూన్
చికెన్ మసాలా పౌడర్ - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా పౌడర్ - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
బాదం పప్పులు - 5
జీడిపప్పు - 7
పుచ్చ గింజలు - 2 టేబుల్ స్పూన్లు
టమాటో - 1
ఫ్రైడ్ ఆనియన్స్ - 2 ఉల్లిపాయలవి
పెరుగు - పావు కప్పు
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
చికెన్ మసాలా - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
హోల్ గరం మసాలా (చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా) - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
చికెన్ కోఫ్తా తయారీ విధానం
-ముందుగా శుభ్రం చేసిన బోన్ లెస్ చికెన్ ను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా (ఖీమా) చేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ చికెన్ మిశ్రమాన్ని తీసుకుని.. అందులో కారం, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ చికెన్ కు పట్టిన తర్వాత, చిన్న చిన్న నిమ్మకాయ సైజులో బాల్స్ (కోఫ్తాలు) చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె వేడి చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, రెడీ చేసుకున్న చికెన్ బాల్స్ ను 5 నుండి 7 నిమిషాల పాటు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాదం, జీడిపప్పు, పుచ్చ గింజలు, కట్ చేసిన టమాటో ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లే కర్రీకి రెస్టారెంట్ లాంటి రుచి వస్తుంది.
-మరొక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రేవీ పేస్ట్ ను వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను పచ్చివాసన పోయేలా సుమారు 5 నిమిషాల పాటు నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.
-ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం వేసి అన్నీ బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి గ్రేవీని ఉడికించాలి.
-గ్రేవీ చక్కగా ఉడుకుతున్నప్పుడు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కోఫ్తా బాల్స్ ను అందులో వేయాలి. మంటను పూర్తిగా తగ్గించి, మూతపెట్టి మరో 7 నిమిషాల పాటు ఉడికించాలి.
-చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో గుమగుమలాడే రుచికరమైన చికెన్ కోఫ్తా కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
