Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
చపాతీ, రైస్ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..అదిరిపోయే టమాటో చికెన్ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా దోసె, చపాతీ లేదా పూరీ చేసుకున్నప్పుడు.. మధ్యాహ్నం వేడి వేడి అన్నంలోకి కలుపుకోవడానికి ఎప్పుడూ ఒకే తరహా చికెన్ కూర చేసుకుని బోర్ కొట్టిందా? అయితే ఈసారి మీ రొటీన్ కి భిన్నంగా, నోటికి ఎంతో రుచిగా తగిలే అద్భుతమైన నార్త్ ఇండియా స్టైల్ టమాటో చికెన్ గ్రేవీని ప్రయత్నించి చూడండి. ఈ గ్రేవీ కేవలం చపాతీ, పూరీలకే కాకుండా.. బగారా రైస్, పులావ్, లేదా సాధారణ తెల్ల అన్నంతో కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే.

బోన్‌లెస్ చికెన్ - 1 కిలో
నూనె - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు - 4
టొమాటో ప్యూరీ- 2 కప్పులు
వేయించిన ఉల్లిపాయలు- అర కప్పు
కశ్మీరీ కారం పొడి - 3 టేబుల్ స్పూన్లు
గరం మసాలా పొడి - అర టీస్పూన్
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
టమాటో చికెన్ గ్రేవీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కోసి, నూనెలో దోరగా (బంగారు గోధుమ రంగు వచ్చేలా) వేయించి పక్కన పెట్టుకోండి. ఇవే ఫ్రైడ్ ఆనియన్స్.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, మందపాటి అడుగు ఉన్న కడాయి లేదా పాన్ పెట్టుకోండి. అందులో నెయ్యి, నూనె వేసి మీడియం మంటపై వేడి చేయండి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనీయండి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో శుభ్రం చేసుకున్న బోన్ లెస్ చికెన్ ముక్కలను వేసి మంటను కొద్దిగా పెంచి 3- 4 నిమిషాల పాటు బాగా వేయించండి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్కలు జ్యూసీగా ఉంటాయి.
-ఇప్పుడు కడాయిలో సగానికి చీల్చిన పచ్చిమిర్చి, తురిమిన టమాటోలు, ముందుగా సిద్ధం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కశ్మీరీ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపండి. ఇప్పుడు మంటను బాగా తగ్గించి మూత పెట్టి ఉడికించండి. సుమారు 30 నిమిషాల పాటు చికెన్ మెత్తబడే వరకు నిదానంగా ఉడకనివ్వాలి.
-చికెన్ లోని నీరు, టమాటోల్లోని రసం బయటకు వచ్చి అదే గ్రేవీలా మారుతుంది కాబట్టి చుక్క నీరు కూడా కలపాల్సిన అవసరం లేదు. అయితే అడుగంటకుండా మధ్యమధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతూ ఉండాలి.
-చికెన్ ముక్కలు ఉడికి, నూనె పైకి తేలుతున్నప్పుడు అందులో గరం మసాలా పొడి, సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లి బాగా కలపండి. ఉప్పు సరిచూసుకుని దించేయండి. అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే వేడి వేడి టమాటో చికెన్ గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
