Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
15 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా ఎగ్ మసాలా..రుచి మొగ్గలకు కొత్త అనుభూతి
రోజూ తినే చపాతీ, దోసెల్లోకి అవే పాత కూరలు తిని విసిగిపోయారా? ఏదైనా కొత్తగా, రుచిగా ప్రయత్నించాలని ఉందా? అయితే కేవలం నాలుగు కోడిగుడ్లు, గుప్పెడు పుదీనాతో అదిరిపోయే పుదీనా ఎగ్ మసాలా ట్రై చేయండి. పలావ్, చపాతీ, దోస, పూరీ ఇలా దేనిలోకైనా సరే భలే ఉంటుంది.
సాధారణంగా ఎగ్ కర్రీ అంటే ఉల్లిపాయ, టమాటా గ్రేవీలో ఉడికించిన గుడ్లు వేసి వండటం మనకు అలవాటు. కానీ ఆ మూసధోరణికి భిన్నంగా తాజా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిల ఘాటైన మిశ్రమంతో చేసే ఈ గ్రేవీ మీ రుచి మొగ్గలకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. నోరూరించే ఎగ్ పుదీనా మసాలా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు - 4
పుదీనా ఆకులు - 1 కప్పు
కొత్తిమీర - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 4
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4-5
సోంపు - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీస్పూన్
పెద్ద ఉల్లిపాయ - 1
కరివేపాకు - ఒక రెమ్మ
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2-3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గుడ్లు మునిగేంత నీరు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పెంకులు తీసి వాటికి చిన్నగా గాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో శుభ్రం చేసుకున్న కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-మసాలా వేపుడు: స్టవ్ మీద బాణలి పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.
- ఉల్లిపాయలు వేగిన తర్వాత అర టీస్పూన్ పసుపు వేసి కలిపి వెంటనే మనం సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్ ను అందులో వేయాలి. మంటను మీడియంలో ఉంచి పేస్ట్ లోని పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలేంత వరకు సుమారు ఐదు నిమిషాల పాటు బాగా వేయించాలి.
-మసాలా చక్కగా ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. గ్రేవీ గుడ్లకు బాగా పట్టేలా మెల్లగా కలిపి, మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్‌లో మగ్గనివ్వాలి.
-అంతే ఘుమఘుమలాడే, కమ్మని పుదీనా ఎగ్ గ్రేవీ రెడీ.
-ఈ వేడివేడి గ్రేవీని చపాతీ, పూరీ లేదా వేడివేడి అన్నంతో తింటుంటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. ఈసారి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, ఈ కొత్త వంటకాన్ని చేసి పెడితే ప్రశంసలు ఖాయం
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications