Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి
సీఫుడ్ ప్రియులకు చేపల వేపుడు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరకరలాడే ఫిష్ ఫ్రై ఉంటే చాలు కంచం మొత్తం ఖాళీ చేసేయొచ్చు. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే వేపుడు కాకుండా, కొద్దిగా కొత్తగా, అద్భుతమైన రుచితో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఒక స్పెషల్ వైరల్ ఫిష్ ఫ్రై ట్రై చేస్తే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు.

ఈ రెసిపీ కోసం ఇక్కడ చందువా చేపలను ఉపయోగిస్తారు. అయితే మీరు మీ అభిరుచికి తగ్గట్టుగా మీకు నచ్చిన ఏ చేపలైనా వాడుకోవచ్చు. మరి నోరూరించే మసాలా ఫిష్ ఫ్రై సులభంగా ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
మసాలా ఫిష్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
చందువా చేపలు (Silver Pomfret) - 500 గ్రాములు
కొబ్బరి నూనె - 15 ml
పసుపు - అర టీస్పూన్
కాశ్మీరీ కారం - 4 టీస్పూన్లు
దంచిన మిరియాల పొడి - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
సాంబార్ ఉల్లిపాయలు- 5 నుండి 7
కరివేపాకు - ఒక రెమ్మ
చింతపండు గుజ్జు -తగినంత
ఉప్పు - తగినంత
మసాలా ఫిష్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించకుండానే ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. అందులో కొబ్బరి నూనె వేసి, దానికి పసుపు, కాశ్మీరీ కారం, రుచికి సరిపడా ఉప్పు, దంచిన మిరియాల పొడి వేసి బాగా కలపండి. ఇవన్నీ నూనెలో కలిసి ఒక చిక్కటి పేస్ట్ లాగా మారాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు మాడిపోకుండా ఉంటాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, మంటను సిమ్ లో ఉంచి ఆ పాన్ పెట్టండి. ఈ మసాలా మిశ్రమాన్ని ఒక 30 సెకన్ల పాటు వేయించండి. ఆ తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసి మరో నిమిషం పాటు ఉడికించండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, దంచిన చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో చాకుతో గాట్లు పెట్టుకున్న చేపలను ఆ పాన్ లో వేయండి. పాన్ లోని మసాలా అంతా చేపలకు రెండు వైపులా సమానంగా పట్టేలా చూడండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి చేపలను వేయించుకోవాలి. మధ్యమధ్యలో చేపలను రెండు వైపులా తిప్పుతూ ఉండాలి. ఇలా 3 నుండి 4 సార్లు తిప్పడం వల్ల మసాలా లోపలికి వెళ్లి చేపలు అద్భుతంగా ఉడుకుతాయి.
-చేపలు పూర్తిగా ఉడికి, లోపల జ్యూసీగా, పైన క్రిస్పీగా తయారవ్వడానికి సుమారు 8 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. చేపలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.
-అంతే ఎంతో ఘుమఘుమలాడే ఫిష్ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలోకి ఈ పుల్లపుల్లని, కారంకారంగా ఉండే మసాలా ఫిష్ ఫ్రైని నంచుకుని తింటుంటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
