Latest Updates
-
తుల, మిథున, కుంభ రాశుల వారికి శుక్రవారం ధనయోగం.. మీ రాశి ఉందా? - శుక్రవారం, 03 ఏప్రిల్ 2026 -
గుడ్ ఫ్రైడే 2026..మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
కరకరలాడే పనీర్ కట్లెట్స్..రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పక్కా స్ట్రీట్ స్టైల్ మోమోస్ చట్నీ..దీన్ని నంజుకొని తింటుంటే ఎన్నైనా అలా పోతూ ఉంటాయ్! -
రోజూ తినే రైతాతో బోర్ కొట్టిందా? అయితే కమ్మని తడ్కా వెజిటబుల్ రైతా ట్రై చేయండి! -
శాడిస్ట్ పెళ్లాంతో తట్టుకోలేకపోతున్నా: భార్య శృంగార కోరిక తీర్చలేక..పోలీస్ స్టేషన్ లో భర్త కంప్లెయింట్! -
రైస్ పొటాటో ఊతప్పం..ఇంతకుముందు తిన్న ఊతప్పం రుచులన్నీ మర్చిపోతారు! -
Hanuman Mantras: మోస్ట్ పవర్ ఫుల్ హనుమాన్ మంత్రాలు..దెయ్యాలు కూడా గజగజ వణకాల్సిందే! -
సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - గురువారం, 02 ఏప్రిల్ 2026 -
నోటికి ఏమీ రుచించట్లేదా? అయితే ఈ ఘాటైన వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి!
రొటీన్ లంచ్ బాక్స్ బోర్ కొడుతోందా? అయితే ఈ పుచ్చకాయ రైస్ టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!
రోజూ ఒకే రకమైన రొటీన్ భోజనం బాక్స్ లో పెట్టుకుని వెళ్లి బోర్ కొడుతోందా? మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెరవగానే ఏదైనా కొత్తగా, కలర్ ఫుల్ గా, నోరూరించేలా ఉంటే బాగుండు అనిపిస్తుందా? అయితే పుచ్చకాయ రైస్ ఓ సారి రుచి చూసి తీరాల్సిందే. సాధారణంగా పుచ్చకాయను ముక్కలుగా కోసుకుని తినడం లేదా జ్యూస్ చేసుకుని తాగడం మనం చూస్తుంటాం.
కానీ, పుచ్చకాయతో రైస్ వినడానికి కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ, రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రముఖ వంటల నిపుణుడు మాస్టర్ చెఫ్ హ్యారీ పరిచయం చేసిన ఈ రెసిపీ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. పండ్లలోని సహజమైన తీపి, బిర్యానీ మసాలాల ఘాటు కలగలిపి ఈ వంటకం భోజన ప్రియులను కట్టిపడేస్తుంది.
పుచ్చకాయ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బాస్మతి బియ్యం
-పుచ్చకాయ
-నూనె
-గరం మసాలా
-చిల్లీ ఫ్లేక్స్
-కొత్తిమీర
-ఉప్పు
-గుమ్మడికాయ గింజలు
-తెల్ల నువ్వులు
సైడ్ డిష్ సలాడ్ కోసం
-మినపప్పు
-పచ్చి బఠాణీలు
-పనీర్ ముక్కలు
-నల్ల నువ్వులు
-ఉప్పు
పుచ్చకాయ రైస్ తయారీ విధానం
-ముందుగా ఒక పుచ్చకాయను తీసుకుని పైన చెక్కు మొత్తం తీసేయాలి. తర్వాత లోపలి ఎర్రటి భాగాన్ని ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో పుచ్చకాయ ముక్కలను వేసి జ్యూస్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టి అందులో ముందుగా కడిగి పెట్టుకున్న 1 కప్పు బియ్యం వేయండి. ఇప్పుడు ఇందులో నీళ్లకు బదులుగా 3 కప్పుల ఫ్రెష్ పుచ్చకాయ రసం కలపండి. ఇందులోనే 1 స్పూన్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం కోసం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం గరం మసాలా వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టకుండా వండాలి. మంటను మీడియం నుండి తక్కువకు అడ్జస్ట్ చేసుకుని, మధ్యమధ్యలో నెమ్మదిగా కలుపుతూ అన్నం మెత్తగా ఉడికే వరకు కుక్ చేయండి.
-అన్నం ఉడికిన తర్వాత స్టవ్ మీద తాలింపు కోసం బాండీ పెట్టి అందులో 1 స్పూన్ నూనె వేడి చేసి ఇందులో గుమ్మడికాయ గింజలు, తెల్ల నువ్వులు వేసి దోరగా వేయించి వీటిని అన్నం పైన వేయండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే.. స్వీట్ అండ్ స్పైసీ పుచ్చకాయ రైస్ రెడీ.
-ఇప్పుడు రైస్ లోకి సైడ్ డిష్ గా ప్రోటీన్ రిచ్ సలాడ్ చేసుకోండి. ఇందుకోసం ఒక పాన్ లో 1 స్పూన్ నూనె వేడి చేయండి. అందులో 1 టీస్పూన్ మినపప్పు వేసి, గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించండి.
-పప్పు వేగి కమ్మటి వాసన రాగానే, అందులో వేడి నీటిలో ఉడికించిన పచ్చి బఠానీలు, చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకున్న పనీర్ ముక్కలు వేయండి. దీని పైన కొద్దిగా నల్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు చల్లి ఒకసారి బాగా టాస్ చేయండి. పనీర్ సాఫ్ట్ గా అయ్యేదాకా సన్నని మంటపై వేడి చేస్తే హెల్దీ సలాడ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







