Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
రోజూ తినే రైతాతో బోర్ కొట్టిందా? అయితే కమ్మని తడ్కా వెజిటబుల్ రైతా ట్రై చేయండి!
మండుతున్న వేసవి కాలం వచ్చేసింది. ఈ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చల్లచల్లగా ఏదైనా తినాలని మనసుకు అనిపించడం సహజం. మన భోజనంలో చల్లటి పెరుగు లేదా రైతా ఉంటే ఆ ఆనందమే వేరు. రైతా కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరంలోని వేడిని తగ్గించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే రోజూ అదే బూందీ రైతా లేదా దోసకాయ రైతా తిని మీకు బోర్ కొట్టిందా? భోజనంలో ఏదైనా కొత్త రుచిని ఆస్వాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఎండాకాలంలో పోషకాలు పుష్కలంగా ఉండే నోరూరించే తడ్కా వెజిటబుల్ రైతా మీకు బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. దీన్ని తయారు చేయడం చాలా సులువు.

తడ్కా వెజిటేబుల్ రైతా తయారీకి కావలసిన పదార్థాలు
చిక్కటి తాజా పెరుగు - 2 కప్పులు
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
గింజలు తీసేసిన టమాటా - 1
దోసకాయ - 1
తురిమిన క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
నల్ల ఉప్పు- రుచికి సరిపడా
కారం పొడి - చిటికెడు
పచ్చిమిర్చి - 1
తాజా కొత్తిమీర - తగినంత
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
కరివేపాకు - 4 ఆకులు
ఇంగువ - చిటికెడు.
తడ్కా వెజిటేబుల్ రైతా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో చిక్కటి పెరుగు వేసి ఉండలు లేకుండా గిలకొట్టాలి. ఒకవేళ పెరుగు మరీ చిక్కగా అనిపిస్తే, కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసి మీకు కావలసినంత చిక్కదనం వచ్చేలా కలుపుకోండి.
-ఇప్పుడు ఈ పెరుగులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, దోసకాయ ముక్కలతో పాటు తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపండి. ఆ తర్వాత వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు వేసి కలపాలి. పైన కొద్దిగా కారం పొడి, సన్నగా తరిగిన పచ్చని కొత్తిమీర చల్లుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ పెట్టుకుని, అందులో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి.
-ఆవాలు చిటపటలాడి, కరివేపాకు కమ్మని సువాసన రావడం మొదలవ్వగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. పోపు మాడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
-వేడివేడిగా ఉన్న ఈ పోపును (తడ్కా) మనం ముందుగా సిద్ధం చేసుకున్న వెజిటబుల్ రైతాపై పోసి మెల్లగా కలపాలి. అంతే గుమగుమలాడే తడ్కా వెజిటబుల్ రైతా రెడీ. దీనిని మరింత రుచిగా ఆస్వాదించడానికి కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరుచుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications